అల్లు అర్జున్ ఆ సూపర్ హీరో పాత్రకు ఫెరఫెక్ట్, తేల్చేసిన ముఖేష్ ఖన్నా

First Published | Dec 13, 2024, 2:11 PM IST

పుష్ప 2 చిత్రం చూసిన ముఖేశ్ ఖన్నా, అల్లు అర్జున్ నటనను ప్రశంసిస్తూ శక్తిమాన్ పాత్రకు ఆయన సరైన ఎంపిక అని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ కంటే దక్షిణాది చిత్ర పరిశ్రమలోని కొన్ని అంశాలను బాలీవుడ్ నేర్చుకోవాలని కూడా ఆయన సూచించారు.

Mukesh Khanna, Pushpa 2, Allu Arjun, Shaktimaan

హాలీవుడ్ లో అంటే చాలా సూపర్ హీరో పాత్రలకు ఉన్నాయి. అయితే మన భారతీయులకు అత్యంత దగ్గరైన సూపర్ హీరో 'శక్తిమాన్'. 90వ దశకంలో ప్రసారమైన ఈ సీరియల్ యువతకే కాదు పెద్దలకూ నచ్చింది. ఇండియన్ టీవీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్స్‌లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు ఈ పాత్రతో ఓ సినిమా రాబోతోంది. అయితే శక్తిమాన్ గా చేసే హీరో ఎవరన్నది మాత్రం బయిటకు రాలేదు. చాలా ఆప్షన్స్ వినపడుతున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ అయితే ఆ పాత్రకు ఫెరఫెక్ట్ గా సెట్ అవుతారు అంటున్నారు ముఖేశ్ ఖన్నా.
 

allu arjun

రీసెంట్ గా ముఖేశ్ ఖన్నా ..పుష్ప 2 చిత్రం చూసారు. ఆ సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. అల్లు అర్జున్‌ (Allu Arjun) నటించిన ‘పుష్ప 2 ది రూల్‌’ (Pushpa 2 The Rule) అద్భుతంగా ఉందన్నారు . ప్రతి సీన్ ని చూడచక్కగా తెరకెక్కించారని చెప్పారు. పెట్టిన ప్రతి రూపాయికీ న్యాయం జరిగిందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈమేరకు తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు.

Tap to resize

Allu Arjun, Pushpa 2 , Box-office Collections

ముఖేష్ ఖన్నా మాట్లాడుతూ..‘‘కేవలం డబ్బుతోనే ఈ సినిమా తెరకెక్కించలేదు. విజన్‌, సరైన ప్రణాళికతో దీనిని రూపొందించినట్లు సినిమా చూస్తే తెలుస్తోంది. పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్‌పై కనిపిస్తుంది. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ చిత్రాలను నమ్మకం పెట్టి తెరకెక్కిస్తే ప్రేక్షకులు దానిలో లాజిక్స్‌ వెతకరు.

అల్లు అర్జున్‌ నటించిన గత చిత్రాలను పెద్దగా నేను చూడలేదు. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన గత చిత్రాలు చూడాలనే ఆలోచన వచ్చింది. ఈ ప్రదర్శన చూసిన తర్వాత ‘శక్తిమాన్‌’ పాత్రకు ఆయన అయితేనే సరైన న్యాయం చేయగలరని అనిపిస్తుంది’’ అన్నారు.

pushpa 2

ఎప్పటిలాగే ఆయన  బాలీవుడ్‌పై విమర్శల వర్షం కురిపించారు. ‘‘దక్షిణాది చిత్రాల నుంచి హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన దర్శక, నిర్మాతలు ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఉదాహరణకు.. ఈ సినిమాలో భార్యాభర్తల సన్నివేశాలను చూడచక్కగా చిత్రీకరించారు.

ఎక్కడా అభ్యంతరకరంగా అనిపించలేదు. కానీ, బాలీవుడ్‌లో అలాకాదు. దంపతుల మధ్య ఏదైనా సీన్స్‌ ఉంటే వాటికి అశ్లీలత జోడించి చూపిస్తారు. హద్దులు మీరి తెరకెక్కిస్తారు. అలాంటి సన్నివేశాల వల్ల డబ్బులు అయితే సంపాదించవచ్చు కానీ.. అది ఎంతవరకు సరైనది’’ అని ముఖేశ్‌ ప్రశ్నించారు.

మరో ప్రక్క బాలీవుడ్ క్రేజీ హీరో రణవీర్ సింగ్ ‘శక్తిమాన్’ పాత్రను పోషించనున్నారని బీ టౌన్ లో టాక్ వినిపిస్తుంది. సూపర్ హీరో చిత్రాలకు దర్శకత్వం వహించిన అనుభవం ఉన్న మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

టోవినో థామస్ హీరోగా ‘మిన్నల్ మురళి’ చిత్రానికి దర్శకత్వం వహించిన బాసిల్ ఇప్పుడు ‘శక్తిమాన్’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. బాసిల్ జోసెఫ్ గత మూడేళ్ళుగా ‘శక్తిమాన్’ సినిమా పనుల్లో ఉన్నాడని తెలుస్తోంది. 

ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ‘శక్తిమాన్’ సీరియల్‌లోని ప్రధాన అంశాలను అలాగే ఉంచుతూ ‘శక్తిమాన్’ సినిమా రూపొందిస్తున్నారు. సినిమాలో గంగాధర్ పాత్ర, హీరోయిన్ పాత్ర అలాగే ఉండనుంది.

సీరియల్‌లో నటించిన విలన్లే సినిమాల్లో కూడా ఉంటారని అంటున్నారు. ‘శక్తిమాన్’ ఈ సంవత్సరం లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. బాసిల్ కూడా ప్రస్తుతం కొత్త మలయాళ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
 

pushpa 2

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప 2 ది రూల్‌’ ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్‌ వసూలుచేసి ఇది సరికొత్త రికార్డులు సృష్టించింది. అతి తక్కువ సమయంలో రూ.1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన సినిమాగా ఇది పేరు సొంతం చేసుకుంది. సుకుమార్‌ డైరెక్షన్‌, అల్లు అర్జున్‌ యాక్టింగ్‌కు అంతటా ప్రశంసలు దక్కుతున్నాయి.

read more: బిగ్ షాక్.. అల్లు అర్జున్ అరెస్ట్ .. అదుపులోకి తీసుకున్న చిక్కడపల్లి పోలీసులు

also read: వెంకటేష్‌ డాన్స్ పై రామానాయుడు కంప్లెయింట్‌.. `కలిసుందాం రా` సెట్‌లో జరిగిన ఘటనతో తండ్రి సంచలన నిర్ణయం

Latest Videos

click me!