Mothers Day: మదర్స్ డే రోజు మీ అమ్మతో కలిసి చూడాల్సిన సినిమాలు.. OTTలోనే ఉన్నాయ్

Published : May 11, 2025, 07:37 AM ISTUpdated : May 11, 2025, 07:39 AM IST

అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని అంతా సంతోషంగా జరుపుకుంటున్నారు. తమ అమ్మలకు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా మీ అమ్మతో కలిసి ఓటీటీలో చూసే కొన్ని బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
16
Mothers Day: మదర్స్ డే రోజు మీ అమ్మతో కలిసి చూడాల్సిన సినిమాలు.. OTTలోనే ఉన్నాయ్
ఇంగ్లీష్ వింగ్లీష్

2012 లో విడుదలైన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాని మీ అమ్మతో కలిసి తప్పక చూడండి. ఇది జీ5లో అందుబాటులో ఉంది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన మహిళ ఇంగ్లిష్ నేర్చుకొని మళ్లీ తన విలువను తెలుసుకునే స్ఫూర్తిదాయక ప్రయాణమే ఈ సినిమా. 

26
నీల్ బట్టే సన్నాట

2016 లో విడుదలైన నీల్ బట్టే సన్నాట సినిమా కూతురిని చదివించడానికి ఏమైనా చేసే తల్లి కథ. దీన్ని మీరు జీ 5 లో చూడవచ్చు.

36
సీక్రెట్ సూపర్ స్టార్

2017 లో విడుదలైన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా కూతురి కెరీర్ కోసం తల్లి ఎంతటి పోరాటం చేసింది వివరించే మంచి కథ. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. 

46
మామ్

2017 లో విడుదలైన మామ్ సినిమా ఒక తల్లి కథ. ఈ సినిమాని మీరు జీ 5 లో చూడవచ్చు. తల్లి–కూతురు మధ్య బంధానికి మరో కోణాన్ని ఇందులో చూపించారు. 

56
హెలికాప్టర్ ఈలా

2018 లో విడుదలైన హెలికాప్టర్ ఈలా సినిమా ఒక సింగిల్ మదర్ కథ. నేటి తరానికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.  దీన్ని మీరు జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు.

66
మిమి

2021 లో విడుదలైన కామెడీ-డ్రామా మిమి చాలా మంచి సందేశాన్నిస్తుంది. ఈ సినిమాని మీరు నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories