స్వేచ్ఛగా విహరిస్తున్న నిహారిక... మైండ్ బ్లాక్ చేసేలా లేటెస్ట్ ఆల్ట్రా స్టైలిష్ లుక్!

Published : Jun 19, 2023, 01:22 PM ISTUpdated : Jun 19, 2023, 01:42 PM IST

నిహారిక కొణిదెల స్వేచ్ఛా విహంగంలా విహరిస్తోంది. ఆమె పూర్తి ఫోకస్ కెరీర్ పై పెట్టారు. నిహారిక లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 

PREV
16
స్వేచ్ఛగా విహరిస్తున్న నిహారిక... మైండ్ బ్లాక్ చేసేలా లేటెస్ట్ ఆల్ట్రా స్టైలిష్ లుక్!


నిహారిక భర్త వెంకట చైతన్యతో విడిపోయారు. అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ తాజా పరిస్థితులతో ఒక క్లారిటీ వచ్చింది. ఇటీవల నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం వేడుక జరిగింది. నాగబాబు నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ ఈవెంట్ కి నిహారిక ఒంటరిగా హాజరైంది. ఆమెతో వెంకట చైతన్య కనిపించలేదు. 

26

దీంతో ఆమె పరోక్షంగా స్పష్టత ఇచ్చినట్లు అయ్యింది. 2023 మార్చి నెలలో వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు తొలగించాడు. కొద్దిరోజుల అనంతరం నిహారిక కూడా భర్త జ్ఞాపకాలు చెరిపేసింది. అక్కడ మొదలైన విడాకుల పుకార్లకు ఒక స్పష్టత వచ్చింది. 
 

36
Niharika

నిహారిక నటిగా, నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె హైదరాబాద్ లో భారీ ఆఫీస్ ఓపెన్ చేశారు. యంగ్ టాలెంట్ తో సినిమాలు, సిరీస్లు నిర్మించే ప్రణాళికలు వేస్తున్నారు. అదే సమయంలో నటిగా రాణిస్తున్నారు. భర్తతో విడిపోయిన నిహారిక పూర్తి దృష్టి కెరీర్ పై పెట్టారు. 
 

46
Niharika Konidela

కాగా 'డెడ్ పిక్సెల్స్' టైటిల్ తో నిహారిక ఓ వెబ్ సిరీస్ చేశారు. హాట్ స్టార్ లో మే 19 నుండి ఇది స్ట్రీమ్ అవుతుంది. డెడ్ పిక్సెల్స్ సిరీస్ ఓ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కింది. ఆన్లైన్ గేమ్స్ యూత్ ని ఊపేస్తున్నాయి. ఈ గేమ్ పార్టనర్స్ లైఫ్ పార్టనర్స్ గా కూడా మారిపోతున్నారు. ఆ కాన్సెప్ట్ తో డెడ్ పిక్సెల్స్ తెరకెక్కింది.

56


నిహారిక ఈ సిరీస్లో గాయత్రి అనే రోల్ చేశారు. తనతో పాటు ఆన్లైన్ గేమ్ ఆడే పాత్రల్లో అక్షయ్ లాగుసాని, వైవా హర్ష నటించారు. ఇద్దరి వ్యక్తులను ఇష్టపడే అమ్మాయిగా నిహారిక క్యారెక్టర్ చూపించారు. డెడ్ ఫిక్సెల్ సిరీస్ ఏమంత ప్రాచుర్యం పొందలేదు. 

66
Niharika Konidela

అలాగే గ్లామరస్ ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు. నిహారిక లేటెస్ట్ ఆల్ట్రా స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది. స్పాట్ లైట్ నేను కోరుకోలేదు. స్పాట్ లైట్ నన్ను కోరుకుంది అంటూ ఆ ఫోటోకి కామెంట్ పెట్టారు. నిహారిక ఫోటో షూట్స్ ఒకింత హద్దులు దాటేస్తున్నాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. 
 

click me!

Recommended Stories