ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ను నెటిజన్లు దారుణంగా తిట్టిపోస్తున్నారు. దానికి కారణం ఆమె తీసిన లాపతా లేడీస్ సినిమా కాపీ వివాదంలో చిక్కుకుంది. బుర్ఖా సిటీ కథను ఆమె కాపీ కొట్టారని నెటిజన్లు అంటున్నారు. దీనిపై బాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఆరోపణలు సినిమా సక్సెస్ పై ప్రభావం చూపించాయి.
లాపతా లేడీస్, బుర్ఖా సిటీ సినిమాల్లో చాలా పోలికలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రెండు సినిమాలు ముసుగులో ఉన్న ఆడవాళ్ల చుట్టూ తిరుగుతాయి. లాపతా లేడీస్ బుర్ఖాల బదులు పెళ్లి ముసుగులు వాడింది. రెండు సినిమాల సీన్లు కలిపి చూపిస్తూ కిరణ్ రావుని విమర్శిస్తున్నారు.
కిరణ్ రావు అరబిక్ సినిమాను కాపీ కొట్టిందని చాలామంది తిడుతున్నారు. లాపతా లేడీస్ ఆస్కార్‌కు వెళ్లడం కూడా తప్పే అంటున్నారు. కొందరు మాత్రం రీమేక్‌లు కామన్ అని, అందులో ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు.
లాపతా లేడీస్ మంచి సినిమా అని అందరూ అంటున్నా, కాపీ ఆరోపణలు సినిమాపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇంత జరుగుతున్న ఇంత వరకూ ఈ విషయంలో కిరణ్ రావు మాత్రం ఇంకా మాట్లాడలేదు. దీంతో అభిమానులు, విమర్శకులు తప్పు ఎవరిదో అని ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం ఆగడంలేదు. మరి ఆమె ఎప్పుడు స్పందిస్తారు, ఎలా స్పందిస్తారో చూడాలి.