Karthika Deepam: డాక్టర్ బాబు, వంటలక్క గురించి ఆరా తీస్తున్న మోనిత.. ఇంతలో మరో ట్విస్ట్!

Navya G   | Asianet News
Published : Feb 07, 2022, 08:54 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో తెలుసుకుందాం. అంజలి, భారతి వాళ్ళ దగ్గరకి వచ్చి వంటల సంగతి చూసుకో మంటుంది. ఇక మోనిత (Monitha) చిరాకు పడుతూ వంటలు చేసే దగ్గరకు వెళుతుంది.  

PREV
16
Karthika Deepam: డాక్టర్ బాబు, వంటలక్క గురించి ఆరా తీస్తున్న మోనిత.. ఇంతలో మరో ట్విస్ట్!

ఇక వంటల దగ్గరికి వచ్చిన మోనిత (Monitha)  అక్కడ వంట చేస్తున్న కార్తీక్ ను చూసి స్టన్ అవుతుంది. వెంటనే ఆ విషయాన్ని భారతి కి చెప్పడానికి పరిగెత్తుకుంటూ వెళుతుంది. దాంతో భారతి కూడా చూడడానికి వస్తుంది. కానీ అక్కడ కార్తిక్ (Karthik)  ఉండడు అదే షర్ట్ తో వేరే వంట మనిషి ఉంటాడు.
 

26

దాంతో భారతి, మోనిత (Monitha) మీద విసుగుకొని మోనితను అక్కడి నుంచి తీసుకుని వెళుతుంది. ఆ తర్వాత దీప ఇంట్లో వాళ్లకు టి ఇవ్వడానికి వెళుతుంది. ఆ క్రమంలో భారతి ఫోన్ మాట్లాడుతూ ఉండగా భారతికి దీప టీ ఇవ్వబోతుండగా దీప, భారతి (Bharathi) ను కని పెట్టి అక్కడ నుంచి హైడ్ అవుతుంది.
 

36

ఆ క్రమంలోనే దీప, మోనిత (Monitha)  ను కూడా చూసి స్టన్ అవుతుంది. ఇక అక్కడినుంచి దీప తప్పించుకొని కార్తీక్ దగ్గరికి వచ్చి మోనిత, భారతిలు ఇక్కడే ఉన్నారు. మనం ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని చెబుతుంది. కానీ కార్తీక్ (Karthik) మనకు ఇంత సహాయం చేసిన డాక్టర్ అంజలి కు ద్రోహం చేసి వెళ్లడం కరెక్ట్ కాదు అని చెబుతాడు.
 

46

దానికి దీప (Deepa) .. మీరు చెప్పింది కరెక్టే కానీ వాళ్ళు ఎక్కడ చూస్తారో అని నాకు టెన్షన్ గా ఉంది అని అంటుంది. దానికి కార్తీక్ (Karthik) వంటలన్నీ త్వరగా పూర్తి చేసి వెళ్దాం అంటాడు. ఇక ఇద్దరు కలిసి వంటలన్నీ పూర్తి చేస్తారు.
 

56

ఈ లోపు వాళ్ల దగ్గరికి అంజలి వచ్చి కేక్ తిని భోజనం చేసి వెళ్ళండి అని చెబుతోంది. ఇక దాంతో కార్తీక్  (Karthik) తన మెడలో కండువా ను మాస్క్ లా కట్టుకొని ఆ బర్త్డే పార్టీ దగ్గరకు వెళతాడు. అంజలి,  కార్తీక్ తో కేక్ అందరికీ పంచమని చెబుతుంది. అలా కార్తీక్, మోనితకు కేకు ఇస్తున్న క్రంలో  మోనిత (Monitha) , కార్తీక్ ను చూసి కార్తీక్ కాకుండా బ్రమ పడినట్టు అనుకుంటుంది.
 

66

ఆ తర్వాత అందరి ముందు డాక్టర్ అంజలిని, మోనిత (Monitha) హార్ట్ ఆపరేషన్ చేసిన అమ్మాయి ఎవరో.. వాళ్ళ పేరెంట్స్ ఎవరో  కాస్త చెబుతారా అని అడుగుతుంది. దానికి అంజలి (Anjali) ఇందాక కేక్ పంచిన వాళ్లే..ఆ అమ్మాయి తల్లిదండ్రులు అని చెబుతోంది. మరి ఈ క్రమంలో రేపటి రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories