చరణ్, బన్నీ ని ఫాలో అవుతున్న అఖిల్.. ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకోబోతున్నాడా...?

First Published | Oct 14, 2023, 12:17 PM IST

అక్కినేని వారసుడు అఖిల్ సర్జరీ చేయించుకోబోతున్నారా..? సక్సెస్ కోసం తనను తాను పూర్తిగా మార్చుకోవాలి అనుకుంటున్నాడా..? ఈ వార్తల్లో నిజం ఎంత..? 

పాపం అఖిల్ అక్కినేని ఎంత ప్రయత్నించినా.. కెరీర్ బిగినింగ్ నుంచి సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు. స్టార్ హీరో స్టేటస్ అందుకోలేకపోతున్నాడు. తనను తాను నిరూపించుకోవడం  కోసం.. చాలా కష్టపడ్డాడు అఖిల్. లవర్ బాయ్ నుంచి యాక్షన్ హీరోయిజం వరకూ అన్నీ ట్రై చేశాడు. కాని పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. నాగార్జున వారసుడిగా అఖిల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఇప్పటివరకు సుమారు ఐదు సినిమాలలో నటించాడు.. కాని  ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. 
 

ఒక స్టార్ హీరో కుమారుడిగా ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఇప్పటివరకు సరైన హిట్ పడకపోవడం అక్కినేని అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తుంది. అఖిల్ కెరియర్ పరంగా నాగార్జున తనకు ఎంత సపోర్ట్ చేసినప్పటికీ అఖిల్ మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోతున్నారు.


అయితే  ఇండస్ట్రీలో  నిలబడటం కోసం అఖిల్ కూడా చాలా కష్టపడుతున్నాడు.  ఈమధ్య వచ్చిన ఏజెంట్ కోసం దాదాపు రెండేళ్లు .. సిక్స్ ప్యాక్ ను అలానే మేయింటేన్ చేశాడు. బాడీ బిల్డింగ్ చేసి.. అందరూ ఆశ్చర్యపోయేలా తయారయ్యాడు. కాని ఈసినిమా ప్లాప్ తో అదంతా వృదా అయ్యింది. సక్సెస్ అవడం కోసం అఖిల్ కూడా ఎంతో కష్టపడుతున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యం అని చెప్పాలి. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా..  తదుపరి సినిమాల కోసం కూడా అఖిల్ భారీ స్థాయిలోనే కసరత్తులు చేస్తున్నారు. 

అఖిల్ హీరో మెటీరియల్ అని నిరూపించుకున్నాడు.. అయితే దానికి సక్సెస్ తోడయితే.. స్టార్ హీరోగా వెలుగు వెలుగుతాడు.. ఈక్రమంలో అఖిల్ తన అందాన్ని కాస్త మెరుగులు దిద్దుకోవాలి అనుకుంటున్నాడట. గతంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ లు కూడా ఇంతకు ముందులా లేదు.. వారు ముఖానికి, పెదవులకు, ముక్కుకు సర్జరీలు చేయించుకుని.. కాస్త ఛేంజ్ అయ్యారు అని అప్పట్లో టాక్ గట్టిగా నడిచింది. వారి బాటలోనే అఖిల్ కూడా ఓ సర్జరీకి రెడీ అవుతున్నాడట. 

ఇలా  చాల మంది స్టార్లు సర్జరీల ద్వారా తమ అందాన్ని రెట్టింపు చేసుకుంటారు ఈ క్రమంలోనే వారి బాటలోనే అఖిల్ సైతం సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమయ్యారట. చూడటానికి హీరో కటౌట్ అయినప్పటికీ ఈయన ముక్కు కారణంగా ఆయన ఫేసులో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు అవి సరిగా కనిపించడం లేదని , అందుకే విదేశాలకు వెళ్లి మరీ ముక్కుకు సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట.
 

ఈ విధంగా అఖిల్ తన ముక్కుకు సర్జరీ చేయించుకుని మరింత అందంగా కనిపించాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. మరి అఖిల్ సర్జరీ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది. మరి ఇది నిజం అయితే అఖిల్ సర్జరీకి ఎప్పుడు వెళ్తారు.. సర్జరీ తరువాత ఎలా ఉంటారు అని.. నెట్టింట్లోగుసగుసలు వినిపిస్తున్నాయి. 

Latest Videos

click me!