వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్ లాంటి ప్రధాన నటీనటులపై దర్శకుడు కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. చిత్ర యూనిట్ లో జోష్ ని మరింత పెంచేలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎఫ్3 సెట్స్ ని సందర్శించారు. చిత్ర యూనిట్ తో బన్నీ సరదాగా ముచ్చటించారు. ఎఫ్3 చిత్ర విశేషాలని దర్శకుడిని అడిగి తెలుసుకున్నారు.