టాలీవుడ్ లో స్టార్ కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఎవరి మార్క్ వారిది, ప్రతీ ఒక్కరికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఓ కమెడియన్ ను మాత్రం తాగుబోతుల సంఘం సన్మానించాలని అనుకున్నారట.
ప్రతీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లతో పాటు కమెడియన్లు కామన్. కానీ అన్ని భాషల కంటే తెలుగులోనే ఎక్కువగా కమెడియన్లు ఉన్నారు. టాలీవుడ్ లో కమెడియన్లు, కమెడియన్ కమ్ హీరోలు ఎక్కువ. ఇంత మంది హాస్యనటులు ఉన్నా కానీ.. ఒకరితో మరొకరికి పోలిక పెట్టలేము, ఎవరి మార్క్ వారిది, ఎవరి స్టైల్ వారిది, సైలెంట్ గా నవ్వించేవారు కొందరు, హడావిడి చేసి నవ్వించేవారు కొందరు. తెలుగు సినీ పరిశ్రమలో హీరోలుగా మారిన కమెడియన్లు కూడా చాలామంది ఉన్నారు. అద్భుతమైన టైమింగ్ తో హాస్యం పండించడం మన నటుల ప్రత్యేకత.
25
తాగుబోతు పాత్రకు బ్రాండ్ అంబాసిడర్
టాలీవుడ్ కమెడియన్స్ లో ప్రతీ ఒక్కరికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అందులో తాగుబోతు పాత్ర అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఎమ్మెస్ నారాయణ. ఆయన ఈలోకాన్ని వదిలి వెళ్ళి సరిగ్గ పదేళ్లు అవుతోంది. తాగుబోతు పాత్రను ఎమ్మెస్ కంటే ఎవరు అంత అద్భుతంగా పోషించలేరు. సహజంగా ఆయన కళ్ల క్రింద వచ్చిన క్యారీబ్యాస్స్ వల్ల.. ఎమ్మెస్ తాగపోయినా తాగినట్ట కనిపిస్తుంటారు. అంతే కాదు లిక్కర్ తాకుండానే తాగినట్టుగా అద్భుతమైన పెర్ఫామెన్స్ ను ఎమ్మెస్ కంటే బాగా ఎవరు పోషించలేరు. ఈ విషయంపై నారాయణ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
35
మేకప్ తో ఉండగా ఆ పనులు చేయను
గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెస్ నారాయణ.. అందులో ''మీరు నిజంగా తాగి షూటింగ్ చేస్తారా'' అన్న ప్రశ్న ఎదురయ్యింది. దానికి ఆయన సమాధానం చెపుతూ... '' నేను షూటింగ్ ఉండగా తాగను, కానీ తాగుబోతు పాత్రలకు నన్ను బ్రాండ్ ను చేశారు. మా నాన్నకు పెళ్ళి సినిమాతో ఆ బ్రాండ్ పడిపోయింది. మేకప్ ను సరస్వతిదేవిగా చూస్తాను.. నా ముఖంపై మేకప్ ఉండగా తాగడం లాంటి పనులు అస్సలు చేయను'' అని ఎమ్మెస్ క్లారిటీ ఇచ్చారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో ఎమ్మెస్ నారాయణ మాట్లాడుతూ..'' షూటింగ్ లో తాగను.. కానీ తాగకపోయినా తాగుబోతు పాత్ర నేను బాగా చేస్తాను అంటారు. తాగుబోతుల గురించి పలు సందర్భాల్లో నేను చెప్పిన డైలాగ్స్ చాలామందికి బాగా ఎక్కేశాయి. దాంతో నాకు సన్మానం చేయాలని రాజమండ్రి దగ్గరలో ఉన్న ఓ తాగుబోతుల సంఘం ఆహ్వానం పంపింది. ఘనంగా సన్మానించుకుంటామని వారు అన్నారు. కానీ అటువంటివి చేస్తే.. రాంగ్ మెసేజ్ వెళ్తుందని నేనే వద్దన్నాను. అసలు అంత అతిగా నేను తాగను.. కానీ నన్నే తాగుబోతుల సంఘానికి బ్రాండ్ గా మార్చేశారు'' అని ఎమ్మెస్ అన్నారు.
55
కమెడియన్స్ ను కోల్పోయిన టాలీవుడ్
ఈమధ్య కాలంలో టాలీవుడ్ చాలామంది కమెడియన్లను కోల్పోయింది. మూడు నాలుగేళ్ల టైమ్ గ్యాప్ లోనే మల్లిఖార్జునరావు, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, కొండవలస, లక్ష్మీపతి, తెలంగాణ శకుంతల, ఆహుతీ ప్రసాద్, గుండు హనుమంతురావు, ఫిష్ వెంటక్ ఇలా పదిమందికి పైగా కమెడియన్స్ కన్నుమూశారు. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే వారు మరణించారు. ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించిన తారలు, చివరికి అభిమానులను విషాదంలో ముంచి వెళ్లిపోయారు.