DJ Tillu Movie Review: డిజే టిల్లు ప్రీమియర్స్ రివ్యూ... రెచ్చిపోయిన సిద్దు...

Published : Feb 12, 2022, 06:38 AM ISTUpdated : Feb 12, 2022, 06:41 AM IST

మరోసారి విశ్వరూపం చూపించాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ సిద్థు జొన్నలగడ్డ. తన అటీట్యూడ్.. కామెడీ టైమింగ్.. రొమాన్స్.. ఏదీ మిస్ అవ్వకుండా.. డిజే టిల్లు మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి ఈసినిమా సిద్ధు కెరియర్ కు బ్రేక్ ఇస్తుందా..

PREV
18
DJ Tillu Movie Review: డిజే టిల్లు ప్రీమియర్స్ రివ్యూ... రెచ్చిపోయిన సిద్దు...

సిద్దు సిద్థు జొన్నలగడ్డ,  నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ DJ టిల్లు. ఈ మూవీ ఈ రోజు (ఫిబ్రవరి 12, 2022)న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. అయితే అంతకు ముందే యూఎస్ లో ఈ సినిమా ప్రిమియర్స్  పడ్డాయి. మరి ఈసినిమా గురించి ప్రిమియర్స్ రివ్యూ ఏలా ఉందో చూద్దాం.

28

ఈసినిమాకు డైరెక్టర్ విమల్ కృష్ణ కాని.. ఈసిమాకు కథ,స్క్రీన్ ప్లే అందించింది మాత్రం హీరో సిద్ధునే. ఈమూవీని ఓన్ చేసుకుని తన సినిమాగా దగ్గరుండి  తీసుకున్నాడు సిద్ధు. ఆడియన్స్ తన నుంచి ఏం కావాలి అనుకుంటున్నారు.. ఏం ఇవ్వాలి అనేది బేరీజు వేసుకుని మరీ.. పక్కా కాన్ఫిడెంట్ తో డీజే టిల్లు సినిమాను రిలీజ్ చేశాడు.

38

ఎప్పటిలాగానే చిల్ అండ్ ఎంజాయింగ్ క్యారెక్టర్ లో సిద్ధు కనిపించాడు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ.. హ్యాపీగా బ్రతికేస్తున్న టిల్లు లైఫ్ లోకి నేహా శెట్టి ప్రవేశిస్తుంది. ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన తరువాత సడెన్ గా నేహాశెట్టి గురించి రకరకాల  విషయాలు తెలుసుకుంటాడు సిథ్ధు.. ఆమెను అనుమానించడం మొదలు పెడతాడు. మరి ఈ సమస్యలు దాటుకునిఈజట కలిసారా..? అవి అపార్ధాలా..? నిజాలా...? ఇవి తెలియాలంటే డిజే టిల్లు చూడాల్సిందే.

48

సినిమా అంతా వన్ మ్యాన్ షోలా నడిపించాడు సిద్ధు జొన్నలగడ్డ. తను రాసుకున్న కథ. తన స్క్రీన్ ప్లే కదా.. అందుకే స్క్రీన్ అంతా తనే కనిపించాడు. కాకపోతే సిద్దుని కూడా డామినేట్ చేస్తూ.. పెర్పామెన్స్ తో అదరగొట్టింది హీరోయిన్ నేహా శెట్టి. తన మార్క్ యాక్టింగ్ ఎలా ఉంటుందో చూపించింది. సిద్ధు ఏనర్జీకి పోటీ పడి నటించిన నేహా శెట్టికి ఈ సినిమాతో వందకు వంద మార్కులు పడ్డాయి.

58

ఇక సిద్ధు పాత్ర గురించి చెప్పేదేముంది. గతంలో గుంటూరుటాకీస్ లాంటి సినిమాల్లో ఏ  రేంజ్ లో రెచ్చిపోయాడో.. ఈసినిమాలో అంతకు మించి చూపించాడు సిద్ధు. రొమాంటిక్ సీన్స్ తో పాటు కామెడీ టైమింగ్.. ఇంకా ఆడెడ్ అట్రాక్షన్ గా తెలంగాణ యాస్ ను చేర్చి దడదడలాడించాడు. సినిమా అంతా పంచ్ ల ప్రవాహంలా సాగింది. మిగతా ఆర్టిస్ట్ లను డామినేట్ చేసేలా సిద్ధు వన్ మ్యాన్ షో చేశాడు.

68

ఇక సినిమా విషయానకి వస్తే.. అంతా బాగానే ఉంది. కాని సెకండ్ హాఫ్ సినిమాపై ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. ఫస్ట్ హాఫ్ సినిమాను జోరుగా తీసుకెళ్లిన టీమ్.. సెకండ్ హాఫ్ విషయంలో గట్టిగానే దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ గా విమల్ కృష్ణ తడబడినట్టు సినిమా చూస్తే అర్ధమౌతుంది. సిద్ధు జొన్నల గడ్డ కూడా ఒకటే పాయింట్ మీద దృష్టి పెట్టి సినిమాలో కొన్ని విషయాలు గాలికి వదిలేసిన్నట్టు ఆడియన్స్ ఫీలవుతున్నారు.

78

ఇక మరికొంత మంది మాత్రం సిద్ధు ఈజ్ బ్యాక్.. చాలా కాలంగా కామ్ గా ఉన్న యంగ్ హీరో .. ఎజర్టిజిటిక్ పర్ఫామెన్స్ తో ఇరగదీశాడంటూ.. తెగపొగిడేస్తున్నారు. ఈ సినిమాకు ప్లాస్ అవుతుంది అనకున్న మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా భారీ హిట్ అనిపించుకోవడం కష్టం కాని.. ఫన్ లవర్స్ ను మాత్రం అలరిస్తుంది.   

88

ప్రిన్స్ సెసిల్,బ్రహ్మాజీ,ప్రగతి, నర్రా శ్రీనివాస్ ముఖ్యమైన పాత్రలు పోషించిన ఈసినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, ఎడిటింగ్ నవీన్ నూలి హ్యాండిల్ చేశారు.

click me!

Recommended Stories