లైగర్ సినిమా ప్లాప్ అయితే...? రిపోర్టర్ ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.

Published : Aug 24, 2022, 07:42 AM IST

విజయ్ దేవరకొండ అంటేనే.. ఫైర్. ఆయన కోపం కొన్ని సందర్భాలలో ఆడియన్స్ చూశారు. విమర్షలకు షార్ప్ ఆన్సర్స్ ఇవ్వడంలో ఆయన తరువాతే ఎవరైనా.? కాని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కోపంతో రగిలిపోతాడనుకుంటే.. విజయ్ మాత్రం షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇంతకీ ఆయనేమన్నాడు..?   

PREV
16
లైగర్ సినిమా ప్లాప్ అయితే...? రిపోర్టర్ ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.

లైగర్ సినిమా కోసం దేశమంతా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. విజయ్ పర్ ప్యాక్ పెర్పామెన్స్ చూడాలని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇక రౌడీ హీరో కూడా డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ.. దేశమంతా సందడి చేస్తున్నాడు. అందరిని ఆకట్టుకుంటున్నాడు. అయితే ప్రమోషన్స్ కోసం తిరుగుతన్న విజయ్ టీమ్ కు అక్కడక్కడ వింత ప్రశ్నలు తప్పడంలేదు. 
 

26

ఇక  ఈ క్రమంలో తాజాగా లైగర్‌ టీం ముంబై మీడియాతో ముచ్చటించింది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో.. ఫైనల్ టచ్ కు రెడీ అయ్యారు టీమ్.. ఈ సందర్భంగా ఓ విలేకరి నుంచి విజయ్‌కి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఒకవేళ లైగర్‌ ఫ్లాప్‌ అయితే...? పరిస్థితి ఏంటీ అని ఆ రిపోర్టర్ అడిగారు. దాంతో విజయ్ కోపంతో ఊగిపోతారని అందరూ భావించారు. కాని అక్కడ పరిస్థితి మారిపోయింది. 
 

36

రిపోర్టర్ ప్రశ్నకు రౌడీ హీరో షాకింగ్‌ రియాక్షన్‌ ఇచ్చాడు. షాకింగ్ ఆన్సర్ కూడా ఇచ్చాడు. ఈ ప్రశ్న వల్ల కోపంతో ఊగిపోతాడేమో విజయ్... అని అనుకున్నారంతా.. కాని ఆయనేమన్నారంటే..? ఇలాంటి చిన్న విషయాలకు కోపంతో ఊగిపోనవసరం లేదు. ఇదే ప్రశ్న నన్ను కొన్నేళ్ల కిందట అడిగి ఉంటే కోపంతో ఊగిపోయేవాడిని.. కాని ఇప్పుడు అలా కాదు పరిస్థితి పూర్తిగా మారిపోయింది అన్నారు. 

46

అంతే కాదు అప్పట్లో ఉన్నట్టు విజయ్ దేవరకొండ ఉండుంటే.. ఇలా అడిగినందుకు మీపై విరుచుకుపడేవాడినేమో. అప్పుడు నాకు కోపం చాలా ఎక్కువ. కానీ గత కొన్ని రోజులుగా నాకసలు కోపమే రావడం లేదు. ఎందుకంటే అభిమానులు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేసింది. ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలా చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని వారిని అవమాన పరచలేను.. అని షాకింగ్ కౌంటర్ ఇచ్చారు రౌడీ హీరో. 

56

లైగర్‌ ప్రమోషన్స్‌ చేస్తూ దేశమంత తిరిగాం.. ఎక్కడికి వెళ్ళినా.. ఆడియన్స్ అభిమానం చూపిస్తున్నారు. నన్ను తమవాడిగా రిసీవ్ చేసుకుంటున్నారు.  ఎక్కడికి వెళ్లిన ప్రేమను చూపిస్తున్నారు. అది నేను  ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. నాకు ఆడియన్సే ముఖ్యం. వారి కోసమే మేం పని చేస్తున్నాం. వారి కలిసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేందుకే అన్ని సిటీస్ కు వెళ్లి ప్రమోషన్స్ చేశాం అని తెలివిగా సమాధానం చెప్పారు విజయ్. 

66

కోపంతో ఊగిపోతాడనుకుని టెన్షన్ పడ్డారు చుట్టుపక్కల జనాలు.. కాని విజయ్ దేవరకొండ రియాక్షన్ ఇలా ఇవ్వడంతో.. అది  చూసి అంతా షాకయ్యారు. కోపంగించుకోవల్సిన టైమ్ లో..ఓపికగా.. విజయ్‌  సమాధానం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  విజయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా లైగర్ సినిమా రేపు అంటే 25 అగస్ట్ న రిలీజ్ కు రెడీ అయ్యింది. 
 

click me!

Recommended Stories