Karthika Deepam: కార్తీక్ ని బ్లాక్ మెయిల్ చేసిన మోనిత.. దీప పరిస్థితి తలుచుకొని బాధపడుతున్న చంద్రమ్మ?

First Published Jan 12, 2023, 7:42 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జనవరి 12వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో ఇంద్రుడు చంద్రమ్మ ఇద్దరు ఇంటికి వస్తారు. అప్పుడు సౌర్య వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎక్కడికి వెళ్ళిపోయారు బాబాయ్ సమయానికి మీరు లేరు అనడంతో ఏం జరిగింది అమ్మ అని అడగగా అమ్మ నాన్నలు కనిపించారు అని సౌర్య అనగా కనిపించి మళ్లీ వెళ్ళిపోయారు అమ్మ అనడంతో ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు. కనిపించారు అంటే సంతోష పడాల్సింది పోయి టెన్షన్ పడుతున్నారు అని అనగా అదేం లేదమ్మా ఉన్న హిమకు కనిపించినట్టు కనిపించి అలానే వెళ్లిపోయారు కదా అనగా మేము ఈసారి అలాంటి అవకాశం ఇవ్వలేదు పిన్ని అమ్మను పిలుసుకొని వచ్చాము ఇంట్లోనే ఉన్నారు అనడంతో ఇంద్రుడు దంపతులు టెన్షన్ పడుతూ ఉంటారు.
 

పదండి పిన్ని అమ్మానాన్నలకు పరిచయం చేస్తాను అని లోపలికి పిలుచుకొని వెళ్లగా ఇంతలో సౌందర్య అక్కడికి వచ్చి నా కొడుకు కోడలు వచ్చారంటే ఇందాకే పిల్లలు కూడా చెప్పారు అమ్మ అని అనగా అందరు సంతోష పడుతూ ఉంటారు. ఇంతలోనే కార్తీక్ దీప అక్కడికి వస్తారు. అప్పుడు సౌర్య వీళ్లే నాన్న మా పిన్ని బాబాయ్ అనడంతో దీప కార్తీక్ లో చంద్రమ్మ దంపతులు ఎవరో తెలియదు అన్నట్టుగా కొత్తగా పలకరిస్తూ ఉంటారు. అప్పుడు దీప థాంక్స్ చంద్రమ్మ అనగా అందరూ దీప వైపు ఆశ్చర్యంగా చూస్తారు. అదేంటమ్మా ఇంతకుముందు ఏదో పరిచయం ఉన్నట్టుగా అలా పిలిచావు అనడంతో దీప తడబడుతూ ఉండగా అప్పుడు హిమ కూడా బాబాయి పేరు ఒకటే చెప్పారు పిన్ని పేరు చెప్పలేదు.

 కదా మీకు ఎలా తెలుసు అనడంతో అప్పుడు సౌందర్య నిజం చెప్పు ఇంద్రుడు వీళ్ళు నీకు ముందే తెలుసు కదా అనగా ఇంద్రుడు టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు ఇంద్రుడు నిజంగానే మాకు తెలియదు అమ్మ కార్తీక్ సార్ దీపమని మొదటిసారి చూస్తున్నాము అని అంటాడు. సౌందర్య అసలు నిజం పసిగట్టి నాకు కూడా అదే అర్థం కావడం లేదే వీళ్ళేమో మీ పేర్లు చెప్పడం మీరేమో ఓవరాక్షన్ చేయడం అని అంటుంది. అప్పుడు దీప అబద్ధం చెప్పి కవర్ చేసుకుంటున్నారు. నా మనవరాలు నాకు కనిపించకుండా దూరంగా పిలుచుకొని వెళ్లారు కదా అలాగే దీప వాళ్లు తెలిసి కూడా ఏదైనా కారణంతో చెప్పలేదేమో అనడంతో అదేం లేదులే మమ్మీ అని అంటాడు కార్తీక్.

అప్పుడు ఇప్పటికైనా చెప్పండ్రా ఇన్నాళ్లు ఎందుకు ఇంటికి రాలేదు అని సౌందర్య నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు అమ్మ మేము బయలుదేరుతాము అనగా ఎక్కడికి బాబాయ్ అనడంతో మీ అమ్మానాన్నలు వచ్చేసారు కదా అమ్మ అనడంతో నీకు ముందే చెప్పాను కదా బాబాయ్ అందరూ కలిసే ఉందామని మళ్లీ ఎక్కడికి వెళ్తారు అని అంటుంది శౌర్య. కానీ లేదు కిని లేదు ఇక్కడే ఉండండి నానమ్మ నువ్వు కూడా వీళ్ళని ఏమీ అనద్దు అనడంతో సరేలేవే వాళ్ళను కూడా ఇక్కడే ఉండమని చెప్పు అని అంటుంది సౌందర్య. అప్పుడు సౌర్య అందరూ కలిసి ఇక్కడే సంక్రాంతి పండుగ జరుపుకుందాం అనగా వద్దు అక్కడికి వెళ్లి హైదరాబాదులో జరుపుకుందాము అని హిమ అంటుంది.

అప్పుడు వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ ఉండగా ఆపండి అని కోప్పడుతుంది సౌందర్య. ఇన్నాళ్లు ఇక్కడే ఉన్నాం కదా కొడుకు కోడలు దొరికిన సంతోషంతో ఇక్కడే సంక్రాంతి పండుగ జరుపుకుందాం అని అంటుంది సౌందర్య. ఇంద్రుడు రేపు భోగి మంటలు వేద్దాం ఏర్పాట్లు చూడు అనగా సరే అమ్మ అని అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడు అందరూ కలిసి ముగ్గులు వేయడానికి వెళ్తారు. అందరూ కలిసి ముగ్గురు వేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి హేమచంద్ర వచ్చి దీపమ్మ నువ్వు ఎప్పుడు వచ్చావు అని నోరు జారి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఉంటాడు. అంకుల్ మా అమ్మ నీకు ముందే తెలుసా అని అడుగుతుంది హిమ. అప్పుడు మరి మా అమ్మను ఎలా పేరు పెట్టి పిలిచారు అంకుల్ అని అనడంతో ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటాడు హేమచంద్ర.
 

మీరే చూపించారు కదమ్మా మీ అమ్మానాన్న ఫోటో అలా గుర్తుపట్టాను అనడంతో అవునా సరే అని అంటారు. మీకు ముందే తెలుసు ఏమో అయినా మాకు చెప్పలేదు ఏమో అని మీ మీద చాలా కోపం వచ్చింది అంకుల్ అని అంటుంది సౌర్య. పోనీలే ఇప్పటికైనా వచ్చారు రారేమో అనుకున్నాను అనడంతో శౌర్య,హిమ ఆశ్చర్యంగా చూస్తారు. మళ్లీ నోరు జారాను అని హేమచంద్ర తడబడుతూ ఉంటాడు. అప్పుడు హేమచంద్ర వెళ్తూ దీప కండిషన్ గురించి ఇంట్లో చెప్పారు లేదో అని అమ్మ అసలు విషయం మర్చిపోయాను అనగా ఏంటి అన్నయ్య అది అనడంతో ఇది మీ ఆయన వచ్చాడా లేదో అని అడుగుదామని అనుకున్నాను అని చెప్పి హేమచంద్ర టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
 

మరొకవైపు కార్తీక్ జరిగిన విషయాలు తలచుకొని కార్లో వెళ్తూ ఉండగా ఇంతలోనే మోనిత కారు అడ్డుపెట్టుకొని కూర్చుంటుంది. ఏంటి తల తిరుగుతుందా కారు అడ్డంగా పెట్టుకొని కూర్చున్నావు అనడంతో ఆ కారు పక్కకు ఆపేసి నా కారులో వచ్చి కూర్చో కార్తీక్ ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుందాము అనగా నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు నా జీవితంలో ఎవరైనా అవసరం లేని వ్యక్తి ఉన్నారు అంటే అది నువ్వే అని అంటాడు కార్తీక్. ప్లీజ్ కార్తీక్ నాతో పాటు రా అలా రెస్టారెంట్లో పది నిమిషాలు కూర్చుని మాట్లాడు అని అంటుంది మోనిత. సరే నీతో నాకు మాటలు అవసరం ఇలాగే కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోతాను అనగా వెళితే వెళ్ళు మీ అమ్మకు ఫోన్ చేసి అసలు నిజం చెప్పేస్తాను అని బెదిరిస్తుంది మోనిత.
 

నువ్వు మనిషివా పశువా మా జీవితాలతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు అనడంతో ఎక్కువ ఆలోచించొద్దు కార్తిక ఆవేశపడకు నీ రియాక్షన్ బట్టి నా ఆక్షన్ ఉంటుంది మర్యాదగా వచ్చి కార్ ఎక్కు అంటూ కార్తీక్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. అప్పుడు కార్తీక్, సౌందర్యకీ నిజం తెలిస్తే బాధపడతారు అని తెలిసి ఏం చేయాలో తెలియక మోనిత తో పాటు కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరొకవైపు చంద్రమ్మ కార్తీక్ బాబు ఇచ్చారు ఎవరికీ తెలియకుండా ఈ టాబ్లెట్స్ వేసుకోండమ్మా అని దీపకు టాబ్లెట్ తీసుకొని వచ్చి ఇస్తుంది. అప్పుడు దీప మీ సార్ పిచ్చి కానీ ఈ టాబ్లెట్స్ వేసుకున్న వేసుకోకపోయినా నేను ఎక్కువ రోజులు బతకను అని అంటుంది దీప. నీకు అసలే వేడిపడదు కానీ పొద్దున్నే నుంచి వంట గదిలోనే ఉన్నారు అని అనగా అంటే ఏం కాదులే చంద్రమ్మ పోవాల్సిన దానికంటే నాలుగు రోజులు ముందే పోతాను ఉన్నన్ని రోజులు నా పిల్లలకు సంతోషంగా వండి పెట్టానని ఆనందం నాకు ఉంటుంది అని అంటుంది దీప.

అప్పుడు వారిద్దరూ బాధగా మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడు చంద్రమ్మ దీపని పక్కకు తప్పుకోమని చెప్పి వంట చేస్తూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్ మోనిత హోటల్ కి వెళ్ళగా ఏం తింటావు కార్తీక్ అనడంతో నన్ను కాల్చుకొని తింటున్నావు చాలదా అనగా అలా మాట్లాడకు కార్తీక్ అని అంటుంది మోనిత. సర్లే కూర్చో మోనిత రాకపోతే నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావు కదా అని స్వారీ కార్తీక్ నువ్వు రావడం లేదు అందుకని ఇలా బ్లాక్ మెయిల్ చేయాల్సి వచ్చింది అని అంటుంది మోనిత. ఎందుకు కార్తీక్ అంత చిరాకు పడతావు నాతో ప్రేమగా ఉండమని చెప్పాను కదా అనగా అసలు విషయం ఏంటో చెప్పు మోనిత పది నిమిషాలు అన్నావు అంతకంటే ఎక్కువసేపు నీ ముందర కూర్చుని మాట్లాడే నాకు లేదు అని అంటాడు కార్తీక్. నువ్వు దీప చనిపోయిన తర్వాత కూడా నాకు దక్కవని తెలుసు అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటుంది మోనిత.

click me!