పూజా హెగ్డే, రష్మికకి బిగ్ షాక్.. ఒక్క సినిమాతో సీన్ రివర్స్ చేసిన మృణాల్, ఎన్టీఆర్ తో రొమాన్స్ ?

Published : Sep 15, 2022, 01:12 PM IST

సోషల్ మీడియా మొత్తం మృణాల్ ఠాకూర్ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ తో నిండిపోతోంది. సీతారామం చిత్రంలో మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. 

PREV
16
పూజా హెగ్డే, రష్మికకి బిగ్ షాక్.. ఒక్క సినిమాతో సీన్ రివర్స్ చేసిన మృణాల్, ఎన్టీఆర్ తో రొమాన్స్ ?

సోషల్ మీడియా మొత్తం మృణాల్ ఠాకూర్ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ తో నిండిపోతోంది. సీతారామం చిత్రంలో మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఆ చిత్రం ఓటిటిలోకి కూడా వచ్చేయడంతో.. బ్యూటిఫుల్ మూమెంట్స్ ని కట్ చేసి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు. అంతలా యువతకు నచ్చేసింది ఈ యంగ్ బ్యూటీ. కుర్రాళ్లకు క్రష్ గా మారిపోయింది. 

26

త్వరలో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అయితే పూజా హెగ్డే లేకుంటే రష్మిక మందన అన్నట్లు వ్యవహారం సాగింది. కానీ ఒక్క సినిమాతో సీన్ రివర్స్ చేసింది మృణాల్. స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతోంది. ఇది రష్మిక, పూజా హెగ్డేలకు బిగ్ షాక్ అనే చెప్పాలి. 

36

దీనిపై ఇంటర్నెట్ లో మీమ్స్ కూడా పేలుతున్నాయి. నిన్నకాక మొన్న వచ్చి ఈ రుబాబు ఏంటి అని రష్మిక, పూజా వాపోతున్నట్లు.. ఎప్పుడు వచ్చాం అనేది కాదు క్రష్ లిస్ట్ లో పడ్డామా లేదా అనేది ముఖ్యం అని మృణాల్ అంటున్నట్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అంతలా మృణాల్ ఠాకూర్ మ్యాజిక్ పనిచేస్తోంది. 

46

రామ్ ప్రేయసి సీతామహాలక్ష్మీగా క్యూట్ గా చిలిపిగా నటిస్తూ.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా హుందాగా నటించి భలే ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లో సైతం అదరగొట్టేసింది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో చిత్రానికి చాలా మంది హీరోయిన్ల పేర్లు పరిశీలించారు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ పేరు బలంగా వినిపిస్తోంది. 

56

ముందుగా ఈ చిత్రంలో అలియా భట్ పేరు వినిపించింది. కానీ అలియా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీనితో పూజా హెగ్డే.. లేకుంటే రష్మిక ఫైనల్ కావచ్చు అంటూ ప్రచారం జరిగింది. కానీ వీరిద్దరికి చెక్ పెడుతూ మృణాల్ ఆ ఆఫర్ కొట్టేయబోతున్నట్లు టాక్. 

66

మరొక్క హిట్ కొడితే మృణాల్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా మారిపోవడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు. నటన పూర్తిగా రాకున్నా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్న చాలా మంది హీరోయిన్లకు మృణాల్ ఠాకూర్ బిగ్ థ్రెట్ అని అంటున్నారు. 

click me!

Recommended Stories