`మోసగాళ్లు` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కాజల్‌, రానా, సునీల్‌ శెట్టిలపై మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Mar 15, 2021, 10:09 PM IST

`విష్ణుకి అక్క పాత్రలో నటించేందుకు ఒప్పుకుని కాజల్‌ పెద్ద సాహసం చేసింది. ఆమెని అభినందిస్తున్నాను. ఆమె నాకు కూతురులాంటిది. అలాగే రానా నాకు కుమారుడు లాంటివాడు, అంతేకంటే మంచి ఫ్రెండ్‌ అని అన్నారు మోహన్‌బాబు. మంచు విష్ణు, కాజల్‌ నటించిన `మోసగాళ్లు` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

PREV
116
`మోసగాళ్లు` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కాజల్‌, రానా, సునీల్‌ శెట్టిలపై మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
సునీల్‌ శెట్టి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహించారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 19 క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు పుట్టిన‌రోజు కానుక‌గా విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైద్రాబాద్‌లో జరిగింది.

216
ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ, `మీ(సునీల్ శెట్టి) గురించి నేను ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాను. నా మాతృ భాష తెలుగు. నేను ఇంగ్లీష్‌లో మాట్లాడలేను. కానీ మీ కోసం మాట్లాడుతున్నాను. మీరు అద్భుతమైన నటులు. మీ సినిమాలు నేను చూస్తుంటాను. మీరు గొప్ప ఆర్టిస్ట్‌లు కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. మీకు విష్ణు అవకాశం ఇవ్వలేదు.. విష్ణుకే మీరు అవకాశం ఇచ్చారు. కాజల్ విష్ణు పక్కన అక్కగా నటించేందుకు ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ పాత్రను ఒప్పుకున్నందుకు ప్రశంసిస్తున్నాను. ఒక వేళ నీ (కాజల్) స్థానంలో నేను ఉంటే కచ్చితంగా ఒప్పుకునే వాడిని కాదు.

316
జీవితంలో ప్రతీ వ్యక్తి ఏదో ఒక విధంగా మోసపోతారు. మంచి తెలివితేటలున్నాయ్ మోసపోను అని చెబుతుంటారు. భారతదేశంలో ఇటువంటి స్కాం ఇప్పటి వరకు జరగలేదు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న యువత చూడాల్సిన సినిమా. అలాంటి కథను ధైర్యం చేసి విష్ణు తీశాడు. దాదాపు ఏడాది పాటు పరిశోధన చేశాడు. అలా ఎందుకు మోసం చేశారంటే.. తల్లిదండ్రులు పడిన అవమానం భరించ లేక.. ఆ అక్కాతమ్ముడు ఇలా మోసం చేస్తుంటారు. అక్కాతమ్ముడి సీన్స్ చూసి కంటతడి పెట్టేశాను.

416
ఫ్యామిలీ, సెంటిమెంట్స్, అర్థం, పరమార్థం ఉన్న సినిమా. సునీల్ శెట్టి పాత్ర అద్భుతంగా ఉంటుంది. మార్చి 19న నా పుట్టిన రోజు. అందుకే ఈ మూవీని రిలీజ్ చేసేలా ప్లాన్ చేశాడు విష్ణు. ఈ మూవీ హిట్ అవ్వాలని ఆ దేవుళ్లను కోరుకుంటున్నాను. సినిమా కోసం పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్` తెలిపారు.

516
రానా మాట్లాడుతూ, `విష్ణు ఫోన్ చేసి బెదిరించాడు. అందుకే ఈ ఈవెంట్‌కు వచ్చాను. నేను చిన్నప్పటి నుంచి సునీల్ శెట్టికి అభిమానిని. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఆయన సినిమా చూసి కండలు పెంచాలని ఫిక్స్ అయ్యాను. ఆయన ఇంకా తెలుగులో మరిన్ని చిత్రాలు చేయాలి. మార్చి 19న ఓ ప్రత్యేక వ్యక్తి (మోహన్ బాబు) బర్త్ డే. ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయండి. చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్` అని తెలిపారు.

616
మంచు విష్ణు మాట్లాడుతూ, `అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు సునీల్ శెట్టి గారికి థ్యాంక్స్. మీతో పని చేసిన ప్రతీ మూమెంట్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మా అక్క కాజల్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్. టాప్ పొజిషన్‌లో ఉన్న ఓ నటి ఇలా అక్క పాత్రను చేయడం మామూలు విషయం కాదు. కథ పంపించగానే అను పాత్ర బాగుందని చెప్పింది. అర్జున్ పాత్ర ఎవరు అని అడిగింది. నేనే చేస్తున్నాను చెప్పింది. ఓకే కానీ బాగానే ఉంటుంది కదా? అని అడిగింది.

716
సునీల్ శెట్టి మాట్లాడుతూ, `మోహన్ బాబు సోదరుడులాంటి వారు. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఫ్యామిలీతో కలిసి పని చేయడమంటే నా కల నెరవేరినట్టుంది. ప్రతీ సినిమా హిట్ అవ్వాలి.. అలా పరిశ్రమ బాగుండాలి.. అప్పుడే మేమంతా బాగుంటాం. నా తెలుగును భరించినందుకు థ్యాంక్స్. నేను బాగానే మ్యానేజ్ చేశానని అనుకుంటున్నాను. ప్రతీ రోజూ మధ్యాహ్నం మోహన్ బాబు ఇంటి నుంచి వచ్చే ఫుడ్ వల్ల బరువు కూడా పెరిగాను. వారు ఎంతో బాగా చూసుకున్నారు. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్` అని చెప్పారు.

816
నవదీప్ అద్భుతమైన నటుడు. నవీన్ చంద్ర బాగా నటించాడు. గౌతం రాజు గారు చేసిన ఎడిటింగ్‌ను ఇంగ్లీష్ వాళ్లు కూడా తీసుకున్నారు. ఇక్కడ అద్భుతమైన ప్రతిభ ఉంది. అక్కడ కొన్ని సమస్యలున్నాయని అంటే స్టంట్ శివ వెంటనే అమెరికా వచ్చి చేశారు. శ్యాం గారు సంగీతాన్ని అద్భుతంగా అందించారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. సక్సెస్ మీట్‌లో మళ్లీ మాట్లాడుతాను. మార్చి 19న సినిమా రాబోతోంది.. మీ అందరూ సినిమాను చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను` అని అన్నారు.

916
ఈ కార్యక్రమంలో నవదీప్‌, దర్శకుడు శ్రీను వైట్ల, రాజా రవీంద్ర, డైమండ్‌ రత్నబాబు, తదితరులు పాల్గొన్నారు. రవి, శ్యామల యాంకరింగ్‌ చేసి అలరించారు.

1016
`మోసగాళ్లు` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ దృశ్యాలు.

1116

1216

1316

1416

1516

1616

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories