పట్టుచీరలో కట్టిపడేస్తున్న `సీతారామం` బ్యూటీ.. ట్రెడిషనల్‌ వేర్‌లో మృణాల్‌ ఠాకూర్‌ అందం అదరహో..

Published : Jan 26, 2023, 10:16 PM IST

`సీతారామం` బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ ఓ వైపు బౌండరీలు బ్రేక్‌ చేసే హాట్‌ షోతో షాకిస్తూ, మరోవైపు సాంప్రదాయానికి పెద్ద పీట వేసిందనేలా చీరకట్టులో మెరుస్తూ వాహ్‌ అనిపిస్తుంది.   

PREV
17
పట్టుచీరలో కట్టిపడేస్తున్న `సీతారామం` బ్యూటీ.. ట్రెడిషనల్‌ వేర్‌లో మృణాల్‌ ఠాకూర్‌ అందం అదరహో..

`సీతారామం` చిత్రంతో సీతగా ఒక్కసారిగా టాలీవుడ్‌లో పాపులర్‌ అయ్యింది మృణాల్‌ ఠాకూర్‌. ఈ చిత్రంలో ఆమె సీతా మహాలక్ష్మిగా ఎంతటి హుందాతనంతో కట్టిపడేసిందో, ఇప్పుడు అంతే హుందాగా మెరిసిపోతుంది. పట్టు చీరలో హోయలు పోతూ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో భాగంగా ఇలా ట్రెడిషనల్‌గా ముస్తాబై ఆకట్టుకుంది మృణాల్‌.

27

లైట్‌ పింక్‌ కలర్‌ అంచుతో మెరుస్తున్న ఈ సిల్క్ శారీలో మృణాల్‌ అందాలు మరింత పెరిగిపోయాయి. అందం ఓవర్‌ లోడ్‌ అనేలా మారిపోవడం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో శారీపై తనకున్న ప్రేమని వ్యక్తం చేసిందీ సీత.

37

ఎన్నో ఆటుపోట్లు, ఎంతో స్ట్రగుల్స్ ఫేస్‌ చేస్తూ సినిమా రంగంలో హీరోయిన్‌గా ఎదుగుతుంది మృణాల్‌. ఫ్యామిలీ ఉన్నతమైన కుటుంబమే అయినా, తాను కెరీర్‌ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఆమెకి కష్టాల్లోకి తీసుకెళ్లాయి. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేకుండా చేశాయి. అంతేకాదు ఆత్మహత్య ఆలోచన చేసేంత స్థాయికి చేరాయి. 
 

47

సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రారంభంలో ఎన్నో ఆటుపోట్లని, అవమానాలను ఫేస్‌ చేసింది మృణాల్‌. టీవీ సీరియల్స్ లో నటిగా కెరీర్‌ని ప్రారంభించింది. అందులో నుంచి సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు చాలా అవమానాలు ఫేస్‌ చేసింది. టీవీ వాళ్లకి సినిమాలెందుకు అని, చాలా చులకనగా చూసేవారిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది మృణాల్‌. 

57

నెమ్మదిగా సినిమాల కోసం ప్రయత్నాలు చేయగా, ఒక సినిమా ఓకే అయి మధ్యలోనే ఆగిపోయిందని, మరోటి తనని తీసేశారని తెలిపింది. సల్మాన్‌ చిత్రంలోనే నటించే ఛాన్స్ ని మిస్‌ చేసుకుందట. ఎట్టకేలకు ఒకటి రెండు సినిమా అవకాశాలు దక్కించుకుని కొంత పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ మోడల్‌గానూ చాలా పాపులర్‌. 

67

ఈ క్రమంలో ఆమెకి తెలుగులో నటించే ఛాన్స్ దక్కింది. అదే `సీతారామం`. ఇందులో సీత పాత్రకి మృణాల్‌ ఎంపికైంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీతగా, ప్రిన్సెస్‌ నూర్‌ జహాన్‌గా ఆమె నటన అబ్బురపరిచింది. సినిమాకే హైలైట్‌గా నిలిచింది. 
 

77

పొయెటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌ పాత్రలో దుల్కర్‌ నటించగా, సీతగా మృణాల్‌ మెప్పించింది. ఓ విభిన్నమైన స్వచ్ఛమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యింది. తొలి చిత్రంతోనే ఆకాశానికి ఎత్తేశారు. అంతేకాదు నెత్తిన పెట్టుకుంటున్నారు.  ఇదిలాఉంటే ఈ బ్యూటీకి ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె నాని చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. నాని 30చిత్రంలో మృణాల్‌ సెలెక్ట్ అయ్యింది. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఐదు బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది మృణాల్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories