రామ్‌ సినిమాతో మోహన్‌ లాల్‌ టాలీవుడ్‌ రీఎంట్రీ, క్లారిటీ ఇదే.. `లూసిఫర్‌ 3` ఎప్పుడంటే?

Mohanlal: మోహన్‌లాల్‌ తెలుగులోకి రీఎంట్రీపై స్పందించారు. రామ్‌ సినిమాలో నటించడంపై క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో `లూసిఫర్‌ 3`పై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. 
 

Mohanlal react on re entry into telugu with ram pothineni movie also clarity on lucifer 3 in telugu arj
mohanlal

Mohanlal: కంప్లీట్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌. ఆయన అడపాదడపా తన సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. `మన్యంపులి`, `జనతా గ్యారేజ్‌` సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. కానీ మళ్లీ చాలా గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఆయన టాలీవుడ్‌ రీఎంట్రీ ఇవ్వబోతున్నారట.

రామ్‌ సినిమాలో ఆయన నటించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై మోహన్‌ లాల్‌ స్పందించారు. ఇంకా ఫైనల్‌ కాలేదని, చర్చల దశలో ఉన్నట్టు తెలిపారు. మహేష్‌ బాబు ఈ మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. 

Mohanlal react on re entry into telugu with ram pothineni movie also clarity on lucifer 3 in telugu arj
mohanlal

ఇక `లూసీఫర్‌ 2`( L2E: ఎంపురాన్) సినిమాతో మరోసారి ఆయన తెలుగు ఆడియెన్స్ ని అలరించడానికి రాబోతున్నారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఈ నెల 27న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌, అండ్‌ వాళ్ల టీమ్‌ హైదరాబాద్‌లో సందడి చేసింది.

ఈ మూవీని తెలుగులో దిల్‌ రాజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా శనివారం టీమ్‌ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. ఇందులో తెలుగులో రీఎంట్రీపై మోహన్‌లాల్‌ స్పందించారు. `జనతా గ్యారేజ్‌` తర్వాత సరైన స్క్రిప్ట్ రాలేదని, మంచి కథలు వస్తే తెలుగులో నటించేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపారు. 
 


lucifer 2

అదే సమయంలో `లూసిఫర్‌` మూడు పార్ట్ ల గురించి మాట్లాడుతూ, ముందుగా `లూసిఫర్‌`ను మూడు పార్టులుగా తీయాలని అనుకున్నాం. `ఎంపురాన్` బ్లాక్ బస్టర్ అయితే.. మూడో పార్ట్‌తో మళ్లీ వస్తాం. రెండేళ్లుగా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాం. సుజిత్ కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. పాలిటిక్స్, యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని రకాల అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి.

అందరినీ అలరించేలా మా సినిమా ఉంటుందన్నారు. ఇంకా ఆయన చెబుతూ, 47 ఏళ్లుగా ఈ సినీ ఇండస్ట్రీలో నా ప్రయాణంలో తెలుగు చిత్ర సీమతో ఎంతో అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించే అదృష్టం నాకు కలిగింది. తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమ ఇంకెక్కడా దొరకదు. ఇండియాలోనే టాలీవుడ్ ది బెస్ట్ ఇండస్ట్రీగా ఉంది` అని చెప్పారు.  
 

prithviraj Sukumaran

పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ, `తెలుగులో మా సినిమాను రిలీజ్ చేస్తున్నదిల్‌ రాజుకి థాంక్స్. ఇలాంటి సినిమాను మేం ఎప్పుడూ ట్రై చేయలేదు. ఒరిజినల్ వర్షెన్‌లానే తెలుగు వర్షెన్ ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కోసం చాలా కష్టపడ్డాం. చాలా అథాంటిక్‌గా ఉండాలని ప్రయత్నించాం. తెలుగు ప్రేక్షకులు తెలుగు వర్షెన్‌లో చూస్తే.. ఒరిజినల్ సినిమానే అనుకుంటారు.

`లూసిఫర్` సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేయలేదు. కానీ అన్ని భాషల్లోకి ఆ చిత్రం రీచ్ అయింది. అందుకే ఇప్పుడు ఈ రెండో పార్ట్‌ను ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే అన్నీ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. . ఈ రేంజ్ ట్రెండ్ చూసి మేమంతా సర్ ప్రైజ్ అవుతున్నాం. 

నా దృష్టిలో మంచి సినిమా చెడ్డ సినిమా అనేది మాత్రమే ఉంటుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. నేను మంచి సినిమాను తీశానని నమ్ముతున్నాను. కాకపోతే ఆ సినిమాను హై బడ్జెట్‌లో తీశాను. ఈ మూవీని చూసిన తరువాత ఏ ఒక్కరూ కూడా ఎంత బడ్జెట్ అయి ఉంటుందో అస్సలు అంచనా వేయలేరు. అలా ఎంత అంచనా వేసినా సరే దానికంటే ఎక్కువగానే ఉంటుంది.

మోహన్‌లాల్  ఇచ్చిన సపోర్ట్, ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్ వల్లే ఈ మూవీని ఇంత గ్రాండియర్‌గా, ఇంత హై బడ్జెట్‌‌లో తీయగలిగాం. ఈ క్రెడిట్ అంతా ఆయనదే.ఈ మూవీ కోసం మోహన్‌లాల్ గారు, నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేశాం. మార్చి 27న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. మూడో పార్ట్ చేసేలా సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
 

dil raju

దిల్ రాజు మాట్లాడుతూ .. ‘లూసిఫర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మాలీవుడ్‌లో అత్యధిక బడ్జెట్‌తో తీసిన ఈ సీక్వెల్ ఏ రేంజ్‌లో ఉందో టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ట్రైలర్ అలా చూస్తూనే ఉండిపోయా. ఎంతో గ్రాండియర్‌గా అనిపించింది. స్క్రీన్ మీద మోహన్ లాల్ కనిపిస్తే వావ్ అనిపిస్తుంది.

పృథ్వీరాజ్ సుకుమార్ గారు పాన్ ఇండియా డైరెక్టర్ కాబోతోన్నారు. అన్ని భాషల్లో ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘L2E: ఎంపురాన్’ చిత్రాన్ని  ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. ముర‌ళీ గోపి క‌థ‌ను అందించారు.  
 

Latest Videos

vuukle one pixel image
click me!