Sardar Twitter Review : ‘సర్దార్’ మూవీ ట్విట్టర్ టాక్.. డ్యూయల్ రోల్ లో కార్తీ మెప్పించాడా?

First Published Oct 21, 2022, 9:01 AM IST

విభిన్న కథలతో తమిళ హీరో కార్తీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈరోజు కార్తీ నటించిన ‘సర్దార్’ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఆడియెన్స్ సినిమాపై తమ అభిమాప్రాయాలను పంచుకుంటున్నారు.

తమిళ స్టార్, టాలెంటెడ్ హీరో కార్తీ (Karthi) వరుస చిత్రాలతో ఆడియెన్స్ ను అలరిస్తూనే  ఉన్నారు. తమళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్ బేస్ దక్కించుకున్న హీరో ఆయన. అభిమానులను మరింతగా మెప్పించేందుకు విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘సర్దార్’ (Sardar) చిత్రంతో అలరించబోతున్నారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు  పడగా ఆడియెన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 
 

హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్లుగా రజీషా విజయం, రాశీ ఖన్నా (Raashi Khanna) ఆడిపాడారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత లక్ష్మణ్ కుమార్ భారీ వ్యయంతో నిర్మించారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కాగా.. తాజాగా ప్రీమియర్ షో ద్వారా కూడా ఆడియెన్స్  నుంచి మంచి స్పందనే లభిస్తోంది. ఇంతకీ ఆడియెన్స్ సినిమా గురించి  ఏమంటున్నారో తెలుసుకుందాం.
 

Latest Videos


ఈచిత్రంపై పాజిటివ్ రెస్పాన్సే వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని తెలుపుతున్నారు. ఊహించని ట్విస్ట్ లతో మొదటి భాగంగా ఆసక్తికరంగా సాగిందంటున్నారు. పాపులారిటీని ఇష్టపడే కార్తీ ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాష్ పాత్ర ఆకట్టుకుంటుందని అంటున్నారు. మొదటి భాగంలో కార్తీ పోలీస్ ఆఫీసర్ గానే అలరిస్తాడంట. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉందని చెబుతున్నారు. మూవీలోని ట్విస్టులు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.

పోలీస్ ఆఫీసర్ విజయ్ ప్రకాష్ షాలిని అనే అడ్వకేట్ తో లవ్ ట్రాక్ సన్నివేశాలు బాగున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో విజయ్ ప్రకాష్‌కు సైనిక రహస్యాల యొక్క ముఖ్యమైన సమాచారాన్ని ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన ఫైల్ రూపంలో తిరిగి పొందే పని అసైన్ చేస్తారంట. ఈ క్రమంలోనే విజయ్ ప్రకాష్ తన వేషధారణలో ఉన్న మాజీ గూఢచారి చంద్రబోస్ AKA సర్దార్‌ని ఎదుర్కొంటాడని చెబుతున్నారు. ఫైలు, సర్దార్, సర్దార్ లాగా కనిపించే విజయ్ ప్రకాష్ మధ్య ఉన్న లింక్ సినిమాకి కీలకంగా ఉంటుందని అంటున్నారు. 
 

కార్తీ ద్విపాత్రాభినయం ఆకట్టుకోగా.. హీరోయిన్లు రాశీ ఖన్నా.. రజీషా పెర్షామెన్స్ కూడా అదిరిపోయిందంటున్నారు. లైలా ముఖ్య పాత్రలో నటించడం సినిమాకు ప్లస్ అయ్యిందని తెలుపుతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సినిమా స్కోర్, ట్యూన్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ఇక సినిమాలోని యాక్షన్ సీన్స్, సస్పెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. బిగ్ స్క్రీన్ పై కార్తీ పెర్ఫామెన్ష్ అదిరిందంటూ.. ఈ మూవీ మరో మైల్ స్టోన్ అవుతుందని భావిస్తున్నారు.
 

చిత్రానికి జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.  పొన్ పార్తిబన్, రోజు, బిన్పు రాగు, జీవీ ఈ చిత్రానికి డైలాగ్స్ రాశారు. రూబెన్ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేశారు. రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని పంపిణీ చేసింది. తెలుగులో చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో ఆధ్వర్యంలో అక్కినేని నాగార్జున విడుదల చేస్తున్నారు. ఈరోజు తెలుగు, తమిళంలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

click me!