మహేష్ బాబే అనుకుంటే ఈ స్టార్ హీరో కూడా అన్యాయం చేశాడు.. క్రేజీ హీరోయిన్ కి షాక్

First Published | Sep 6, 2024, 11:57 AM IST

హీరోయిన్లకు కెరీర్ ని మలుపు తిప్పే పాత్రలు దొరకడం అంత సులభం కాదు. వచ్చిన పాత్రలనే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అవి వర్కౌట్ అయితే ఒకే.. లేకుంటే హీరోయిన్ల కష్టాలు తప్పవు. 

హీరోయిన్లకు కెరీర్ ని మలుపు తిప్పే పాత్రలు దొరకడం అంత సులభం కాదు. వచ్చిన పాత్రలనే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అవి వర్కౌట్ అయితే ఒకే.. లేకుంటే హీరోయిన్ల కష్టాలు తప్పవు. అందం అభినయం ఉన్నప్పటికీ మంచి పాత్రలు దక్కకుంటే నటీమణులు స్టార్ హీరోయిన్లు కావడం కష్టం. ఇప్పడూ మీనాక్షి చౌదరి విషయంలో కూడా అదే జరుగుతోంది. 

యాక్టింగ్ విషయంలో మీనాక్షి చౌదరి పర్వాలేదు. గ్లామర్ అయితే ఆమెకి తిరుగులేదు. కానీ మీనాక్షి చౌదరికి స్టార్ హీరోల చిత్రాల్లో అన్యాయం తప్పడం లేదు. మీనాక్షికి గుంటూరు కారం చిత్రంలో ఛాన్స్ వచ్చినప్పుడు ఆమె కెరీర్ మలుపు తిరిగిపోయినట్లే అని అంతా అనుకున్నారు. 

Also Read : త్రిష వల్ల నా జీవితం నాశనం, బతిమాలినా వినలేదు..తెరవెనుక ఆమె ఎలా ప్రవర్తిస్తుందంటే..


కానీ సినిమాలో ఊహించని షాక్ తప్పలేదు. మొత్తం శ్రీలీల డామినేషన్ కనిపించింది.  మీనాక్షి చౌదరి ఒక సైడ్ క్యారెక్టర్ లాగా వాడుకున్నారు. మహేష్ బాబు పిలిస్తే వెళ్లి ముందు నిల్చోవడానికి.. జయరాంకి మందు పోయడానికి మాత్రమే ఆమె పాత్ర పరిమితం అయింది. 

కనీసం మీనాక్షి చౌదరికి ఒక్క సాంగ్ కూడా లేదు. అలాంటి రోల్ కి మీనాక్షి ఎందుకు అంగీకరించింది అని అంతా షాక్ అయ్యారు. రీసెంట్ అదే తరహాలో మీనాక్షి చౌదరి మరోసారి అన్యాయానికి గురైంది. తమిళ టాప్ హీరో దళపతి విజయ్ సరసన ది గోట్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీలో విజయ్ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటించారు. సీనియర్ విజయ్ సరసన స్నేహ నటించింది. 

యంగ్ విజయ్ సరసన మీనాక్షి నటించింది. దీనితో మీనాక్షి ఎదురుచూస్తున్న అద్భుత అవకాశం ఇదే అని అంతా భావించారు. కానీ సినిమాలో నిరాశ తప్పలేదు. ఒక్క పాట ఉంది కానీ అది ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఆమె పాత్ర కూడా గొప్పగా ఏమిలేదు. ఇంకా చెప్పాలంటే బాగా డిసప్పాయింట్ చేసే విధంగా మీనాక్షి పాత్ర ఉంటుంది. 

ఊహించని విధంగా మీనాక్షి చౌదరికి మహేష్ బాబు, విజయ్ లాంటి అగ్ర హీరోలు షాకిస్తున్నారు. కుర్ర హీరోలతో మాత్రం మీనాక్షికి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఆ మధ్యన హిట్ 2లో మీనాక్షి చౌదరి అడివి శేష్ కి జోడీగా నటించింది. ఇప్పుడు వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ చిత్రాల్లో నటిస్తోంది. 

Latest Videos

click me!