హీరోయిన్ మృణాల్ ఠాకూర్, బాలీవుడ్ స్టార్ హీరోపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఆ హీరోను తన లక్కీచార్మ్ అని చెబుతూ.. అతనితో కలిసి పనిచేసిన తర్వాతే తనకు ఇండస్ట్రీలో గుర్తింపు, కెరీర్‌కు కొత్త దారి దొరికాయని అంటోంది ఇంతకీ ఎవరా హీరో?
బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ మృణాల్ ఠాకూర్ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో రణ్‌వీర్ సింగ్‌ను తన లక్కీ చార్మ్ అని చెప్పింది. రణ్‌వీర్‌తో చేసిన ఓ యాడ్ తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని, ఆ తర్వాతే ఫిల్మ్‌మేకర్స్ తనను గుర్తించడం మొదలుపెట్టారని తెలిపింది.
25
అతనే నా లక్కీ చార్మ్..
మృణాల్ మాట్లాడుతూ.. ‘నా మనసు సంతోషంగా ఉంది. అతనే నా లక్కీ చార్మ్. ఈ రోజు నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే దానికి కారణం ఆయనే. ఆ యాడ్ తర్వాతే నేను గుర్తింపు సాధించాను. నన్ను నటిగా గుర్తించడం మొదలుపెట్టారు. దీనికి పూర్తి క్రెడిట్ ఆయనకే ఇస్తాను. ఆయన చాలా పాజిటివ్ వ్యక్తి, ప్రతి సక్సెస్‌కు అర్హుడు’ అని మృణాల్ అన్నది.
35
ధురంధర్ సినిమా గురించి మృణాల్ కామెంట్స్..
దీంతో పాటు, రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్2 సినిమా గురించి కూడా ఆమె మాట్లాడింది. రణ్ వీర్ నటనను మృణాల్ మెచ్చుకుంది. రణ్‌వీర్ పాత్ర కేవలం హీరోకే పరిమితం కాలేదని, అందులో చాలా డీప్ లేయర్స్ ఉన్నాయని చెప్పింది. ‘సినిమాలో నేను రణ్‌వీర్ సింగ్‌ను చూడలేదు, కేవలం అతని పాత్ర హమ్జానీ ఫీల్ అయ్యాను. అది ఒక క్యారెక్టర్, కేవలం హీరో కాదు. అతని గురించి చాలా గర్వంగా ఉంది’ అని తెలిపింది.
మృణాల్ ఠాకూర్ తన సినీ కెరీర్‌ను మరాఠీ సినిమాతో ప్రారంభించింది. ఆమె మొదటి సినిమా 'విట్టి దండు' (Vitti Dandu), 2014లో విడుదలైంది. ఆ తర్వాత 2018లో 'లవ్ సోనియా' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2019లో హృతిక్ రోషన్‌తో కలిసి 'సూపర్ 30'లో నటించింది. ఈ సినిమా హిట్ అయింది.
55
మృణాల్ ఠాకూర్ అప్‌కమింగ్ సినిమాలు
వర్క్‌ఫ్రంట్ విషయానికొస్తే, మృణాల్ ఠాకూర్ త్వరలో 'డకాయిట్' (Dacoit) సినిమాలో కనిపించనుంది. ఇందులో ఆమెతో పాటు అడివి శేష్ (Adivi Sesh), అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.