Karthika Deepam: సౌర్యతో మాట్లాడిన దీప... మోనిత వలలో దీప చిక్కనుందా?

First Published Sep 16, 2022, 7:58 AM IST

Karthika Deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 16వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... కొన్ని మంది వచ్చి గతం గుర్తు రావడానికి మందు ఇస్తాము అని మోనిత దగ్గరికి వెళ్తారు. అప్పుడు మోనిత,డబ్బులు లాగడానికి ఇదొక కొత్త ప్లాన్ ఆ?అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు, దీనికి డబ్బులు ఏమీ అవసరం లేదు ఒకసారి ప్రయత్నించండి అని అనగా, నాకు వద్దని చెప్తున్నాను కదా! ఎక్కువ మాట్లాడితే మా ఆయనకి గతం గుర్తు రావాల్సిన అవసరం కూడా లేదు అని వాళ్ళని పంపిస్తుంది. అప్పుడు దీప మనసులో,ఎక్కడ డాక్టర్ బాబుకి గతం గుర్తొస్తే నీ బండారం బయటపడుతుంది అని భయపడుతున్నావే అని అనుకుంటుంది.
 

అప్పుడు  వచ్చిన వాళ్ళిద్దరూ తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు దీప వాళ్ళని ఆపి, నిజంగానే ఆ మందు ఇస్తే గతం గుర్తొస్తుందా అని అడుగుతుంది.అప్పుడు వాళ్లు,మా స్వామీజీ ఎప్పుడూ తప్పు చెప్పరు,వైద్యం చేసిన ప్రతి ఒక్కరికి నయం అయింది. కావాలంటే మీరు ప్రయత్నించొచ్చు అని అంటారు. అప్పుడు దీప,నాకు తెలిసిన వాళ్లకి కూడా గతం మర్చిపోయారు కానీ, వాళ్ళు అక్కడికి వచ్చే పరిస్థితులు లేరు. వాళ్ళు బదులు నేను వచ్చి మందును తీసుకెళ్లవచ్చా అని అడగగా, కచ్చితంగా తీసుకెళ్లొచ్చు కానీ ఆ మందుకి  సూర్యకిరణాలు తగిలితే దాని శక్తిని కోల్పోతుంది.
 

 కనుక మీరు ఈరోజు రాత్రికి వచ్చి, రేపు రాత్రి వరకు ఉండి మళ్ళీ రేపు రాత్రి బయలుదేరాలి. అయినా కంగారు ఏమీ లేదు, మీరు అందర్నీ కనుక్కొని బయలుదేరండి అని వాళ్ళు అంటారు. అప్పుడు దీప వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. ఆ తర్వాత సీన్లో దీప వెంటనే వాళ్ళ అన్నయ్య దగ్గరికి పరిగెట్టి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఆ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్లతో మాట్లాడుతారు. వివరాలన్నీ కనుక్కున్న తర్వాత, ఆయుర్వేదం కద అమ్మ,ఇలాంటి విషయాలకు మంచిదే.ఒకసారి ప్రయత్నించి చూద్దాం అని ఈరోజు రాత్రికి బయలుదేరు అని సలహా ఇస్తాడు.
 

ఆ తర్వాత సీన్లో మోనిత ఏడుస్తూ, నేను నీకోసమే మన బాబుని వదులుకున్నాను కార్తీక్ కానీ నువ్వు గతం గుర్తుకు  తెచ్చుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి నీ ఆరోగ్యానికి ప్రమాదం అవుతది. నువ్వు ఎందుకు గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు? నేను ఉన్నాను కదా ఇంకా గతం ఎందుకు? అందుకే నిన్ను మన సొంత ఊరు కి కూడా తీసుకువెళ్లడం లేద. అక్కడ నువ్వు గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని ఏడుస్తూ నటిస్తుంది. అప్పుడు కార్తీక్, నేను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించట్లేదు అదే గుర్తొస్తుంది కానీ చాలా అస్పష్టంగా, ఏది తెలియడం లేదు.
 

నేను ఇంక ప్రయత్నించనులే అయినా మన బాబు చెన్నైలో ఉన్నాడన్నావ్ కదా మనం వెళ్లి తెచ్చుకుందామా అని అడగగా, ఒద్దు కార్తీక్ నువ్వుండు.నిన్ను శివుని చూసుకుంటాడు, నేను వెళ్లి తెస్తాను అని అంటుంది. ఆ తర్వాత సీన్లో మోనిత,దీప ఇంటి ఎదురుగుండా వచ్చి, అయ్యో దీపక్క ఎవరో వచ్చి గతం గుర్తు చేస్తాను అని అంటే ఎలా నమ్మి బయలుదేరుతున్నావు, ఈ రెండు రోజులు నువ్వు ఆ ఊరులలో ఉంటావ్, నేను హాయిగా ఆనంద్ ని తీసుకొని వస్తాను.పాపం అమాయకురాలు ఏం చెప్తే అది నమ్మేస్తావు అని అనుకుంటుంది.ఇంతలో దీప ఇంటికి తాళం వేసి బాగ్ సద్దుకుంక్ వస్తుంది.
 

ఏంటి దీప ఎక్కడికి వెళ్తున్నావు? అని అడగగా డాక్టర్ బాబుకి గతం గుర్తొస్తుందిలే వారంలో అప్పుడు మాట్లాడుకుందామని అంటుంది దీప. అంత నమ్మకంగా ఉన్నావేంటి కొంపతీసి ఇందాక వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావా అని అడగగా, ఏమీ డాక్టర్ బాబు కి గతం గుర్తొస్తుందని భయపడుతున్నావా అని అంటుంది దీప. సరే నీ ప్రయత్నం నువ్వు చేస్కో ఆల్ ద బెస్ట్ అని దీప నీ పంపిస్తుంది మోనిత. దీపం వెళ్ళిపోయిన తర్వాత,నువ్వు ఇలాంటి విషయాలు నమ్ముతావని నేను అసలు అనుకోలేదు అక్క.నిన్ను చూస్తే జాలేస్తుంది అని అనుకుంటుంది.
 

అప్పుడు దీప బ్యాక్ పట్టుకుని సౌర్య వాళ్ళ బాబాయ్ ఆటోని చూస్తుంది.వెనక అమ్మానాన్న ఎక్కడున్నారు అని ఉంటుంది.అప్పుడు దీపకీ, సౌర్య "అమ్మ త్వరగా రా" అని ఆటో వెనక ఒకప్పుడు రాసిన సంఘటన    గుర్తొస్తుంది. అప్పుడు అదే సమయంలో శౌర్య,వాళ్ళ బాబాయ్ కి ఫోన్ చేసి పిన్ని కొన్ని సరుకులు తీసుకురమ్మని చెప్పింది రాసుకో అని అంటుంది. నీ గొంతు మారిపోయింది జ్వాలా.ఇంకా జలుబు తగ్గినట్టు లేదు మందులు తెస్తాను అని ఆ లిస్టు సరుకులు లిస్ట్ చెప్పు అని అనగా దీప, నేను రాస్తాను లెండి మీరు ఆటో తీయండి అని అంటుంది.
 

అప్పుడు శౌర్య, ఇది అమ్మ గొంతు లాగా ఉన్నదే అని అనుకుంటుంది.అప్పుడు దీపా వెనక కూర్చొని రాస్తున్నప్పుడు దారిలో రోడ్డుమీద సౌండ్ లో అన్ని కలిసిపోయి సౌర్యకి సరిగ్గా గొంతు వినిపించదు. కానీ సరుకులు లిస్ట్ చెప్తున్నప్పుడు వాళ్ళ అమ్మ గొంతు అని అనుకుంటుంది. శౌర్య జలుబు వల్ల గొంతు మారినందుకు దీప, శౌర్య గొంతు గుర్తుపట్టలేక పోయింది. వెంటనే ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో బస్టాండ్ వస్తుంది.అప్పుడు సౌర్య వాళ్ళ బాబాయ్,ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగా, ఇక్కడ పలానా ఊర్లో ఒక వైద్యశాల ఉన్నదట కదా! అక్కడికి వైద్యం కోసం వెళ్తున్నాను అని అంటుంది. అప్పుడు సౌర్య వాళ్ళ బాబాయ్, మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఉన్నారు.
 

మీరు చెప్తున్న ఊరు మా సొంత ఊరే, అక్కడ అలాంటివి ఏమీ లేవు అదంతా కొండల ప్రాంతం అని అంటాడు. అప్పుడు దీప మనసులో, ఇది మోనిత ఏమైనా ప్లాన్ చేసిందా? అయినా ఇందాక నాతో అంత ధైర్యంగా మాట్లాడిందంటే దాని పనే అయి ఉంటుంది. రెండు రోజుల నన్ను బయటకు పంపి, డాక్టర్ బాబు నీ ఏం  చేద్దామనుకుంటుంది అని అనుకుంటుంది దీప. ఆ తర్వాత సౌర్య వాళ్ళ బాబాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు, అప్పుడు శౌర్య,వాళ్ళ బాబాయ్ కి ఫోన్ చేసి, ఇందాక నువ్వు నాతో మాట్లాడిపించిన ఆవిడ ఫోటో తీసి పంపగలవా.
 

మా అమ్మ గొంతులో ఉన్నది అని అనగా, ఆవిడ వెళ్లిపోయారమ్మ. అయినా ఆయన భర్త కోసం వైద్యానికి వెళ్తున్నారట. మీ అమ్మ అయ్యి ఉండదు లే,నాకు ఇప్పుడు తన మొఖం గుర్తుంది కదా, మరోసారి కలిసినప్పుడు ఫోటో తీస్తానని ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత సీన్లో దీపా పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ, అన్నయ్యలు ఇంటికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు కంగారుగా అక్కడికి వెళ్లలేదా దీపా అని అడగగా,  వైద్యం లేదు ఏదీ లేదు అదంతా కొండల ప్రాంతం అంత.ఇదంతా మోనిత ప్లాన్ అని దీప అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!