ఈ వయసులో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ ఫిట్ నెస్ తో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న జైలర్ 2 సినిమా మేకింగ్ వీడియోను మూవీ టీమ్ విడుదల చేసింది. ఆ విడియోలో రజినీకాంత్ ను చూడాలి..?
74 ఏళ్ల వయసులో రజినీకాంత్ ఇంత ఫిట్‌నెస్, పవర్ కలిగి ఉండటం సాధారణమైన విషయం కాదు. దీని వెనుక ఆయన క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, యోగా, ధ్యానం, జిమ్ వర్కౌట్‌లు ఉన్నాయి. వ్యాయామంలో బరువులు ఎత్తడం, స్క్వాట్స్ తో పాటు ఇతర కఠినమైన సాధనలు చేస్తూ, యూత్ కు స్ఫూర్తినిస్తున్నారు సూపర్ స్టార్.
25
జైలర్ 2 సినిమాతో బిజీగా
రీసెంట్ గా కూలీ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చారు రజినీకాంత్. ఇక ప్రస్తుతం జైలర్ 2 సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన జైలర్‌కు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. రజినీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా నటించిన ఈ సినిమా 650 కోట్లకు పైగా వసూలు చేసింది.
35
జైలర్ 2 లో బాలకృష్ణ
జైలర్ భారీ విజయం తర్వాత, దాని సీక్వెల్ ప్రకటించారు. జైలర్ 2 అధికారిక ప్రకటన ఈ ఏడాది సంక్రాంతికి ఇచ్చారు. అదే రోజు స్పెషల్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు బాలకృష్ణ, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ఫహద్ ఫాసిల్ కూడా నటిస్తున్నారు.
దీపావళి సందర్భంగా జైలర్ 2 నుంచి స్పెషల్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈ వీడియోలో రజినీకాంత్ పెర్ఫామెన్స్ , ఎనర్జీ వేరే లెవల్ లో కనిపించింది. 74 ఏళ్ల వయసులో కూడా తలైవా కుర్రహీరోలకు పోటీ ఇస్తూ.. యాక్షన్ సీన్స్ ను అదరగొట్టేస్తున్నాడు. ఇక ఈ వీడియోలో నెల్సన్ దిలీప్‌కుమార్ రజినీకాంత్‌కు నటన నేర్పిస్తూ.. యాక్షన్ సీన్స్ ను వివరిస్తూ కనిపించాడు. ఈ సీన్స్ లో అనిరుధ్ కూడా కనిపించాడు.
55
జైలర్ 2 రిలీజ్ ఎప్పుడు?
జైలర్ మదిరిగా జైలర్ 2 కి కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. తలైవా సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా 2026 జూన్ 12న విడుదల కానుందని సమాచారం.