మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? అన్ని కోట్లు తీసుకుంటున్నాడా..?

First Published | Sep 12, 2024, 4:59 PM IST

బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీకి అంతా సిద్ధం అయ్యింది.  ఆయన బర్త్ డే సందర్భంగా అదిరిపోయే న్యూ లుక్ కూడా వచ్చింది. అయితే మోక్షజ్ఞ  తన ఫస్ట్ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటన్నాడో తెలుసా..? 

Mokshagna Teja son of nandamuri balakrishna to debut as an actor in telugu cinema

తెలుగు రాష్ట్రాల్లో నందమూరి హీరోలకు ఉన్న స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీనియన్ ఎన్టీఆర్, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ వరకూ ప్రేక్షకులు, అభిమానులు వారిని ఎంతలా ఆదరించారో కూడా తెలుసు. నందమూరి ఫ్యామిలీకి  తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

ఈ ఫ్యామిలీ హీరోలంటే  పడిచచ్చిపోతుంటారు ఫ్యాన్స్. అయితే బాలయ్య, ఎన్టీఆర్ సరే.. మరి బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ పైనే చాలా ఉత్కంఠ కొనసాగింది. మోక్షూ ఎంట్రీపై ఫ్యాన్స్ వెయ్యికళ్ళతో ఎదురుచూశారు. ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేశారు ఫ్యాన్స్. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Mokshagna

ఇక ఎట్టకేలకు బాలయ్య ఫ్యాన్స్ ఆశలు తీరబోతున్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్దం అయ్యింది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో  హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మోక్షజ్ఞ. తాజాగా ఆయన బర్త్ డే సంరద్భంగా ఫస్ట్  లుక్ తో సందడి చేశారు. హీరోగా ఎంట్రీ ఇస్తున్న సందర్భంలో అద్భుతంగా మోకోవర్ అయ్యాడు మోక్షు. 

ఇక నందమూరి మోక్షజ్ఞ – ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను ఎస్‌ఎల్వీ సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై బాలయ్య చిన్న కూతురు  నందమూరి తేజస్విని సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం కాబోతోంది. 

అమరావతి లో ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్, చంద్రబాబు, పవన్ చీఫ్ గెస్ట్ లు, ఫ్యాన్స్ కు పండగే..


మోక్షజ్ఞ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 6న అత‌ని ఫ‌స్ట్ లుక్ ను మూవీ టీమ్ రిలీజ్ చేయగా.. అభిమానుల నుంచే కాదు.. ఆడియన్స్ అందరినుంచి.. నెటిజన్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతే కాదు మోక్షజ్ఞ కు శుభాకాంక్షలు తెలుపుతూ.. అన్నలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా శుభాంకాంక్షలు చెప్పడం నందమూరి ప్యాన్స్ లో ఉత్తేజాన్ని అందించింది. 

అల్లు అర్జున్ పై మలయాళ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్, అలా అనేశావేం బ్రో.. ?
 

ఇక ఇది ఇలా ఉండగా..  ప్రస్తుతం మోక్షజ్ఞకు సబంధించి మరో విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ నందమూరి కుర్ర హీరో  మొద‌టి సినిమాకు ఎంతరెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.  మోక్షజ్ఞ అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంత..? 

ఇండ‌స్ట్రీ లో ఇప్పటి వరకు చాలా మంది స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చారు. స్టార్స్ గా మారారు. అయితే  హీరోల వార‌సులైనా కూడా వారు తమ డెబ్యూ మూవీకి చాలా త‌క్కువ పారితోషికం తీసుకున్నారు. కొంద‌రైతే మొదటి సినిమాకు ఎలాంటి రెమ్యున‌రేష‌న్  తీసుకోకుండా చేసినవారు ఉన్నారు. 

మరికొంత మంది మాత్రం సినిమా హిట్ అయ్యాక లాభాల్లో వాటాలు తీసుకున్నారు. కాని  మోక్ష‌జ్ఞ మాత్రం అందుకు పూర్తిగ భిన్నంగా ఆలోచించాడు. ఫ‌స్ట్ మూవీకే మోక్ష‌జ్ఞ ఏకంగా రూ. 20 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తున్నాడ‌ని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అటు  నిర్మాత సుధాకర్‌ చెరుకూరి  కూడా ఎంతైనా ఇచ్చేందుకు వెనకాడటం లేదు అంటున్నారు. 

అయితే మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది తెలియదు కాని.. నెట్టింట్లో మాత్రం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.  అయితే ఇది ఫేక్ న్యూస్ అనేవాళ్లు కూడా ఉన్నారు. మరి నిజం ఎంతో తలియదు కాని.. నందమూరి హీరో కాబట్టి.. గట్టిగానే తీసుకుటాడు అంటున్నారు. 

ఇక త్వరలో  మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్ ఉంటుందని సమాచారం. ఈ ఓపెనింగ్ కు జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తాడని ప్రచారం జరగుతోంది. మరి ఆయన నిజంగా వస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. సోషియో ఫాంటసీమూవీగా తెరకెక్కుతోన్న ఈసినిమాలో హీరోయిన్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. 

Latest Videos

click me!