మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ప్రకటన, బాలయ్య వారసుడి కటౌట్‌ మామూలు లేదుగా, ఎన్టీఆర్‌ రియాక్షన్‌ ఇదే

First Published | Sep 6, 2024, 12:47 PM IST

నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరపడింది. ఆ అద్భుతమైన ఘట్టం రానే వచ్చింది. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ  హీరోగా ఎంట్రీ సినిమా ప్రకటన వచ్చేసింది. మోక్షజ్ఞ కటౌట్‌ ఎలా ఉందంటే..

నందమూరి బాలకృష్ణ వారసుడి ఎంట్రీకి సంబంధించిన చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడూ అని అంతా ఎదురు చూస్తున్నారు. నిజానికి గత నాలుగైదు ఏళ్లుగా ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఓ మిస్టరీగానే మారిపోయింది.

ఈ నేపథ్యంలో అభిమానులకు నిరీక్షణకి తెరపడింది. ప్రకటన రానే వచ్చింది. మోక్షజ్ఞ బర్త్ డేని పురస్కరించుకుని నేడు శుక్రవారం ఆయన సినిమాని ప్రకటించారు. ముందు నుంచి అనుకుంటున్నట్టగానే ప్రశాంత్‌ వర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 

ఆయన ఇప్పటికే హనుమాన్‌ సినిమాతో సంచలనాలు క్రియేట్‌ చేశారు. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్ ని క్రియేట్‌ చేసి వరుసగా సినిమాలు చేయబోతున్నారు. ఇప్పటికే `జై హనుమాన్‌` సినిమాని ప్రకటించారు. దీంతోపాటు ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాని కూడా ప్రకటించడం విశేషం.

ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్ లోనే ఈ మూవీ రాబోతుంది. దీనికి సంబంధించిన ప్రకటనతోపాటు మోక్షజ్ఞ ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. ఒకప్పుడు బొద్దుగా, లావుగా ఉన్న మోక్షజ్ఞ ఇందులో చాలా స్లిమ్ గా కనిపిస్తున్నాడు. కంప్లీట్‌గా మారిపోయాడు. గుర్తు పట్టలేనంతగా ఆయన మారిపోవడం విశేషం. 
 


Mokshagna

ఈ సినిమాతో మోక్షజ్ఞ అక్క, బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మారడం విశేషం. లెజెండ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై ఆమె ఈ మూవీకి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. మైథలాజికల్‌ ఫిల్మ్ గా దీన్ని రూపొందించబోతున్నారు.

సోషియో ఫాంటసీగా తీర్చిదిద్దబోతున్నారు ప్రశాంత్‌ వర్మ. పురణాలను, నేటి సమాజాన్ని మిక్స్ చేస్తూ తెరకెక్కించబోతున్నారట. ఇదిలా ఉంటే ఈ మూవీకి `సింబా` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. గురువారం ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌యూనివర్స్ నుంచి ఓ పోస్టర్‌ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో `సింబా` అని ఉంది. అదే మోక్షజ్ఞ కోసమే తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 
 

మోక్షజ్ఞ ఇప్పటికే యాక్టింగ్‌లో ట్రైనింగ్‌ అయ్యారు. విదేశాల్లో ట్రైన్‌ కావడంతోపాటు సత్యానంద్‌ వద్ద కూడా శిక్షణ తీసుకున్నారు. అంతేకాదు బాగా బరువు కూడా తగ్గాడు. చాలా స్లిమ్‌ అయ్యాడు. ఫిట్‌గా కనిపిస్తున్నాడు. చూడ్డానికి రొమాంటిక్‌ బాయ్‌లా ఉండటం విశేషం. లుక్‌ వైజ్‌గా హీరో కటౌట్ కనిపిస్తుంది. మరి సినిమాల్లో మెప్పిస్తాడో చూడాలి.

అయితే నందమూరి ఫ్యామిలీలో నటనకు పెట్టింది పేరు. ఎవరైనా ఇట్టే నటించేస్తారు. మోక్షజ్ఞ ఎలా చేయబోతాడనేది ఇప్పుడు అందరిలోనూ క్యూరియాసిటీ. ఎలా ఉంటాడనది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది. షూటింగ్‌ ఎప్పుడు అనే అంశాలు ప్రస్తుతానికి సస్పెన్స్. 
 

తమ్ముడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ సందర్భంగా అన్న ఎన్టీఆర్‌ స్పందించారు. విషెస్‌ తెలిపారు. ఈ సినిమా ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నందుకు అభినందనలు. నీ జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభంచేటప్పుడు తాతగారితోపాటు అన్ని దైవిక శక్తులు నీప ఆశీర్వాదాలున కురిపించాలని కోరుకున్నారు తారక్‌.

అలాగే మరో అన్న కళ్యాణ్‌ రామ్‌ కూడా స్పందించి విషెస్‌ తెలిపారు. తాతగారి ప్రతిష్ట నిలెబ్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా` అని కళ్యాణ్‌ రామ్‌ విషెస్‌ చెప్పారు. వారితోపాటు నందమూరి హీరోలు, ఇతర సినిమా సెలబ్రిటీలు ఆయనకు విషెస్‌ తెలియజేస్తున్నారు. 

Latest Videos

click me!