రెండేళ్లుగా సినిమాల్లేవ్‌ అయినా టాప్‌లో సమంత, ఇండియా మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్లు టాప్‌ 10 లిస్ట్

Published : Jan 20, 2025, 02:35 PM IST

ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన ఇండియా మోస్ట్ పాపులర్‌ సెలబ్రిటీ జాబితాలో టాప్‌ 10లో నిలిచిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.   

PREV
111
రెండేళ్లుగా సినిమాల్లేవ్‌ అయినా టాప్‌లో సమంత, ఇండియా మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్లు టాప్‌ 10 లిస్ట్

సినిమా సెలబ్రిటీలకు కాలంతో సంబంధం లేకుండా ఆదరణ ఉంటుంది. వారి సినిమాల సమయంలో ఆ క్రేజ్‌ ఎక్కువగా ఉంటుంది. మరి ఇండియాలో మోస్ట్ పాపులర్‌ హీరోయిన్ల లిస్ట్ బయటకు వచ్చింది. డిసెంబర్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు చివర్లో ఉన్నారు అనేది టాప్‌ 10 హీరోయిన్ల జాబితాని విడుదల చేసి ఓర్మాక్స్ మీడియా. ఇది ప్రతి నెల ఇండియా మోస్ట్ పాపులర్‌ సెలబ్రిటీల జాబితా విడుదల చేస్తుంది. డిసెంబర్‌ లిస్ట్ వచ్చింది. మరి ఇండియా వైడ్‌గా మోస్ట్ పాపులర్‌ హీరోయిన్లు ఎవరో చూద్దాం. 
 

211

ఇందులో టాప్‌ 1లో సమంత నిలవడం విశేషం. ఆమెకి రెండేళ్లుగా సినిమాలు లేవు. చివరగా `ఖుషి` సినిమాలో మెరిసింది. ఆ తర్వాత బ్రేక్ తీసుకుంది. అయితే ఇటీవల ఆమె `సిటాడెల్‌`తో ఓటీటీ ఆడియెన్స్ ని పలకరించింది. దీనికి మంచి స్పందనే లభించింది. కానీ ఆమె తన వ్యక్తిగత జీవితం విషయంలో బాగా వైరల్‌ అయ్యింది. నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడం, ఈ క్రమంలో సమంత గురించిన చర్చ జరిగింది. అందుకే ఈ అమ్మడు ఇండియాలోనే మోస్ట్ పాపులర్‌ హీరోయిన్‌గా నిలిచింది. 
 

311

ఇక రెండో స్థానంలో అలియా భట్ నిలిచింది. `ఆర్‌ఆర్‌ఆర్`తో తెలుగు ఆడియెన్స్ ని పలకరించిన ఆలియాభట్‌. ఆమె చివరగా `జిగ్రా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. 

411

మూడో స్థానంలో `కల్కి 2898 ఏడీ` నటి దీపికా పదుకొనె నిలిచారు. ఆమె గతేడాది `కల్కి`, `సింగం అగైన్‌` చిత్రాలతో అలరించారు. అంతేకాదు తల్లి అయిన సందర్భంగానూ ఆమె పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. కూతురికి జన్మనిచ్చింది. 

511
rashmika mandana

నాల్గో స్థానంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా నిలిచారు. ఆమె `పుష్ప 2`తో ఇండియా వైడ్‌గా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఈ లిస్ట్ లో స్థానం సంపాదించింది. 

611
Sai Pallavi

ఐదో స్థానంలో సాయి పల్లవి నిలిచింది. ఆమె చివరగా `అమరన్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇది మేజర్‌ ముకుంద్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఇందులో ముకుంద్‌ కి భార్య ఇందు రెబెకా వర్గీస్‌ పాత్రలో నటించింది. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. 

711

ఆరో స్థానంలో త్రిష నిలిచింది. ఆమె ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది విజయ్‌తో `గోట్‌` మూవీలో నటించింది. అదే సమయంలో ఆయనతో ఎఫైర్‌ రూమర్స్ తో వార్తల్లో నిలిచింది. మరోవైపు అజిత్‌తో రెండు సినిమాలు చేస్తుంది. ఇలా నిత్యం వార్తల్లో నిలుస్తుంది త్రిష. 
 

811
nayanthara

నయనతారకి కూడా గతేడాది సినిమాలు లేవు. కానీ చివర్లో `నయనతారః బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌` పేరుతో ఆమె డాక్యుమెంటరీ విడుదలైంది. ఇది పెద్ద సంచలనంగా మారింది. వివాదంగానూ మారింది. అందుకే నయనతార పాపులర్‌ అయ్యింది. దీంతో ఇండియా మోస్ట్ పాపులర్‌ హీరోయిన్లలో ఏడో స్థానంలో నిలచింది. 

911
Kajal Agarwal

కాజల్‌ కి పెద్దగా సినిమాలు లేవు, కానీ టాప్‌ 10లో స్థానం సంపాదించింది. ఆమె ఎనిమిదో స్థానం దక్కించుకుంది. యాడ్స్ ద్వారా ఆమె వార్తల్లో నిలవడం విశేషం. 

1011

శ్రీలీల కూడా హీరోయిన్‌గా పెద్దగా సినిమాలు లేవు. కానీ గత నెలలో ఆమె `పుష్ప 2`తో మెరిసింది. ఇందులో స్పెషల్‌ సాంగ్‌ `కిసిక్‌`లో బన్నీతో స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఈ దెబ్బతోనే ఆమె పాపులర్‌ అయిపోయింది. టాప్‌ 9గా నిలిచింది. 

1111

ఇక టాప్‌ 10లో చివరి స్థానంలో ప్రభాస్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ నిలిచింది. ఆమె గతేడాది `స్ట్రీ2` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎనిమిది వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. కానీ ఆమె గురించి చర్చ ఏడాది మొత్తం నడుస్తూనే ఉంది. 

read more: ఓటీటీ రైట్స్ లో టాప్‌ 10 సినిమాలు, అత్యధికంగా ఆ స్టార్‌ హీరోవే.. పవన్‌, బన్నీ, తారక్, చరణ్‌ సినిమాలు ఎన్ని?

also read: కొరటాల శివ దర్శకత్వలో అల్లు అర్జున్‌ మూవీ?, బ్యాక్‌ డ్రాప్‌ తెలిస్తే మతిపోవాల్సిందే.. `పుష్ప 2` ఎఫెక్ట్
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories