Veera Simha Reddy Review: వీరసింహారెడ్డి ట్విట్టర్ రివ్యూ, బాలయ్య ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్

First Published | Jan 12, 2023, 4:58 AM IST

ప్రపంచ వ్యాప్తంగా బాలయ్య అభిమానులను అలరించబోతోంది నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి. మరోసారి సమరసింహారెడ్డిని గుర్తు చేస్తూ.. బాలయ్యబాబు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న ఈమూవీ ఈరోజు(12జనవరి ) రిలీజ్ అవుతోంది. ఈక్రమంలో ముందుగా ప్రీమియర్స్ తో సందడి చేసిన ఈ సినిమాను చూసి ఓవర్సిస్  ఆయన్స్ ట్విట్టర్ ద్వారా  తమ అభిప్రాయం పంచుకుంటున్నారు. 

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా.. శ్రుతి హాసన్ హీరోయిన్ గా.. మలినేని గోపీచంద్ తెరకెక్కించిన ఊరమాస్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన  ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ అఖండ విజయం తరువాత వచ్చినఈ సినిమా.. పై ట్విట్టర్ జనాలు ఏమంటున్నారో చూద్దాం. 

వీరసింహారెడ్డి సినిమాపై అటు పాజిటీవ్ గా.. ఇటు నెగెటీవ్ గా రెండు రకాల కామెంట్లు దర్శనం ఇస్తున్నాయి. మాస్ జాతర చేస్తున్నాడు బాలయ్య.. ఫస్ట్ హాఫ్ సూపర్... యాక్షన్ సీన్స్ తో బాలయ్య..రచ్చ రచ్చ చేశాడంటూ.. చాలా మంది అభిమానుల ట్విట్టర్ లో తమసంతోషాన్ని వ్యాక్తం చేస్తున్నారు. 


మరికొంత మంది ఇంకాస్త ముందకు వెళ్లి.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ డిక్లేయిర్ చేసేస్తున్నారు. మంటలు పుట్టించాడు బాలయ్య అంటూ ట్విట్టర్ లో నినాదాలు ఇస్తున్నారు. ధియేటర్ లో మాస్ జాతర జరుగుతోంది అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఇలా వరుసగా ట్విట్టర్ లో బాలయ్య సినిమాపై రివ్యూస్ అదరగొట్టేస్తున్నారు. 
 

బాలయ్య వన్ మాన్ షో.. అంటూ మాస్ జనాలకు పూనకాలే అంటూ ట్వీట్ చేస్తున్నారు ఫ్యాన్స్. జై బాలయ్య అంటూ థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.. ఈ సంక్రాంతిమనదే అంటూ.. సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. 
 

ఇక పాజటీవ్ కామెంట్స్ తో పాటు నెగెటీవ్ కామెంట్స్ కూడా తప్పడంలేదు బాలకృష్ణ సినిమాకు. వీరసింహారెడ్డి సినిమా  పక్కా ప్లాప్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. పేపర్లు మోసుకెళ్లకండీ.. బరువు అవుతాయి.. అంత సీన్ లేదు సినిమాకు అంటూ ట్వీట్ చేశారు. మరికొందరేమో.. ఫోన్ ఫుల్ ఛార్జ్ పెట్టుకు వెళ్లండి బోర్ ఫీల్ అవుతారు సినిమాను టైమ్ పాస్ కు ఫోన్ పనికొస్తుందంటున్నారు. 
 

ఫస్ట్ హాఫ్ వరస్ట్ గా ఉంది అంటూ కొందరు ట్విట్టర్ లో కామెంట్ చేస్తున్నారు. సింహా, లెజండ్, లాంటిసినిమాలు  మిక్సీలో వేసి తీశారు. వరస్ట్  స్క్రీన్ ప్లే అంటూ ట్వీట్ చేస్తున్నారు. కొంత లో కొంత శృతీ హాసన్ యాక్టింగ్ ఆకట్టకుందంటున్నారు ఆడియన్స్. బాలయ్య ఎప్పటిలాగే అరపులు కేకలే అంటూ ట్వీట్ చేశారు. 
 

ఈ మధ్యలో మిక్డ్స్ టాక్ ఇచ్చేవారు కూడా ఉన్నారు ట్విట్టర్ లో.. వారు ట్వీట్ చేస్తూ.. సిపిమా ఫస్ట్ హాఫ్ కాస్త పర్వలేదు. బాగుంది... ఇంటర్వెల్ బ్లాక్ బాగా వర్కౌట్ అవుతుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంట్రీ అదుర్స్..  కొన్ని రోటీన్ సీన్స్ కాస్త బోర్ కొట్టిస్తాయి అయినా పర్వాలేదు.. కాని ఇంట్రో సీన్స్.. మారేజ్ ఫైట్ మాత్రం రచ్చ రచ్చ ఉంటుంది. అంటున్నారు. 

veera simha reddy censoring done ua certificate nandamuri balakrishna

అటు బాలయ్యఫ్యాన్స్ పూనకాలు లోడయ్యాయి.. మాస్ జాతర మొదలయ్యిందంటూ రచ్చ రచరచ్చ చేస్తుంటే.. ఇటు యాంటీ ఫ్యాన్స్ సినిమా ఏం లేదు.. రొటీన్ అంటున్నారు. నాన్ ఫ్యాన్స్.. నాన్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం సినిమా పర్వాలేదు.. రొటీన్ అయినా బాలయ్య కాబట్టి నడిచిపోతుంది అంటున్నారు.

veera simha reddy song mass mogudu nandamuri balakrishna Shruti Haasan thaman s

తమన్ కు మాత్రం ఈసినిమాపరంగా మంచి మార్కులు పడ్డాయి. బాలయ్య ఎనర్జీని ఎలివేట్ చేడంలో తమన్ పాత్ర చాలా ఉంది ఈసినిమాలో .. మాస్ సీన్స్ కు.. బాలయ్య డైలాగ్స్ కు తగ్గట్టు బీజియమ్ తో పాటు.. పాటలు కూడా ఈసినిమాకు చాలా ప్లాస్ అనిచెప్పాలి. ఓవర్ ఆల్ గా బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ప్రభావం ఎంతవరకూ పనిచేస్తుందో చూడాలి. 
 

Latest Videos

click me!