మహేష్ బాబు, ఎన్టీఆర్ మంచి స్నేహితులు. వీరితోపాటు రామ్ చరణ్ కూడా మంచి స్నేహితుడే అనే విషయం తెలిసిందే. వీరంతా తరచూ కలుస్తుంటారు. పార్టీలకు, సినిమాల సెలబ్రేషన్స్ కి సంబంధించిన పార్టీల్లో హాజరవుతుంటారు. సరదాగా గడుపుతుంటారు. మహేష్ `భరత్ అనే నేను` సినిమాకి ఎన్టీఆర్ గెస్ట్ గా కూడా వచ్చారు.
మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఏకంగా మల్టీస్టారర్ `ఆర్‌ఆర్‌ఆర్` కూడా చేశారు. ఈ మూవీ ఆస్కార్‌ని సాధించింది. ఇలా ఇండస్ట్రీలో కొందరు హీరోల మధ్య మంచి స్నేహం ఉంది. అదే సమయంలో కొందరు హీరోల మధ్య గ్యాప్ కూడా ఉంది. వాళ్ల మధ్య ఆ గ్యాప్ ఉందో లేదోగానీ, ఫ్యాన్స్ మధ్య గొడవలు, సోషల్ మీడియాలో ఫైటింగ్ చూస్తుంటే మాత్రం నిజమే అనిపిస్తుంది.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్, ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
కానీ ఎన్టీఆర్, మహేష్ బాబు మధ్య ఆ బాండింగ్ ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సైతం ఒకరికొకరు సపోర్ట్ గా నిలుస్తుంటారు. ఆరోగ్యకరమైన రిలేషన్స్ ని చాటి చెబుతుంటారు. తెలుగులో మల్టీస్టారర్స్ ట్రెండ్ చాలా రోజులుగానే ప్రారంభమైంది. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంతో ఇది మరింత ఊపందుకుంది.
`గోపాల గోపాల`, `ఆర్‌ఆర్‌ఆర్`, `వాల్తేర్ వీరయ్య`, `కల్కి 2898ఏడీ` ఆ కోవలో వచ్చినవే. అయితే అన్నీ సెట్ అయితే ఇప్పటికే మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ రావాల్సింది. అది ఎవరో కాలు మహేష్ బాబు, ఎన్టీఆర్. అవును ఈ ఇద్దరు ఓపెన్‌గానే తమ మల్టీస్టారర్ ని ఓపెన్‌గా ప్రకటించారు. మరి ఆ కథేంటో చూస్తే.
ఎన్టీఆర్ హోస్ట్ గా `మీలో ఎవరు కోటీశ్వరులు` అనే షో నడిచింది. మూడేళ్ల క్రితం ఈ షో రన్ అయ్యింది. ఇందులో చివరగా మహేష్ బాబు గెస్ట్ గా వచ్చారు. షో ముగింపు కోసం ఆయన్ని ఆహ్వానించారు టీమ్. మహేష్ రాకతో షోకి హైప్ పెరిగిపోయింది.
ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే చోట కనిపిస్తే ఫ్యాన్స్ కి కనువిందు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి సందర్భం ఆ సమయంలో కలిగింది. అయితే ఇందులో భాగంగా చివర్లో ఆసక్తికర చర్చ నడిచింది. ఇద్దరి మధ్య క్రేజీ డిస్కషన్ జరిగింది.
mahesh ntr
అదే మల్టీస్టారర్ మ్యాటర్. మహేష్‌ని ఎన్టీఆర్ అన్నా అని పిలుస్తాడు. ఈ సందర్భంగా షో చివరి ప్రశ్న వద్ద `అన్నా మీకు ఎప్పుడూ మనం మల్టీస్టారర్ చేస్తే బాగుండూ అనిపించలేదా?` అని ప్రశ్నించాడు తారక్. దీనికి మహేష్ రియాక్ట్ అవుతూ, `మనం ఎప్పుడు కలిసి నువ్వు అంటుండే వాడివి.
చేస్తే బాగుంటుందని, అది చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించేది కానీ, నువ్వు చరణ్ (ఆర్‌ఆర్‌ఆర్) చేసేశారు` అని మహేష్ చెప్పడంతో జక్కన్న అడ్వాన్స్ అయిపోయాడని తారక్ చెప్పాడు. ఇప్పుడున్న హీరోలంతా ఫ్రెండ్లీ. ఇది ఎగ్జైటింగ్ టైమ్, మున్ముందు తెలుగు ఆడియెన్స్ మరిన్నీ మల్టీస్టారర్స్ చూస్తారనుకుంటున్నా. బయట మనందరం బాగుంటాం.
ఇది హెల్తీ ఆట్మాస్పియర్. మున్ముందు తెలుగులో మంచి ఎగ్జైటింగ్ సినిమాలు వస్తాయని భావిస్తున్నా అని మహేష్ చెప్పగా, డైరెక్టర్స్ విన్నారు. వాళ్లు రెడీ అయిపోతారు అని తారక్ చెప్పడం విశేషం.
Junior NTR Devara upcoming film update out
అయితే ఇది జరిగి మూడేళ్లు అవుతుంది. కానీ ఇప్పటి వరకు వీరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. ఇద్దరు సూపర్ స్టార్లు ఓపెన్‌గా ఆఫర్ ఇచ్చినా చేసేందుకు మేకర్స్ ముందుకు రాకపోవడం గమనార్హం. ఓ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నట్టే అని చెప్పొచ్చు.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ `దేవర` సినిమాతో రాబోతున్నాడు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
మరోవైపు మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. వీరిద్దరి కాంబోలో వస్తున్న మొదటి మూవీ కావడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు రాజమౌళి.
త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది. ఇంటర్నేషనల్ మూవీగా దీన్ని తెరకెక్కించబోతున్నారు జక్కన్న. ఈ సినిమా కోసమే మహేష్ రెండు, మూడేళ్లు లాక్ కాబోతున్నారు.