ఐశ్వర్యా రాజేశ్ ప్రస్తుతం తమిళం, మలయాళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. తెలుగులో చివరిగా ‘టక్ జగదీష్’,‘రిపబ్లిక్’ సినిమాలతో అలరించింది. ప్రస్తుతం
ఆమె ఐదారు చిత్రాల్లో నటిస్తోంది. ఐశ్వర్య నటించిన ‘డ్రైవర్ జమున’, ‘తీయవర్ కులైగల్ నడుంగ’, ‘మోహన్ దాస్’, ‘పులిమడ’, ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’, ‘ధ్రువ నక్షత్రం’ చిత్రాలు శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి. తర్వలోనే విడుదల కానున్నాయి.