కూతురు క్లీంకారకి రామ్‌ చరణ్‌ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ? అస్సలు ఊహించరు?

First Published | Sep 6, 2024, 11:01 AM IST

తన ముద్దుల తనయ క్లీంకారకి ఆమె పుట్టిన రోజున మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా? అది నిజంగా సర్‌ ప్రైజింగ్‌ మ్యాటరే. 
 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులకు గతేడాది కూతురు పుట్టిన విషయం తెలిసిందే. ఆమెకి క్లీన్‌ కార(క్లీంకార) అనే పేరు పెట్టారు. పెళ్లై దాదాపు 11ఏళ్ల తర్వాత వీరికి కూతురు జన్మించడం విశేషం. క్లీంకార జననాన్ని ఓ సెలబ్రేషన్‌లా జరుపుకుంది మెగా ఫ్యామిలీ. ఉపాసన ప్రెగ్నెంట్‌ అవడం నుంచే ఇది పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది.

ఆమె ఎక్కడ కనిపించినా ప్రత్యేకంగా నిలవడం విశేషం. మీడియా స్పెషల్‌గా ఫోకస్‌ చేసింది. దీంతో ఇది బాగా హైలైట్‌ అయ్యింది. ఇక పుట్టినప్పుడు, హాస్పిటల్‌ నుంచి ఇంటికి వెళ్లడం, బయట ఎక్కడైనాకనిపించడం ఇలా ప్రతిదీ స్పెషల్‌గానే మారిపోయింది.  
 

Ram Charan

అంతేకాదు మెగాస్టార్‌ తన మనవరాలికి నామకరణం కూడా ఓ సెలబ్రేషన్‌లా చేయడం విశేషం. ఆమెకి క్లీంకార అనే పేరుని నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే చిన్నారి రాకతో మెగా ఫ్యామిలీకి కలిసి వచ్చిందని, ఉపాసన ప్రెగ్నెంట్‌ అవడం నుంచే తమ ఫ్యామిలీలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చిరు పలు సందర్భాల్లో తెలిపారు.

మెగాస్టార్‌ కి పద్మ విభూషణ్‌ పురస్కారం రావడం, అలాగే బన్నీకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రావడం, మరోవైపు రామ్‌ చరణ్‌ నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్‌ రావడం, మరోవైపు ఏపీలో పవన్‌ కళ్యాణ్‌ భారీ మెజార్టీతో గెలవడం, డిప్యూటీ సీఎం కావడం ఇవన్నీ మెగా ఫ్యామిలీకి కలిసి వచ్చిన అంశాలు. 
 


ఇదిలా ఉంటే క్లీంకారకి సెలబ్రిటీలు గిఫ్ట్ లు ఇచ్చారు. ప్రభాస్, అల్లు అర్జున్‌లు సైతం ఆ చిన్నారికి గిఫ్ట్ లు పంపించారు. ప్రభాస్‌ నటించిన `కల్కి 2898ఏడీ` సినిమా సమయంలో క్లీంకార పుట్టిన రోజు కావడంతో కల్కి బుజ్జి బొమ్మ, స్టిక్కర్స్ , టీ షర్ట్ పంపినట్టు తెలిసింది.

అల్లు అర్జున్‌  ఓ నేమ్ ప్లేట్ ని గిఫ్ట్ గా ఇచ్చారట. ఆ నేమ్ ప్లేట్ లోని అక్షరాలని బన్నీ గోల్డ్ తో చేయించాడట. అంతే కాదు నేమ్ ప్లేట్ చుట్టూ డైమండ్స్ కూడా డిజైన్ చేశారని టాక్‌. 

ఇతర ప్రముఖులు భారీ గిఫ్ట్ లు ఇస్తుంటే మరి తన కూతురుకి రామ్‌ చరణ్‌ ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా? అది ఊహించని బహుమతి కావడం విశేషం. బుజ్జి బాద్‌షాని గిఫ్ట్ గా ఇచ్చాడట. అది చిన్న గుర్రం. రామ్‌ చరణ్‌కి గుర్రాలంటే ఇష్టం. తన ఫామ్‌ హౌజ్‌లో 15గుర్రాలున్నాయి. `మగధీర` సినిమాలో బాద్‌ షా అనే గుర్రాన్ని వాడారు. దాన్ని ఫారెన్‌ నుంచి తెప్పించారు.

సినిమా అయిపోయాక ఆ గుర్రాన్ని రామ్‌ చరణ్‌ తీసుకున్నారట. దాన్ని పెంచుకున్నారు. అయితే ఇటీవలే అది బిడ్డని కన్నదని, చిన్న బాద్‌ షా వచ్చిందని తెలిపారు రామ్‌ చరణ్‌. ఈ బుజ్జి బాద్‌ షాని తన కూతురు క్లీంకారకి గిఫ్ట్ గా ఇచ్చినట్టు చెప్పారు రామ్‌ చరణ్‌. 

రామ్‌ చరణ్‌ హీరో బైక్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించారు. కొత్త హీరో బైక్‌ లాంచింగ్‌ కార్యక్రమంలో చరణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. హార్స్ అంటే తనకు చాలా ఇష్టమని, తన మనసుకి దగ్గరైనవి అని వెల్లడించారు చరణ్‌.

ప్రస్తుతం ఆయన `గేమ్‌ ఛేంజర్‌` సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్‌, ఎస్‌ జే సూర్య, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు టైటిల్‌ గ్లింప్స్, ఒక పాట మాత్రమే వచ్చింది. అప్‌ డేట్ కోసం ఫ్యాన్స్ గోల చేశారు. దర్శకుడు, నిర్మాతలను ట్రోల్‌ చేశారు. వినాయకచవికి టీజర్‌ని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి టీమ్‌ స్పందించి టీజర్‌ ఇస్తుందా అనేది చూడాలి. 

బిగ్‌ బాస్‌ పోల్స్:ఈ వారం బిగ్ బాస్ హౌౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

Latest Videos

click me!