ఆ తర్వాత సీన్లో రాంపండులు, ఆ డాక్టర్, వాళ్ళ అమ్మ, అందరూ కలిసి దీప వాళ్ళ పెళ్లిరోజుని ఘనంగా కేక్ కటింగ్ చేసి జరిపిస్తారు. అక్కడ అందరూ మీ భర్తని ఎలాగైనా దొరకాలి అమ్మ అని దీపని ఆశీర్వదించి అంత మంచే జరుగుతుంది అని అంటారు. ఆ తర్వాత సీన్లో సౌందర్య,ఆనంద రావు,శౌర్య తిరిగి వెళ్ళిపోమండము తలుచుకొని బాధపడుతూ ఉంటారు.ఇంతటిలో హిమా అక్కడికి వచ్చి మీరు వెళ్లి వెతకండి శౌర్య కోసం అని అనగా,శౌర్య రాను అంటుంది అని అంటారు. అప్పుడు హిమ అయితే నేను తిండి మానేస్తాను, చదువు మానేస్తాను ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు సౌందర్య హిమ ని కొడుతుంది.అప్పుడు హిమ, సౌర్యని వదిలి నేను ఉండలేను నానమ్మ ప్రమాదం జరిగిన రోజు అమ్మానాన్న శౌర్య జాగ్రత్త అని అన్నారు.