Anushka Shetty
Anushka Shetty : తెలుగు సినిమాలతో హీరోయిన్‌గా పరిచయం అయిన అనుష్క శెట్టి.. ఇక్కడ స్టార్ హీరోయిన్‌గా రాణించింది. దీంతోపాటు తమిళంలోనూ సినిమాలు చేసి మెప్పించింది. అక్కడ కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది.
Anushka Shetty
ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అనుష్క ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఎవరూ బాయ్‌ఫ్రెండ్ లేరా? అనుష్క ఫ్యామిలీలో ఏమీ చెప్పడం లేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై అనుష్క స్పందించింది.
Anushka Shetty
ఈ సందర్భంగా అనుష్క షాకింగ్ కామెంట్స్ చేసింది. రిలేషన్ గురించి ఆమె బోల్డ్ గా రియాక్ట్ అయ్యింది. 'భూమి మీద భయంతో నడిపే ఏ బంధం మీద నాకు నమ్మకం లేదు. అది రిలేషన్‌షిప్ అయినా, తల్లిదండ్రులైనా సరే' అంటూ షాకిచ్చింది.
Anushka Shetty
తల్లిదండ్రుల కంటే నేను దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతాను. దేవుణ్ణి నా ఫ్రెండ్ లా చూస్తాను. స్నేహం ఎంత గొప్పదంటే నొప్పి గురించి ఆలోచించదు.
Anushka Shetty
ఒక స్నేహితురాలిని కౌగిలించుకుని, ఎప్పుడూ మాట్లాడుకుంటూ, కోపం వస్తే కోప్పడేంత క్లోజ్‌గా దేవుడితో ఉంటాను. అలా ఉన్నప్పుడు లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పింది స్వీటి.