Karthika Deepam: కార్తీక్ ని అనుమానిస్తున్న మోనిత.. అసలు విషయం తెలుసుకుని షాకైన కార్తీక్?

Published : Nov 15, 2022, 07:38 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 15 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
17
Karthika Deepam:  కార్తీక్ ని అనుమానిస్తున్న మోనిత.. అసలు విషయం తెలుసుకుని షాకైన కార్తీక్?

ఈరోజు ఎపిసోడ్లో మోనిత జరిగిన విషయాల గురించి తెలుసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. నన్ను నేను తగలబెట్టుకుంటాను అన్నా చలనం లేదు దీప తగలబెడతాను అన్నా చలనం లేదు. పొద్దున్నుంచి నేను కూడా ఉపవాసం ఉన్నాను కదా ఒక మాట అడగలేదు దానికి మాత్రం టిఫిన్ తీసుకుని వెళ్లి వెళ్తూ పెడుతున్నాడు అంటూ కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మోనిత. అప్పుడు మోనిత ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అటుగా వెళుతున్న కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ ఎన్ని గంటలకు అని మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు మోనిత వింటుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడో నిజంగానే కార్తీకి గతం గుర్తుకు వచ్చిందా ఇలా ఉంటే లాభం లేదు గతం మోనిత ని బయటికి తీయాల్సిందే కార్తీక్ ని ఫాలో అవ్వాల్సిందే అని అనుకుంటుంది మోనిత.

27

ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి మోనిత అని ఆనంద్ అనడంతో ఏ ఆనంద్ కార్తీక్ అంటూ నాటకాలు ఆడుతుంది మోనిత. అప్పుడు నిన్నటి నుంచి బాబు కనిపించలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నావు అని అనడంతో వెంటనే కార్తీక్ కార్తీక్ పూజ విషయంలో మర్చిపోయి నిన్ను అడగలేదు మోనిత అని అనగా వెంటనే నాటకాలు ఆడద్దు కార్తీక్ బాబుని తెచ్చిన మొదట్లో పది నిమిషాలు కూడా ఉండలేకపోయేవాడివి ఇప్పుడు ఎలా ఉంటున్నావు అని అడుగుతుంది. అవని కాదు ఆనంద్ ఏడి అనడంతో లేడు పంపించేశాను నువ్వు వాడిని పట్టించుకోవడం లేదు అని అంటుంది మోనిత. అప్పుడు ఇంకా ఇప్పట్లో ఆనంద్ గురించి అడగడు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దుర్గ దీపా ఇద్దరూ కాఫీ తాగుతూ ఉంటారు.
 

37

 అప్పుడు వారిద్దరూ కలసి కార్తీక్ ప్రవర్తన గురించి కార్తీక్ కి గతం గుర్తుకు వచ్చిందేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నాలాగే కార్తీక్ బాబు కూడా ఏదైనా కారణంతో బయటపడకుండా అలాగే ఉంటున్నారా దుర్గ అని అంటుంది. అప్పుడు దుర్గ లేదులే దీపమ్మ నీకు అలా అనిపిస్తుంది అంతే అని అంటాడు. మరొకవైపు ఆనంద్ రావు, హిమ బాబూ తో ఆడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి సౌందర్య వస్తుంది. అప్పుడు సౌందర్య ఆ మోనిత ఎలాంటిదైనా బాబుని ఎలా కన్నా ఈ బాబులో మన కొడుకు రక్తం ప్రవహిస్తోంది కదండీ అని అంటుంది. అప్పుడు హిమ మోనిత ఆంటీకి మళ్లీ బాబుని ఇయ్యద్దు అనడంతో ఆ మోనిత గురించి నీకు తెలీదు విషయమా హిమ ఏ క్షణంలో అయినా వచ్చి ఇంటి మీద దాడి చేసి బాబుని తీసుకెళ్తుంది అని అంటుంది.
 

47

మరొకవైపు దీప బట్టలు ఉతుకుతూ దుర్గతో ఇంకా పై ఆ మోనిత ని క్షమించను దుర్గ అంటూ కోపంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి కార్తీక్ వచ్చి దీప మాటలు వింటుంటాడు. అప్పుడు దీప ఆ వాల్తేరు వానితో నన్ను ఆ మోనిత  చంపించాలి అనుకుంది అనటంతో కార్తీక్ షాక్ అవుతాడు. రాత్రి కూడా గుడి అని కూడా చూడకుండా నన్ను బెదిరించి బలితెగించి మాట్లాడింది దుర్గ దాన్ని వదలను అని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఇప్పుడు ఏమన్నావు దీప అనడంతో వెంటనే దుర్గ చెప్పు దీపమ్మ ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దీప జరిగింది మొత్తం వివరించడంతో కార్తీక్ షాక్ అవుతాడు.

57

 అప్పుడు కార్తీక్ ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని అనడంతో ఎన్నిసార్లు చెప్పాలి డాక్టర్ బాబు మొదటిసారి మీరు కాపాడారు తర్వాత దుర్గ కాపాడారు పదేపదే ఎవరు కాపాడుతారు అని అంటుంది దీప. అప్పుడు కాలం మారుతుంది కానీ కాలంతో పాటు నా జీవితం మాత్రం మారలేదు డాక్టర్ బాబు అని అంటుంది. అప్పుడు దీప కార్తీక్ తో ఎమోషనల్ గా మాట్లాడడంతో కార్తీక్ ఏం మాట్లాడుకున్నా మౌనంగా బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా వెంటనే దీప ఆ మోనిత నన్ను ఎందుకు చంపాలి అనుకుంటుందో మీకు అర్థం కావడం లేదా అని కార్తీక్ ని ప్రశ్నించడంతో కార్తీక్ ఏం మాట్లాడుకున్నా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

67

 మరొకవైపు ఆనందరావు సౌందర్యకు జరిగింది మొత్తం వివరించి మేము వెళ్ళగానే ఆ మోనిత ముఖంలో ఫుల్ టెన్షన్ ఎందుకు వచ్చిందో అన్నట్టుగా చూసింది టెన్షన్ టెన్షన్ గా ఉంది అని అంటాడు. అప్పుడు వారిద్దరూ కలిసి మోనిత గురించి మోనిత ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరొకవైపు కార్తీక్ నువ్వు మనిషివా రాక్షసివా ఆ దీప  తన భర్త కోసం ఎన్నో కష్టాల అనుభవిస్తుంటే నువ్వు ఆ వాల్తేరు వాణి తో చంపించాలి అని చూస్తావా అనడంతో మోనిత షాక్ అవుతుంది. అప్పుడు మోనిత లేదు అని అపద్దం చెప్పగా కార్తీక్ సీరియస్ అవుతాడు. అప్పుడు వంట లెక్క మీద ఎందుకు నీకు ఇంత కోపం తన భర్త కోసం ఏదో పాట్లు పడుతుంటే అని అనగా తన భర్త కోసం పాట్లు పడుతుందా లేకపోతే నీకోసం పడుతుందా అనడంతో మోనిత అని గట్టిగా అరుస్తాడు కార్తీక్.
 

77

అప్పుడు మోనిత నాటకాలు ఆడుతూ కార్తీక్ ని ఎదురుగా ప్రశ్నలు వేస్తుంది. కార్తీక్ నువ్వు ఇంతలా మారిపోయావు అని అంటుంది మోనిత. అప్పుడు కార్తీక్ రివర్స్ డ్రామా మొదలు పెడుతూ నువ్వు నా భార్య మోనిత నేను అందరిలాంటి భర్తని కాదు మోనిత. అప్పుడు మోనిత నేను చచ్చిపోతాను అన్న ఎందుకు ఆపలేదు కార్తీక్ అనడంతో వెంటనే కార్తీక్ పోయిన దరిద్రం వదిలిపోయి ఉండేది అని మనసులో అనుకుంటాడు. అప్పుడు నిజంగానే నువ్వు నా భార్యవేనా మోనిత అనడంతో మోనిత షాక్  అవుతుంది. మరి అలాంటప్పుడు నువ్వు వంటలక్కని ఎందుకు చంపేయాలని చూస్తున్నావు ఆ వంట లెక్క భర్త నేను కాబట్టి దీపని చంపి నన్ను నువ్వు సెట్ చేసుకోవాలని చూస్తున్నావా అనడంతో నో కార్తీక్ అని గట్టిగా అరుస్తుంది మోనిత.

click me!

Recommended Stories