బెడ్ పై జాక్వెలిన్ ఖతర్నాక్ ఫోజులు.. కిర్రాక్ అవుట్ ఫిట్ లో ప్రభాస్ బ్యూటీ అందాల రచ్చ...

First Published | Jun 19, 2023, 1:52 PM IST

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)  స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. అదిరిపోయే ఫొటోషూట్ తో నెటిజన్ల చూపును కట్టిపడేసింది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సౌత్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపే దక్కించుకుంది. బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ దక్షిణాదిలో  కొద్దిమేర అవకాశాలను దక్కించుకుంటోంది. 
 

నటిగా సౌత్ లో ఆఫర్లు లేకపోయినా.. స్పెషల్ అపియరెన్స్ తో మాత్రం ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంది. అప్పటికే స్లిమ్ ఫిట్ అందాలను కలిగిన జాక్వెలిన్ అద్భుతమైన డాన్స్ తోనూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
 


తొలుత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో ‘సాహో’ చిత్రంలో గ్లామర్ స్టెప్పులేసింది. ‘బాడ్ బాయ్’ అంటూ తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఒక్కసాంగ్ తోనే సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇంకాస్తా ఫాలోయింగూ పెంచుకుంది.

దాంతో కన్నడ నుంచి వచ్చిన ‘విక్రాంత్ రోణా’లోనూ ఈ ముద్దుగుమ్మ స్పెషల్ అపియరెన్స్ కు ఛాన్స్ దక్కించుకుంది. ‘రా రా రక్కమ్మ’ అనే సాంగ్ ఎంతలా సెన్సేషనల్ అయ్యిందో తెలిసిందే. దీంతో దక్షిణాదిలో మరింత క్రేజ్ దక్కించుకుంది. 

ప్రస్తుతం బాలీవుడ్ లోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాతో అలరిస్తోంది. లీడ్ గానే కాకుండా కీలక పాత్రల్లోనూ నటిస్తూ మెపిస్తోంది. దీంతో సినిమా ఆఫర్లు కూడా దండిగానే వస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు చిత్రాలే ఉన్నాయి. 
 

ఇదిలా ఉంటే.. జాక్వెలిన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. క్రేజీ పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా జాక్వెలిన్ చేసే ఫొటోషూట్లు మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. తాజాగా స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది.
 

పింక్ డ్రెస్ లో జాక్వెలిన్ మోడ్రన్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా బెడ్ పై టెంప్టింగ్ గా ఫోజులిచ్చింది. మత్తు చూపులు, మత్తెక్కించే స్టిల్స్ తో మతులు పోగొట్టింది. బ్యూటీఫుల్ స్మైల్ తో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. దీంతో ఫ్యాన్స్  కామెంట్లతో ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

కేరీర్ ను జోరుగా కొనసాగిస్తున్న జాక్వెలిన్ మరోవైపు వివాదాల్లోనూ చిక్కుకుంది. 200 కోట్ల కుంభకోణంలో నిందితుడైన సుఖేశ్ చంద్రతో ఎఫైర్ కొనసాగించిందనే ఆరోపణలు ఎదుర్కొంది. సిట్ విచారణకు హాజరైంది. ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం జాక్వెలిన్ ‘క్రాక్’,‘ఫతెహి’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!