#Balakrishna: ఈ సారి అక్కినేని ఫ్యామిలీని గిల్లిన బాలయ్య.. తెరపైకి కొత్త వివాదం.. టార్గెట్‌ నాగ్‌?

Published : Jan 26, 2023, 08:59 PM ISTUpdated : Jan 26, 2023, 09:01 PM IST

`అక్కినేని.. తొక్కినేని` మాటలపై వివరణ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ అదే సమయంలో అక్కినేని ఫ్యామిలీని గిల్లాడు. దీంతో ఇప్పుడు ఇది సరికొత్త వివాదానికి తెరలేపుతుంది. సర్వత్రా హాట్‌ టాపిక్‌ అవుతుంది. కొత్త చర్చకి దారితీస్తుంది. 

PREV
15
#Balakrishna: ఈ సారి అక్కినేని ఫ్యామిలీని గిల్లిన బాలయ్య.. తెరపైకి కొత్త వివాదం.. టార్గెట్‌ నాగ్‌?

`వీరసింహారెడ్డి` సక్సెస్‌ జోష్‌లో ఉన్నాడు బాలకృష్ణ(Balakrishna). ఈ ఆనందంలో ఆయన మాటల దూకుడు పెంచుతున్నాడు. అవి కొన్ని వివాదంగా మారుతుండటం గమనార్హం. `అక్కినేని.. తొక్కినేని` వివాదం ఇప్పటికే ఓవైపు రన్‌ అవుతుంది. దానికి వివరణ ఇస్తూ మరో వివాదానికి తెరలేపారు బాలయ్య. ఈ వివరణ ఇచ్చే క్రమంలో ఆయన మరోసారి నోరు జారారు.  అక్కినేని(Akkineni) ఫ్యామిలీపై ఆయన కామెంట్‌ చేయడం కొత్త వివాదానికి దారితీస్తుంది. అక్కినేని ఫ్యామిలీని మళ్లీ గిల్లాడు, ఇప్పుడు అది మరో వివాదానికి దారితీస్తుంది.
 

25

హిందూపురంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు బాలకృష్ణ. ఇందులో మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో `అక్కినేని, తొక్కినేని` వివాదపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై ఆయన రియాక్ట్ అయ్యారు. అవి ఫ్లో లో అన్న మాటలని తెలిపారు. Anrపై అభిమానంతో అన్న మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదని, నేనెంటో అందరికి తెలుసని, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని తెలిపారు బాలయ్య. అవకాశం వచ్చిందని ప్రత్యర్ధివాళ్లు వాడుకుంటున్నారన్నారు బాలయ్య. 
 

35

అభిమానంతో మరో రకంగా పిలుచుకుంటారు. అంత మాత్రాన వారిని అవమానించినట్టు కాదు, నాగేశ్వరరావు నాకు బాబాయే, నేనంటే ఆయనకి ఎప్పటికీ చాలా ఇష్టం, తన పిల్లలకంటే నన్నే ఎక్కువగా ప్రేమగా చూసుకునేవారు. ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఎందుకంటే ఆ ఆప్యాయత అక్కడ లేదు. ఇక్కడ ఉంది` అంటూ వ్యంగంగా నవ్వారు బాలకృష్ణ. ఇదే ఇప్పుడు కొత్త వివాదానికి దారి తీస్తుంది. అక్కినేని ఫ్యామిలీతో ఏఎన్నార్‌కి ఆప్యాయత లేదని బాలయ్య చెప్పడం సరికొత్త వివాదానికి దారితీస్తుంది. 

45

ఇప్పుడు బాలయ్య టార్గెట్‌ నాగార్జున(Nagarjuna) అనే వాదన తెరపైకి వస్తుంది. ఏఎన్నార్‌ని.. ఆయన ఫ్యామిలీ సరిగా చూసుకోలేదా? అనే కోణం బయటకు వస్తుంది. ఇది కొత్త చిచ్చుని రాజేస్తుంది. ఇప్పటికే బాలయ్య మాటలపై అక్కినేని నాగచైతన్య, అఖిల్‌ స్పందించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, రంగారావులను అవమానిస్తే మనల్ని మనం అవమాన పర్చుకోవడమే అని ట్వీట్‌ చేశారు. 

55

దీనిపై నాగార్జున ఇప్పటి వరకు స్పందించలేదు. చైతూ, అఖిల్‌ స్పందన వెనకాల ఆయనే ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ నాగ్‌ స్పందిస్తే ఆ వెయిట్‌ వేరు. అయితే ఇప్పుడు తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు అక్కినేని ఫ్యామిలీకి తగిలేలా, వారిని రెచ్చగొట్టేలా ఉండటమే ఆశ్చర్యపరుస్తుంది. అక్కినేని ఫ్యామిలీకి పెద్దగా ఉన్నా కింగ్‌ని ఉద్దేశించే బాలయ్య మాట్లాడాడా? అనే చర్చ ఊపందుకుంది. మరి దీనిపై వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దీనికి స్పందిస్తారా? లైట్‌ తీసుకుంటారా? ఈ వ్యాఖ్యల అర్థం, పరమార్థం ఎన్ని మలుపులను తిప్పుతుందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories