ఆ తర్వాత సీన్ లో కార్తీక్, శివ కార్లో వెళ్తూ మధ్యలో దిగుతారు. అప్పుడు కార్తీక్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడగగా మిమ్మల్ని ఎలా ఇంటి నుంచి బయటకు తీసుకు వచ్చాను అలాగే ఇంటికి వెళ్లి మేడంకి అప్పగించాలి సార్ అని శివ అంటాడు. అప్పుడు కార్తీక్ ఎందుకయ్యా నన్ను ఇంత పంజరంలో చిలకల ఉంచుతున్నారు. ఇల్లు కారు, ఇల్లు కారు అని, కార్లో వాకింగ్ చేయడం ఏంటి అయ్యా నాకు అర్థం కాదు అయినా అది నాకు భార్య కాదు అని అంటాడు.అప్పుడు శివ ఆశ్చర్యపోతాడు భార్య కాకపోవడం ఏంటి సార్ అని అడుగుతాడు.