Karthika Deepam: శుభం కార్డు పడే సమయానికి వచ్చిన మోనిత.. మళ్ళీ అదే రచ్చ మొదలు!

Navya G   | Asianet News
Published : Feb 12, 2022, 10:32 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులకు రోజు రోజుకు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక సౌర్య, హిమ లు ఆనంద్ ను ఆడిస్తున్న క్రమంలో హిమ..తమ్ముడు అచ్చం నాన్న లాగా ఉన్నాడు కదా నానమ్మ అని సౌందర్య (Soundarya) తో అంటుంది.  

PREV
15
Karthika Deepam: శుభం కార్డు పడే సమయానికి వచ్చిన మోనిత.. మళ్ళీ అదే రచ్చ మొదలు!

దాంతో సౌందర్య (Soundarya) తప్పమ్మా.. అలా మాట్లాడకూడదు అని చెబుతుంది. ఆ తర్వాత సౌందర్య మీ అందరికీ మావయ్య గారు పార్టీ ఇవ్వమని చెప్పారు అని చెబుతుంది. కార్తీక్ పార్టీ ఎందుకమ్మా అని అడుగుతాడు. కానీ సౌందర్య చెప్పదు. మరోవైపు మోనిత (Monitha)  వెళ్లేదారిలో  వాళ్ళ అత్తగారికి దండం పెట్టుకుని వెళ్దాం అని భారతితో అంటుంది.

25

మరోవైపు సౌర్య (Sourya) , హిమ లు అమ్మ నాన్నలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేస్తూ ఉంటారు. అది చూసిన సౌందర్య ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇక సౌర్యా, హిమలు వాళ్ళ తల్లి దండ్రుల పెళ్లి గురించి వాళ్ళ నాన్నమ్మ ని అడగగా సౌందర్య (Soundarya)  జరిగిన చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటుంది.

35

ఇక సౌందర్య (soundarya) ఆ విషయాన్ని అవాయిడ్ చేసి పిల్లలతో..  మీ అమ్మనాన్న పెళ్ళిరోజు అని అన్న సంగతి వాళ్లకు చెప్పకండి సర్ప్రైజ్ చేద్దామని అంటుంది. దాంతో హిమ, సౌర్య లు కూడా ఆనందంగా సరే అంటారు. ఇక ఫ్యామిలీ అంతా పెళ్లి రోజు వేడుకలు కి  ఘనంగా డెకరేట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో పిల్లలు కార్తీక్ ని కూడా రెడీ చేస్తారు. కానీ కార్తిక్ (Karthik)  కు ఏం అర్థం కాదు.

45

ఇక ఆదిత్య (Adithya) , కార్తీక్ కు వెడ్డింగ్ అనివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతాడు. ఈ క్రమంలోనే సౌందర్య ' నీ పెళ్లి మేము చూడలేకపోయాము అప్పటి ఆలోటు ఇప్పుడు తీర్చుకుంటున్నాము అని కార్తీక్ తో ఆనందంగా అంటుంది. ఇక తరువాత సౌందర్య.. నేను వెళ్లి పెళ్లి కూతురుని తీసుకు వస్తాను అంటూ దీప (Deepa) ను తీసుకుని రావడానికి వెళుతుంది. 

55

ఇక గదిలో ఉన్న దీపకు (Deepa)  సౌందర్య పెళ్లి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపి కొంత ఆనందం వ్యక్తం చేసి దీపకు ఒక ముద్దు పెడుతుంది. ఈ క్రమంలో అత్తా.. కోడళ్ల బాండింగ్ చాలా బావుంటుంది. ఇక సౌందర్య దీపను పెళ్లి పీటల దగ్గరకు తీసుకొని వస్తుంది. ఇక ఫ్యామిలీ అంతా  పెళ్లి వేడుకల్లో మునిగిపోగా ఇక ఇలోపు మోనిత (Monitha) అక్కడకు వస్తుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories