డాక్టర్ బాబుకు మరో షాక్.. పిల్లలకు నిజం తెలిసేలా మరో షాకింగ్ ప్లాన్.. మళ్ళీ అనారోగ్యానికి గురైన హిమ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 06, 2021, 01:41 PM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. బుల్లితెర ప్రేక్షకులకు అభిమాన సీరియల్ గా మారింది. రేటింగ్ కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది.

PREV
110
డాక్టర్ బాబుకు మరో షాక్.. పిల్లలకు నిజం తెలిసేలా మరో షాకింగ్ ప్లాన్.. మళ్ళీ అనారోగ్యానికి గురైన హిమ?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. బుల్లితెర ప్రేక్షకులకు అభిమాన సీరియల్ గా మారింది. రేటింగ్ కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది.
 

210

మోనిత జైల్లో అన్న మాటలు తలుచుకొని దీప బాధపడుతుంది. అంతలోనే సౌందర్య వచ్చి మళ్లీ ఏమైందని ప్రశ్నించడంతో తన బాధ గురించి మొత్తం వివరిస్తుంది.
 

310

ఇక సౌందర్య కూడా తన బాధను పంచుకుంటూ చివరికి నీకు ఏం అనిపిస్తుందో అదే చేయు అని సలహా ఇస్తుంది. మరోవైపు కార్తీక్ హాస్పిటల్ లో ఉండగా మోనిత హార్ట్ ఎటాక్ అని అబద్ధం చెప్పి అక్కడికి వస్తుంది.
 

410

అదే సమయంలో హిమ కూడా తన తండ్రితో న్యూస్ పేపర్ లో ఉన్న విషయం గురించి నేరుగా అడిగి తెలుసుకోవాలని హాస్పిటల్ కు వస్తుంది.
 

510

ఇక కార్తీక్ తన కేబిన్ లోకి వెళ్లేసరికి మోనితను చూసి షాక్ అవుతాడు. మోనిత కూడా కార్తీక్ ను ప్రేమగా చూస్తుంది. ఇక కార్తీక్ నువ్వేంటి ఇక్కడ అని కోపంతో రగిలిపోతాడు.
 

610

ప్రేమ ఉంటే ఎంత దూరమైనా వస్తాను అంటూ తన మాటలతో కార్తీక్ ను రెచ్చకొడుతుంది మోనిత. హిమ తన తండ్రితో మాట్లాడదామని వచ్చేసరికి మోనితను చూసి షాక్ అవుతుంది.
 

710

అదే సమయంలో మోనిత హిమను చూసి కార్తీక్ తో మరింత రెచ్చిపోయేలా మాట్లాడుతుంది. అప్పుడు పెళ్లి చేసుకుంటా అన్నావు కదా కార్తీక్ అంటూ హిమకు అర్థమయ్యేలా మాట్లాడుతుంది.
 

810

అంతేకాకుండా తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది. హిమ ఆ మాటలు విని తట్టుకోలేక అక్కడ్నుంచి ఏడ్చుకుంటూ బయలుదేరుతుంది.
 

910

మరోవైపు సౌర్య ఆ పేపర్ పట్టుకొని వుండగా అంతలోనే దీప వచ్చి పేపర్ లాక్కుంటుంది. కానీ సౌర్య మాత్రం తను హిమ పేపర్ చదివాము అంటూ గట్టి షాకిస్తుంది. అంతేకాకుండా ఎమోషనల్ గా మాట్లాడుతుంది.
 

1010

తరువాయి భాగంలో హిమను ఆదిత్య, ఇంటికి తీసుకొస్తారు. దీపను చూసి హిమ కోపంగా వెళుతుంది. పిల్లలకు నిజం తెలిసి పోయింది అంటూ అందరితో చెబుతుంది.

click me!

Recommended Stories