సూపర్ స్టార్ కృష్ణ ఆస్తుల వివరాలు, ఇంత దారుణమా.. కుబేరుడు కావాల్సింది, కానీ అప్పుల్లో

Published : Nov 15, 2022, 07:07 AM IST

నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ నేడు అనారోగ్యంతో మరణించడంతో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. కృష్ణ గారికి కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుటుంబ సభ్యులు సోమవారం ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. 

PREV
19
సూపర్ స్టార్ కృష్ణ ఆస్తుల వివరాలు, ఇంత దారుణమా.. కుబేరుడు కావాల్సింది, కానీ అప్పుల్లో

నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ నేడు అనారోగ్యంతో మరణించడంతో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. కృష్ణ గారికి కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుటుంబ సభ్యులు సోమవారం ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కానీ క్రమంగా కృష్ణ ఆరోగ్యం క్రిటికల్ గా మారుతూ వచ్చింది. దీనితో కృష్ణ తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణంతో మహేష్ ఫ్యామిలిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. 

29

తీవ్ర శోకంలో మునిగిపోయిన అభిమానులు కృష్ణ గారి విజయాల్ని, గొప్ప చిత్రాలని, ఆయన మంచి మనసుని గుర్తు చేసుకుంటున్నారు. కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. 1965లో కృష్ణ తేనే మనసులు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే టాలీవుడ్ లో కొత్త శకం మొదలైనట్లు అయింది. హీరోగా కృష్ణ అందుకోని విజయాలు అంటూ లేవు. కృష్ణ సినిమా రిలీజ్ అవుతుంటే అప్పట్లో గ్రామాలు మొత్తం బండ్లల్లో బయలుదేరేవారట. అంత పాపులారిటీ దక్కినప్పుడు కృష్ణ ఆర్థికంగా అపర కుబేరుడిగా ఎదిగి ఉండాలి. కానీ అది జరగలేదు. 

39

డబ్బు విషయంలో కృష్ణ ఎప్పుడూ అమాయకత్వంతోనే ఉండేవారట. ఈ విషయాన్ని విజయనిర్మల ఓ ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ సంపాదించిన మొత్తం ఆస్తుల విలువ 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తన స్వంత గ్రామం బుర్రిపాలెంలో, హైదరాబాద్, చెన్నై నగరాల్లో కృష్ణ పేరిట ఇళ్ళు ఉన్నాయి. అలాగే ఫామ్ హౌస్ లు కూడా ఉన్నాయి. కృష్ణ గారి గ్యారేజ్ లో మొత్తం 20 కోట్ల విలువ చేసే 7 కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. 

49

సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్ తో పోల్చుకుంటే ఆయన సంపాదించిన ఆస్తులు చాలా తక్కువే అని ఇండస్ట్రీలో చాలా మంది అభిప్రాయం. డబ్బు విషయంలో అమాయకత్వం, సెటిల్ మెంట్స్ విషయంలో మధ్యవర్తిగా ఉండడం, అలాగే కీలక సమయంలో కొన్ని సినిమాలు ఫెయిల్ కావడంతో కృష్ణ కోట్లాది రూపాయలు నష్టపోయారట. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించే చిత్రాలు, సీరియల్స్ విషయంలో కృష్ణ ఎక్కువగా తన సోదరులు హనుమంతరావు, ఆది శేషగిరి రావు లపై ఆధారపడేవారట. 

59

ఒకే సమయంలో పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ నుంచి నాలుగైదు సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దీనితో ఆర్థిక లావాదేవీల విషయంలో గందరగోళం నెలకొనడం, డబ్బు నష్టపోవడం జరిగేది. ఇక కృష్ణ గారికి ఆయన బలం ఆయనకే తెలియదట. తొలి చిత్రం తేనె మనసులుకి 2 వేలు రెమ్యునరేషన్. రెండు మూడు చిత్రాలతోనే కృష్ణకి స్టార్ డమ్ వచ్చేసింది. 

69

కానీ నిర్మాతలని రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం తెలియదట. దీనితో ఎంతిస్తే అంత తీసుకునేవారు. స్టార్ డమ్ ఉన్నప్పటికీ 10 వేలు రెమ్యునరేషన్ చేరుకోవడానికి కృష్ణకి 35 సినిమాల సమయం పట్టిందట. ఒక సారి ఒక నిర్మాత నా డేట్లు అడిగారు. అప్పుడు చాలా చిత్రాల్లో చేస్తున్నా. ఇప్పుడు టైం లేదు తర్వాత చూద్దాం అని చెప్పారట. రెమ్యునరేషన్ 5 వేలు ఇస్తానని కూడా అన్నారట. కానీ కృష్ణ సమయం లేక ఒప్పుకోలేదు. 

79

అదే నిర్మాత మరుసటి రోజు వచ్చి 15 వేలు ఇస్తాను మీరే ఈ చిత్రం చేయాలి అని కాళ్ళు పట్టుకుని బతిమలారట. నాకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ద పడుతున్నారా అని కృష్ణ అప్పుడు ఆశ్చర్యపోయారట.  అలాగే చెక్కులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన వారు కూడా చాలా మంది ఉన్నారు అని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. 

89

ఒకానొక చిత్రంలో తనకు 5 వేలు రెమ్యునరేషన్ ఇస్తే.. జమునగారికి 30 వేలు ఇచ్చారని కృష్ణ గుర్తు చేసుకున్నారు. అది 1968లో రిలీజ్ అయిన అమాయకుడు చిత్రం. నిర్మాత కష్టాల్లో ఉంటే రెమ్యునరేషన్ తగ్గించుకోవడం.. సినిమా ఫెయిల్ అయితే తక్కువ రెమ్యునరేషన్ తో అదే నిర్మాతకి డేట్లు ఇవ్వడం లాంటివి కృష్ణ గారి మంచి మనసుకి నిదర్శనం. ఫలితంగా ఆయన స్టార్ స్టేటస్ కి తగ్గ స్థాయిలో ఆస్తులు పోగేసుకోలేకపోయారు. 

99

ఒక దశలో అప్పుల కారణంగా పద్మాలయ స్టూడియో మూతపడే పరిస్థితి కూడా వచ్చిందని వార్తలు వచ్చాయి. మహేష్ బాబు హీరోగా సక్సెస్ అయ్యాక కృష్ణ ఫ్యామిలీ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. 

click me!

Recommended Stories