లతా అంత్యక్రియల్లో షారూఖ్‌, అమీర్‌, రణ్‌బీర్‌ కపూర్‌.. ట్రెండింగ్‌లో కింగ్‌ ఖాన్‌ పిక్స్.. కారణమిది..

Published : Feb 06, 2022, 09:17 PM ISTUpdated : Feb 06, 2022, 09:18 PM IST

స్వరకోకిల లతా మంగేష్కర్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఈ అంత్యక్రియల్లో షారూఖ్‌ ఖాన్‌, ఆయన భార్య గౌరీ ఖాన్‌, అమీర్‌ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ వంటి సినీ ప్రముఖులు హాజరై నివాళ్లర్పించారు. అయితే షారూఖ్‌ పిక్స్ ట్రెండ్‌ కావడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

PREV
19
లతా అంత్యక్రియల్లో షారూఖ్‌, అమీర్‌, రణ్‌బీర్‌ కపూర్‌.. ట్రెండింగ్‌లో కింగ్‌ ఖాన్‌ పిక్స్.. కారణమిది..

స్వర కోకిల లతా మంగేష్కర్‌ ఆదివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదుశ్వాస విడిచారు. గత నెల రోజులుగా ఆమె కరోనా పోరాడుతూ చివరికి తుదిశ్వాస విడిచారు. కరోనా నెగటివ్‌ వచ్చినా.. ఆమె అవయవాలు బాగా దెబ్బతినడంతో చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు. దీంతో సంగీత లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 

29

తన గాత్రంతో పాటకి ప్రాణం పోసిన లతా గొంతు ఆగిపోవడంతో సంగీత ప్రపంచమే కాదు, యావత్‌ భారతీయ లోకం కన్నీరు మున్నీరవుతుంది. ఆమె మృతికి సంతాపంగా కేంద్ర ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇక ఈ రోజు సాయంత్రం ముంబయిలోని అధికార లాంఛనాలతో లతా మంగేష్కర్‌ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు ప్రధాని మోడీ, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు లతా భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు.

39

వీరిలో బాలీవుడ్‌ హీరోలు అమీర్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధానంగా ఉన్నారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కానీ షారూఖ్‌ పిక్స్ ట్రెండ్‌ అవుతుండటం విశేషం. మరి అంతగా ట్రెండ్‌ అవడానికి కారణాలేంటనేది చూస్తే. 

49

అయితే షారూఖ్‌పై కొందరు నెటిజన్లు నెగటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. సెక్యూలర్‌ పర్సన్‌ అని, ఆయన సెక్యూలారిటీని చాటుకుంటున్నారని కొందరు కామెంట్లు చేస్తూ షారూఖ్‌ని ట్రోల్‌ చేస్తున్నారు. 

59

మరికొందరు షారూఖ్‌ని సపోర్ట్ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. ఎన్ని విమర్శలు, నెగటివ్‌ కామెంట్లు వచ్చినా షారూఖ్‌ని ఏం చేయలేవని, ఆయన్ని తక్కువ చేయలేవని, ఇప్పుడు లతా అంత్యక్రియల్లో పూర్తి సోల్‌తో , స్వచ్ఛమైన మనసుతో పాల్గొన్నారని, అది ఆయన గొప్పతనమని ప్రశంసిస్తున్నారు. షారూఖ్‌ ఫోటోలను ట్రెండ్‌ చేస్తున్నారు. 

69

ఓ వైపు పలు విమర్శలు, ఇంకో వైపు ప్రశంసలతో ఇప్పుడు షారూఖ్‌ ట్రెండ్‌ అవుతున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య గౌరీ ఖాన్‌ కూడా లతా భౌతిక దేహాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. ఇదిలా ఉంటే చాలా గ్యాప్‌తో షారూఖ్‌ ఖాన్‌ `పఠాన్‌` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనె కథానాయికగా నటిస్తుంది. ఇది విడుదలకు సిద్ధమవుతుంది. 

79

ముంబయిలోని శివాజీ పార్క్ లో ఉంచిన లతా మంగేష్కర్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించిన బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌. 

89

ముంబయిలోని శివాజీ పార్క్ లో ఉంచిన లతా మంగేష్కర్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించిన బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌. 

99

ముంబయిలోని శివాజీ పార్క్ లో ఉంచిన లతా మంగేష్కర్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించిన బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమిర్‌ ఖాన్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories