రేచీకటితో బాధపడుతున్న మృణాల్ ఠాకూర్, షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్..

First Published | Oct 14, 2023, 1:56 PM IST

మృణాల్ ఠాకూర్ కు రేచీకటి ఉందా...? ఈ విషయంలో మృణాల్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఏంటి..? అసలు ఇందులో నిజం ఎంత..? 
 

Mrunal Thakur

టాలీవుడ్ లో దూసుకుపోతోంది హీరోయిన్ మృణల్ ఠాకూర్. ఆలోచించి అడుగులు వేస్తోంది. సినిమాల విషయంలో రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా..మంచి సినిమాలు ఎంచుకుని చేస్తోంది. ఇటు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే అటు బాలీవుడ్ లో కూడా మంచి మంచి ఆఫర్లు అందుకుంటుంది. 
 

Photo Courtesy: Instagram

బాలీవుడ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ లు తీసుకుంటుంది మృణాలు. టాలీవుడ్ లో కూడా వరుస ఆఫ్లు వస్తున్నా.. మంచి కాన్సెప్ట్ లకే ఓటు వేస్తోంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నానీ జతగా.. హాయ్ నాన్న సినిమాలో నటిస్తోన్న మృణాలు.. ఈసినిమాతో పాటు విజయ్ దేవరకొండ జోడీగా మరోసినిమా చేస్తోంది. 


Mrunal thakur

తాజాగా మృణాల్‌ఠాకూర్‌కు సబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. మృణాల్ ఠాకూర్  రేచీకటితో బాధపడుతున్నదట. ఆ విషయాన్ని దాచేసి.. పెళ్ళి కోసం  వరుడిని వెతికేపనిలో ఉన్నారంట ఆమె కుటుంబసభ్యులు. ఈ న్యూస్ విని అంతా షాక్ అవుతున్నారు. మీరు కూడా షాక్ అయ్యి ఉంటారు కదా.. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటో కూడా స్వయంగా ఆమెనే వెళ్ళడించారు.
 

Mrunal Thakur

ఇదంతా అసలు  నిజమేనా.. నిజంగా మృణాల్ కు రేచీకటి ఉంది  అనుకుంటున్నారా? ఇంతకీ అసలు  విషయం ఏంటంటే, ఆమె బాలీవుడ్‌లో ఆంఖ్‌ మిచోలీ అనే సినిమా చేస్తుంది. అందులో మృణాల్‌కి రేచీకటి. ఆ విషయాన్ని దాచి వరుడుకోసం వెతుకుతుంటారు ఆమె కుటుంబసభ్యులు.

ఇదిలా ఉంటే.. మృణాల్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస పెట్టి చిత్రాల్లో నటిస్తోంది. ఇటు సౌత్ లోనూ జోరుగా ఆఫర్లు అందుకుంది. తెలుగులో ప్రస్తుతం Nani30, విజయ్ దేవరకొండ సరసన VD13లో నటిస్తోంది. అలాగే తమిళ స్టార్ శివ కార్తీకేయ అప్ కమింగ్ సినిమాతో కోలీవుడ్ కూ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 

రేచీకటి ఉన్న అమ్మాయి పాత్రలో తాను నటిస్తున్నట్టు అసలు  విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది మృణాల్‌. ఈ తరహా పాత్ర చేయడం తనకు ఇదే మొదటి సారి అని అంటోంది.  నటిగా తనకిది ఓ  ఛాలెంజ్‌ లాంటిదని  మృణాల్‌ అన్నది. ఇలా డిఫరెంట్  క్యారెక్టర్లు చేయడం వల్ల.. ఆమె ఇమేజ్ అంతకంతకు పెరుగుతూ వస్తోంది. 
 

ఇక ఈ విషయం వెల్లడించినప్పుడు ఆమెకు మరో ప్రశ్న ఎదురయ్యిందతి. సినిమాల్లో సరే, నిజంగా మీ పెళ్లెప్పుడు? అనడిగితే. నా కుటుంబం నుంచి ఒత్తిడి ఎక్కువగానే ఉంది. కాకపోతే నన్ను భరించేవాడు అసలు ఉన్నాడా అనేది నా డౌట్‌ అంటూ నవ్వేసింది మృణాల్‌.

నాగినీ సీరియల్ తో అటు మరాఠీలో.. హిందీలో ఇటు తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. ఆతరువాత హిందీ పరిశ్రమలో సినిమాలు చేస్తూ.. తెలుగులోకి సీతారామం సినిమాతో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేసింది. ఈసినిమాలో సీతగా అద్భుతంగా నటించింది బ్యూటీ. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే.. ఇక టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా మారడం ఖాయం అంటున్నారు సినిమా పండితులు. 

Latest Videos

click me!