నిజం చెప్పండి మీరూ, అత్తయ్య నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అంటుంది కృష్ణ. అమ్మకి మన అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి తెలిసింది అందుకే మనల్ని ఒకటి చేయాలని ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంది అని మనసులో అనుకుంటాడు మురారి. ఏదో ఫోన్ వచ్చింది అని చెప్పి కంగారుగా అక్కడినుంచి వెళ్ళిపోయి తప్పించుకుంటాడు. కచ్చితంగా వీళ్ళిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు అనుకుంటుంది కృష్ణ.