Published : Jul 11, 2024, 07:18 AM ISTUpdated : Jul 11, 2024, 12:21 PM IST
నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ మీద వస్తున్న తాజా వార్త అభిమానులను ఆందోళకు గురి చేస్తుంది. మోక్షజ్ఞ ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ పై కనిపించేది హీరోగా కాదట. ఈ మేరకు అందుతున్న సమాచారం పై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి చాలా ఆలస్యం అయ్యింది. మోక్షజ్ఞ మూడు పదుల వయసుకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం స్టార్స్ గా వెలుగొందుతున్న నెపో కిడ్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్... 25 ఏళ్ల లోపే పరిశ్రమలో అడుగుపెట్టారు.
27
మోక్షజ్ఞ అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ అయితే మీసాలు రాకుండానే మాస్ హీరో అయ్యాడు. సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చేనాటికి ఎన్టీఆర్ వయసుకు ఓ 20 ఏళ్ళు ఉంటుందేమో. మోక్షజ్ఞ ఇప్పటికే అరడజను సినిమాలు చేయాల్సింది. కానీ ఆయన మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒక దశలో మోక్షజ్ఞకు హీరో అయ్యే కోరిక లేదనే టాక్ నడిచింది.
37
ఎట్టకేలకు మోక్షజ్ఞ ఒప్పుకున్నాడు. త్వరలోనే రీ ఎంట్రీ అనేది విశ్వసనీయ సమాచారం. ఇటీవల మోక్షజ్ఞ స్టైలిష్ లుక్ ఒకటి వైరల్ అయ్యింది. గతంలో పొట్టతో షేప్ అవుట్ బాడీతో కనిపించిన మోక్షజ్ఞ మేకోవర్ సాధించడంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ వార్తలకు మరింత బలం చేకూరింది.
47
హనుమాన్ మూవీతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తన వైపు చూసేలా చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నాడని కథనాలు వెలువడ్డాయి. కథ కూడా సిద్ధంగా ఉంది. 2024లోనే మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోందనే ఊహాగానాలు వినిపించాయి. ప్రశాంత్ వర్మ ఈ వార్తలపై స్పందించలేదు. మౌనం అర్థాంగీకారం అని అభిమానులు భావించారు.
57
అనూహ్యంగా మరొక వార్త తెరపైకి వచ్చింది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ హీరోగా కాదు గెస్ట్ రోల్ గా ఉండనుందట. ఇది ఒకింత షాకింగ్ పరిణామం. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్ చేస్తున్నారట. అదే ఆయన మొదటి సినిమా, ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తాడట.
67
మరి ఇదే నిజమైతే చెత్త ప్లాన్ అంటున్నారు సోషల్ మీడియా జనాలు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సోలో హీరోగా మోక్షజ్ఞను పవర్ ఫుల్ పాత్రలో పరిచయం చేస్తే బాగుంటుంది. మోక్షజ్ఞ కెరీర్ కి పునాది పడుతుంది. ఒక్క సినిమా కూడా చేయని మోక్షజ్ఞ గెస్ట్ రోల్ చేయడం ఏమిటనే వాదన మొదలైంది. ఇది చెత్త ప్లానింగ్ అంటున్నారు. ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
77
బాలకృష్ణకు ఆ మాత్రం తెలియదా? మోక్షజ్ఞను గెస్ట్ రోల్ తో పరిచయం చేసే ఆలోచన వదిలేయాలని అంటున్నారు. మోక్షజ్ఞ కెరీర్ మీద ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఎలాంటి అధికారిక సమాచారం లేదు.మరి చూడాలి బాలయ్య వారసుడిని ఏ విధంగా ప్రేక్షకుల ముందుకు తెస్తాడో...