Karthika Deepam: కార్తీక్ మీద అనుమానంతో మోనిత.. శౌర్యని వెతుక్కుంటూ కార్తీక్!

Published : Oct 21, 2022, 10:07 AM IST

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 21వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.  

PREV
16
Karthika Deepam: కార్తీక్ మీద అనుమానంతో మోనిత.. శౌర్యని వెతుక్కుంటూ కార్తీక్!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. కార్తీక్ పోలీసులతో, ఈవిడ పేరు దీప ఈవిడకి ప్రాణాపాయం ఉన్నది కొంచెం సెక్యూరిటీ ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు పోలీసులు, ప్రాణాపాయం ఉందంటున్నారు కదా ఎవరి వల్లో చెప్తే వాళ్ళని అరెస్ట్ చేస్తామని అంటారు. అప్పుడు కార్తీక్ మోనిత వైపు చూస్తూ, మోనిత మొన్న దీప వెనకాలు రౌడీలు పడ్డారు కదా ఎవరు వాళ్ళు? అని అనగా మోనిత కంగారు పడుతుంది. ఓహో చీకట్లో కొట్టారు కదా నీకు మాత్రం ఏం తెలుసులే. ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ ముఖాలు తెలియదు కానీ మళ్ళి దీప వెనక పడతారేమో అని అనుమానం ఉన్నది అని అంటాడు కార్తీక్.దానికి పోలీసులు, మీరు ఏమీ భయపడొద్దు మా దగ్గర రౌడీషీటర్ల లిస్ట్ ఉన్నది గట్టిగా కొడితే వాళ్లే నిజం బయటపెడతారు అని అంటారు. అప్పుడు దీప కార్తీక్ తో, మొన్న రౌడీలు దగ్గర నుంచి కాపాడారు ఈరోజు పోలీసులు దగ్గర నుంచి కాపాడారు ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతుంది. దీప, దుర్గా వెళ్ళిపోయింది తర్వాత మోనిత కార్తీక్ మీద కోప్పడి, నువ్వేం చేస్తున్నావ్ తెలుసా వాళ్లను ఎందుకు కాపాడావు అని అడుగుతుంది. దానికి కార్తీక్,  అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా మొదట స్నేహితుడు అన్నావు, బంధువు అని ఇంట్లో కూర్చోబెట్టావు ఇప్పుడు వాడు రౌడీ అంటున్నావ్.
 

26

ఎంక్వయిరీ చేస్తే అందులో నీకు భాగం ఉన్నదంటే నా పరువు ఏమీ అవ్వాలి అని అనగా మోనిత, నీకు బానే గుర్తున్నట్టున్నాయి కార్తీక్ విషయాలు అన్ని అని అనగా, ఈ మధ్య ఏదో చిన్నచిన్నది గుర్తుంటుంది అలాగే గతం గుర్తొస్తే భాగున్ను అని అనగా మోనిత కంగారుపడుతుంది.  నువ్వు బాధ పడాల్సిన అవసరం లేదు కదా అంటే నాకు గతంలో నువ్వు ఏమైనా తప్పులు చేసావా నువ్వేం చేసి ఉంటావులే అని కావాలని మోనిత నీ భయపెట్టి వెళ్లిపోతాడు కార్తీక్. ఆ తర్వాత సీన్ లో మోనిత హాల్లో కూర్చుని,  కార్తీక్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు ఈరోజు దుర్గ నీ కాపాడాడు నిజంగా కార్తీక్ కి ఏమైనా గతం గుర్తొచ్చిందా!లేక నిజంగా పరువు పోతుందని చేశాడా లేకపోతే నా మీద అనుమానంతో దుర్గ ఇక్కడే ఉంటే ఇంకేమైనా తెలుస్తుంది అని చేశాడా అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో దుర్గ, కార్తీక్ ఫోటోకి పూజ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావ్ దుర్గ అని మోనిత అనగా, బానే సెట్ చేసావ్ బంగారం నేను మాట్లాడినది వీడియో తీసి పోలీసులకి ఇచ్చి ఇరికించావు కానీ ఇప్పుడు నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే మొన్న రౌడీలు పంపించినప్పుడు కార్తీక్ సారే కాపాడారు ఇప్పుడు పోలీసులు దగ్గర నుంచి కూడా కార్తీక్ సరే కాపాడారు. 

36

అంటే నువ్వు ఏం చేసినా నీకు అడ్డు కార్తీక్ అవుతున్నారు అని దుర్గా అనగా, ముందు మీ ఇద్దరి అడ్డు తొలగించాలి రా మీ వల్ల నాకు సమస్య వస్తుంది అని మోనిత అంటుంది. దానికి దుర్గ, అయినా మనం క్లోజ్ గా ఉన్నప్పుడు కార్తీక్ సార్ నన్ను పోలీసులకి ఎందుకు పట్టించలేదు. అంటే నీ మీద అనుమానం ఉన్నది సార్ కి మనిద్దరం చెక్కేస్తే హాయిగా దీపతో ఉంటారు. అసలమీ ఈ మధ్య దీపమ్మ ఇంటికి వచ్చి ఇల్లు శుభ్రం చేస్తున్నారు, వంటలు వండుతున్నారు, కబుర్లు చెబుతున్నారు ఒకవేళ పొరపాటున గతం గుర్తు వచ్చిందా నీ పని ఫినిష్ అని అంటాడు. అప్పుడు మోనిత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.ఆ తర్వాత సీన్ లో దీప వాళ్ళ అన్నయ్య తో జరిగిన విషయం అంతా చెప్పి, డాక్టర్ బాబు ఈ మధ్య చాలా బాగా మాట్లాడుతున్నారు. పోలీసుల దగ్గర నుంచి కూడా దుర్గ నీ కాపాడారు కానీ డాక్టర్ బాబు దుర్గని ఎందుకు కాపాడారు నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. దానికి దీప వాళ్ళ అన్నయ్య, ఒకవేళ దుర్గని అరెస్టు చేస్తే తర్వాత మోనిత హస్తము ఉంటుందని తెలిస్తే మోనిత పరువు పోతుంది కదా అందుకనేమో. లేకపోతే నిన్ను కాపాడ్డానికి కార్తీక్ ఎప్పుడు ఉంటారు అని మోనిత కి చెప్పడానికి చేసారేమో అని అంటాడు.

46

ఆ తర్వాత సీన్లో మోనిత బోటిక్ లో ఒక అమ్మాయి ఇల్లు తుడుస్తూ ఉండగా సోఫా కింద టాబ్లెట్లు కనిపిస్తాయి అవి మోనితకు చూపించగా మోనిత ఆశ్చర్యపోయి, కార్తిక్ ఇవన్నీ వేసుకోవడం లేదు అంటే కార్తీక్ కి గతం గుర్తొస్తుందా లేకపోతే ఈ టాబ్లెట్లు దేని గురించి అని నిజం తెలిసిందా! అసలు ఏం జరుగుతుంది.కార్తీక్ ప్రవర్తనను అర్థం చేసుకోవాలి దుర్గ గాడు వచ్చిన తర్వాత ఇదంతా జరుగుతుంది. అసలు కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు వంటలక్క దగ్గరికి వెళ్ళుంటాడని కోపంతో దీప దగ్గరికి వెళుతుంది మోనిత. ఆ తర్వాత సీన్ లో కార్తీక్ రోడ్డు మీద కారు బయట నించొని, సౌర్య ఎక్కడున్నావు నీకోసం వెతికి వెతికి అలసిపోయాను నువ్వు మా కోసం ఇక్కడ ఉన్నావు. నువ్వు నాకు కనిపించినప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో నేనున్నాను ఇప్పుడు గుర్తుపట్టినా నువ్వు కనబడే స్థితిలో లేవు అని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు శౌర్య, వాళ్ళ బాబాయ్ తో అటువైపు రోడ్ లోనే నడుస్తూ బాబాయ్ పిన్ని ఎప్పుడు వస్తారు అని అడగగా, రెండు రోజుల్లో మనం ఎక్కడికి వెళ్తున్నాము అని వాళ్ళ బాబాయ్ అంటాడు.

56

ఇంక చీకటి అవుతుంది అమ్మ ఇంటికి వెళ్దామా అని వాళ్ళ బాబాయ్ అనగా, బాబాయ్ మోనిత ఇంటికి వెళ్దాము. కిందటిసారి మోనిత ని రాయితో కొట్టాను కానీ అది ఆంటీకి తలగాలకుండా ఇంకా ఎవరికో తగిలినట్టు ఉంది. ఈసారి మోనిత ఆంటీ దగ్గరికి వెళ్లి రాయితో కొట్టిన పగ తీర్చుకొని వెళ్దాము అని అనగా వాళ్ళ బాబాయ్ నవ్వుతాడు. అలా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ కార్తీక్ ఉన్న సందు పక్క నుంచి వెళ్తారు. కానీ కార్తీక్ అటు వైపు చూడకుండా ఇంకో వైపు చూస్తూ సౌర్య గురించి ఆలోచనలో పడతాడు. సౌర్య కూడా కార్తీక్ నీ  చూడదు.కార్తీక్ ని దాటిన తర్వాత శౌర్య నవ్వులు కార్తీక్ వింటూ ఇది శౌర్య గొంతు ఎక్కడున్నావ్ శౌర్య అని మొత్తం వెతికేసరికి అక్కడ శౌర్య అనిపించదు. ఆ తర్వాత సీన్లో మోనిత దీప దగ్గరకు వచ్చి వంటలక్క తో, కార్తీక్ ఎక్కడా అని అనగా, ఇంట్లో లేరంటే కచ్చితంగా ఇక్కడికే వచ్చుంటారు అని నీకు ఎందుకు అనిపించింది అంటే నా మీద నమ్మకం వచ్చినట్టే కదా అని అనగా మోనిత కోప్పడి అయినా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నా కార్తీక్ నీ ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు అని అనగా డాక్టర్ బాబుని దక్కించుకొని నువ్వు ఏం చేసావు అయినా డాక్టర్ బాబు నీకు దక్కారాన్ని నువ్వు ఎలాగ అనుకుంటున్నావు?

66

గతం మర్చిపోయి ఏమి చేయలేని పరిస్థితుల్లో తీసుకువచ్చేసావు అయినా డాక్టర్ బాబుని నీ దగ్గర ఉంచుకొని జీవితంలో ఏదైనా ఉపయోగపడే పని చేసేవా? నువ్వు డాక్టర్ చదువు చదివి జైల్లో కూర్చున్నావు ఇంటర్వ్యూ ఇచ్చి నీ పరువు నువ్వే తీసుకున్నావు. నీకు నిజంగా దమ్ముంటే డాక్టర్ బాబు నీ వాడు అనుకుంటే హైదరాబాద్ వెళ్లి మా అత్తయ్య ముందు నించుకొని కార్తీక్ ని దక్కించుకున్నాను అని చెప్పు అని అనగా మోనిత,  చేస్తానే అది కూడా చేస్తాను ముందు నువ్వు కార్తీక్ భార్యవి అన్న హోదాని పోగొట్టి అప్పుడు వస్తాను అని అంటుంది.దానికి దీప,  డాక్టర్ బాబు విన్నారు కదా  మోనిత నోటి తోనే చెప్పించాను నేనే మీ భార్యని అని, ఇంట్లో కార్తీక్ ఉన్నట్టు మోనిత ని నమ్మించి గట్టిగా అరుస్తుంది.దానికి మోనిత, నువ్వు విన్నది ఏది నిజం కాదు. ఈ వంటలక్క నన్ను మోసం చేయాలనుకుంటుంది. నేనే నీ భార్యని అని మోనిత భయపడుతూ అరుస్తుంది. దానికి దీప నవ్వుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories