#Kalki రివ్యూ చెప్పి, ఇలా ఇరుక్కున్నాడేంటి? ,క్షమాపణ చెప్పాల్సిదేనేమో

Published : Jul 11, 2024, 08:04 AM IST

ప్రభాస్ హీరోగా   దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సెన్సేషనల్ చిత్రం “కల్కి 2898 ఎడి”.  ఘన విజయం సాధించిన  ఈ చిత్రం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

PREV
113
  #Kalki రివ్యూ చెప్పి,  ఇలా ఇరుక్కున్నాడేంటి? ,క్షమాపణ చెప్పాల్సిదేనేమో

 ప్రభాస్‌ (Prabhas) ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ కాసుల వర్షాన్ని కురిపిస్తూ దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే  రూ.1000 కోట్లు మార్కును అందుకోబోతోందని ట్రేడ్ అంచనా వేసింది. కేవలం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లోనూ అదరకొడుతోంది. అక్కడ పెద్ద స్టార్ల భారీ చిత్రాల రికార్డ్ లు బ్రద్దలు కొడుతోంది. ఇది నార్త్ లో కొందరికి నచ్చటం లేదు. విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే సౌత్ సినిమా రిలీజైన ప్రతీసారి ఇలాగే జరుగుతోండటంతో లైట్ తీసుకున్నారు దర్శక,నిర్మాతలు. అయితే ఈ క్రమంలో ముఖేష్ ఖన్నా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆయన రివ్యూ ఇచ్చారు. కానీ ఊహించని విధంగా ఇరుక్కుపోయారు. 

213


 హిందీ ప్రేక్షకులు ‘కల్కి’ మూవీకి ఫిదా అవుతున్నారు. ప్రభాస్‌, అమితాబ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, నాగ్‌ అశ్విన్‌ టేకింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ తదితర సన్నివేశాలు అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌లో రూ.200 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసిన మూవీగా ‘కల్కి’ నిలిచింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్ఆర్‌’ తర్వాత హిందీలో రూ.200 కోట్లు వసూలు చేసిన మూవీ ఇదే కావడం గమనార్హం. ఇక ప్రభాస్ సినిమాల పరంగా చూస్తే ఇదే రెండో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రం గా ముందుకు వెళ్తోంది. 
 

313


భైరవ పాత్రలో  ప్రభాస్ చేసిన పెర్ఫార్మెన్స్, అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ అదరకొట్టే నటన, అంతకు మించి నాగ్ అశ్విన్ మేకింగ్ విజన్ కి ఆడియన్స్ నీరాజనాలు పడుతున్నారు. ఫస్ట్ వీకెండ్ అయ్యాక కలెక్షన్స్ డ్రాప్ అవుతాయేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రమే స్లో అయ్యింది. మిగతా చోట్ల స్ట్రాంగ్  గానే ఉంది.   తెలుగు రాష్ట్రాల్లో సినిమా బుకింగ్స్ కి వస్తే నైజాంలో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది.   ఓవర్సీస్ లో అలాగే హిందీలో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపిస్తోంది. రేట్లు తగ్గించిన తర్వాత మళ్లీ హౌస్ ఫుల్స్ అవటం దర్శక,నిర్మాతలను ఆనందంలో ముంచేస్తోంది. 

413


ముఖేశ్ ఖన్నా.. ఈ సినిమాపై  స్పెషల్  రివ్యూ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.  ఆయన యూట్యూబ్‌లో విడుదల చేసిన వీడియోలో నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’పై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ వీడియోలో ఈ సినిమాలో ప్రతీ ఒక్కరి ఫెర్ఫార్మెన్స్‌లకు, అది తెరకెక్కించిన రేంజ్‌కు నూటికి నూరు మార్కులు ఇస్తానని తెలిపారు . కానీ అది కేవలం వెస్ట్ ఆడియన్స్‌కు మాత్రమే నచ్చేలా ఉందని, బిహార్, ఒడిశాలోని ప్రేక్షకులకు మూవీ అంతగా నచ్చకపోవచ్చని వ్యాఖ్యలు చేశారు ముఖేశ్ ఖన్నా.

513

 
అలాగే మహాభారతం లాంటి కథను వేరే విధంగా చూపించినందుకు నాగ్ అశ్విన్‌ను సైతం విమర్శించారు ముఖేశ్. కథను మార్చేస్తూ దర్శకుడు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకున్నాడని అన్నారు.  కల్కి 2898 ఏడీలో చూపించినట్టుగా మహాభారతంలో అశ్వద్ధాముడి మణిని కృష్ణుడు ఎప్పుడూ తీసేయలేదు. వ్యాసుడి కంటే మీకు ఎక్కువ తెలుసా అని మేకర్స్‌ను అడగాలని ఉంది. అశ్వద్ధాముడి మణిని కృష్ణుడి తీసేయలేదు. 

613


నా చిన్నప్పటి నుండి నేను మహాభారతం చదువుతున్నాను. తన అయిదుగురి పిల్లలను చంపేయడంతో అశ్వద్ధాముడి మణిని తీసేయమని ద్రౌపది ఆదేశించింది. ఈ కథను మార్చడానికి మీరు తీసుకున్న స్వేచ్ఛను క్షమించలేం. సౌత్ ఫిల్మ్‌మేకర్స్‌కు మన సంస్కృతి అంటే ఎక్కువ గౌరవం అని అంటుంటారు. కానీ ఇక్కడ ఏం జరిగింది?’’ అని చెప్తూ.. ఇలాంటి సినిమాను రివ్యూ చేయడానికి స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని కోరారు ముఖేశ్ ఖన్నా.
 

713


 ఈ రివ్యూ  చాలా మందికి అంతగా నచ్చినట్టుగా లేదు. దీంతో ముఖేశ్ ఖన్నాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా  ఒడిశా, బిహార్‌లాంటి ప్రాంతాల్లో ప్రేక్షకులకు ఇలాంటి ఫిల్మ్ మేకింగ్ అర్థం కాదు’’ అని ‘కల్కి 2898 ఏడీ’ గురించి స్టేట్‌మెంట్ ఇచ్చారు ముఖేశ్ ఖన్నా. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ స్టేట్‌మెంట్ వైరల్ అయ్యింది. ఈ కామెంట్‌ను తాము ఒప్పుకోము,తాము తెలివి తక్కువ వాళ్లమా అంటూ    ఒడిశా, బిహార్‌ రాష్ట్లాల వారు దీనిని ఖండిస్తూ, మరికొందరైతే క్షమాపణ చెప్పాల్సిందే అంటున్నారు. 
 

813

దాంతో ముఖేష్ ఖన్నా  ఈ విషయమై ఖండిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.  ఒడిశా, బిహార్‌ రాష్ట్రాల వారు నేను వారిని అవమానం చేసినట్లుగా,వారి తెలివిని శంకించినట్లుగా  ఫీల్ అవుతున్నారని నాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఇది పూర్తిగా అపార్దం చేసుకోవటమే. అందుకే నేను ఈ విషయమై వివరణ ఇవ్వదలచుకున్నాను అన్నారు.

913

సోషల్ మీడియాలో ముఖేష్ వీడియోపై  చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. నేను ఒడిశాకు చెందినవాడిని కాబట్టి నేను ఈ చిత్రాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖుడిని అంటారా అని ఒకరు రాశారు.. సినిమాని అర్థం చేసుకోవడం కొంతమందికి తెలివితేటలుగా పరిగణించబడుతుందనడానికి సిగ్గుపడాలని మరొకరు కామెంట్ చేశారు.


 

1013

నేను కల్కి సినిమాలో రెండు మైనస్ పాయింట్ లను మాత్రమే సూచించాను. అందులో ఒకటి మహా భారతంను వక్రీకరించటం. మరొకటి ఫస్టాఫ్ చాలా బోరింగ్ గా ,కన్ఫూజ్ గా సామాన్య ప్రేక్షకుడు అర్దం చేసుకోలేనట్లుగా ఉంది. అవే నేను చెప్పాలనుకున్నది.
ఈ విషయం చెప్పటం కోసం నేను ఒరిస్సా, బీహార్ లోని గ్రామీణ ప్రజలను ఉదాహరణగా తీసుకుని హాలీవుడ్ స్టైల్ వర్కవుట్ కాదన్నాను. అదే సినిమా మైనస్ పాయింట్ అన్నాను. నా స్టాఫ్ మెంబర్స్ సినిమాని నాతో పాటు చూసారు. వారికి ఫస్టాఫ్ అర్దం కాలేదు. కొందరైతే నిద్రపోయారు. వాళ్లలో ముగ్గురు బీహార్ వాళ్లు ఉన్నారు.

1113


సినిమాలో మైనస్ పాయింట్స్ గురించే  నేను అన్నాను కానీ ఎవరినీ ఎప్పుడూ విమర్శించలేదు. నేను ఒరిస్సా, బీహార్ కు క్యాంపైన్ కు పంక్షన్స్ కు వెళ్తూంటాను. పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా నేను వెళ్లాను. అలాంటి నేను ఎందుకు ఒరిస్సా వాళ్లను విమర్శిస్తాను. ఇప్పటికైనా నేను అన్నది సినిమా లో మైనస్ పాయింట్స్ గురించే కానీ బీహార్, ఒరిస్సా వాళ్ల గురించి కాదని అర్దం చేసుకుంటారని భావిస్తాను అని చెప్పుకొచ్చారు.  
 

1213
Prabhas Kalki 2898 AD collection records


 ప్రభాస్ మాట్లాడుతూ.. “కల్కి సినిమాలో నా పాత్ర చాలా గ్రే షేడ్స్‌తో ఉంటుంది. అలాగే, నేను సూపర్‌ హీరోగా కనిపిస్తాను, దానికి హ్యూమర్ టచ్ కూడా ఉంటుంది. కాకపోతే, తెలుగు ప్రేక్షకులు నన్ను ఇలాంటి పాత్రలో ఇంతకు ముందు చూశారు. కానీ ఇతర భాషల్లోని ప్రేక్షకులకు ఈ పాత్రలో నన్ను చూడటం కొత్తగా అనిపిస్తోంది. పైగా గ్రే షేడ్స్‌తో కూడిన ఫన్నీ క్యారెక్టర్‌లో నన్ను నేను చూసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది’ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. 

1313

వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించిన  ఈ చిత్రంలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. కల్కి’లో  కమల్ హాసన్‌ విలన్‌గా కనిపించారు. సుప్రీం యాస్కిన్‌ పాత్రను ఆయన (Kamal Haasan) పోషించారు. తాజాగా ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తన పాత్రను అంగీకరించడానికి ఏడాది సమయం తీసుకున్నట్లు తెలిపారు.  ‘ఈ పాత్ర గురించి చెప్పగానే నాకు స్వీయసందేహం వచ్చింది. నేను దీన్ని చేయగలనా అనిపించింది. గతంలో చాలా సినిమాల్లో విలన్‌గా నటించాను. కానీ, ఇది వాటికి మించినది. భిన్నమైన పాత్ర. అందుకే దీనికి సంతకం చేయడానికి ఏడాది ఆలోచించా’ అని చెప్పారు.
 

Read more Photos on
click me!

Recommended Stories