డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు.. కెరీర్ బిగినింగ్ లో తన తొందరపాటు వల్ల చేజార్చుకున్న సినిమా ఏదో తెలుసా? మెహన్ బాబును తీసేసి చిరంజీవిని తీసుకున్న దర్శకుడు ఎవరు? ఆ సినిమా ఏంటి? అసలు మోహన్ బాబు ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలలో మోహన్ బాబు ఒకరు. హీరో అవ్వాలని పరిశ్రమకు వచ్చి.. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు చూశాడు మోహన్ బాబు. అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగిన మోహన్ బాబు.. విలన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి...చాలా సినిమాల్లో నెగెటీవ్ రోల్స్ చేశాడు. ఆతరువాత హీరోగా మారి.. సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగించారు.
ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన మోహన్ బాబు 45 ఏళ్ల కెరీర్ లో దాదాపు 500 కు పైగా సినిమాల్లో నటించారు. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా సక్సెస్ ఫుల్ లైఫ్ ను చూశాడు మోహన్ బాబు. ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవితో మోహన్ బాబుకు ఎక్కువగా పోటీ నడిచేది. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కూడా జరుగుతుంటుంది.
25
మోహన్ బాబు మిస్ బిహేవియర్ వల్ల
చిరంజీవి , మోహన్ బాబు మధ్య చాలా విషయాల్లో పోటీ వాతవారణం ఉండేది. మధ్య మధ్యలో కాస్త ఘర్షణ వాతావరణం కూడా కనిపించేది. అయితే చిరంజీవి సినిమా మోహన్ బాబు సినిమా తో పోటీ పడి డిజాస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతే కాదు మోహన్ బాబు తొందరపాటు వల్ల.. గోల్డెన్ ఆఫర్లు చిరంజీవి దగ్గరకు వెళ్లిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈక్రమంలోనే ఓ సినిమా మోహన్ బాబు చేయాల్సింది.. చిరంజీవి చేతికి వెళ్లింది. అది కూడా మోహన్ బాబు కొంత వరకూ షూటింగ్ చేసిన తరువాత.. ఆ సినిమాలో మోహన్ బాబును తప్పించి.. చిరంజీవిని తీసుకున్నారు. ఇంతకీ ఏంటా సినిమా?
35
ఇంటిగుట్టు సినిమా అసలు గుట్టు ఇదే..
సూపర్ హిట్ సినిమాల దర్శకుడు కె బాపయ్య దర్శకత్వంలో ఇంటిగుట్టు సినిమా తెరకెక్కింది. 1984 లో వచ్చిన ఈసినిమాలో చిరంజీవి, సుహాసిని నటించగా.. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈమూవీ కోసం ముందుగా మోహన్ బాబును తీసుకున్నారు బాప్పయ్య.
మోహన్ బాబుకి కోపం ఎక్కువని తెలిసిందే. ఓ రోజు షూటింగ్ కు మోహన్ బాబు వెళ్లగా.. కైకాల సత్యనారాయణకు సబంధించిన షూటింగ్ చేస్తున్నారు దర్శకుడు. మోహన్ బాబును కాస్త వెయిట్ చేయమన్నారట. కైకాలకు జ్వరంగా ఉండటంతో.. ఆయన సన్నివేశాలు ముందుగా చిత్రీకరించి... పంపించివేయాలని ప్లాన్ చేశారట.
మోహన్ బాబు మాత్రం తనను వెయిట్ చేయించడం తట్టుకోలేకపోయారట. నన్ను వెయిట్ చేయిస్తారా..? నేను వెళ్ళిపోతున్నాను అని బెదిరించారట. దర్శకుడు అదేమి పట్టించుకోకుండా.. సరే అన్నారట. మోహన్ బాబు కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో.. నెక్ట్స్ డే నుంచి మీరు రావద్దు.. వేరేహీరోను తీసుకున్నామని మోహన్ బాబుకి దర్శకుడు కబురు పంపించాడట. ఈ విషయాన్ని డైరెక్టర్ బాపయ్య స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
టాలీవుడ్‌లో మెగా మంచు ఫ్యామిలీస్ మధ్య బయటకు స్నేహం కనిపించినా.. లోపల కోల్డ్ వార్ గట్టిగా నడుస్తుంటుంది. మెగాస్టార్ చిరంజీవి - కలెక్షన్ కింగ్ మోహన్ బాబు... చాలా స్నేహంగా ఉన్నప్పటికీ, అనేక సందర్భాల్లో వీరి మధ్య వివాదం గట్టిగా నడిచిన విషయం తెలిసిందే. సినిమాల మధ్య పోటీ మాత్రమే కాదు, ఇండస్ట్రీకి సంబంధించిన చాలా విషయాల్లో వీరి మధ్య గొడవ తారాస్థాయిలోకి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి.
సినీ వజ్రోత్సవాల సమయంలో మోహన్ బాబు కామెంట్స్ ఎన్ని మంటలు రేపాయో అందరికి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య స్నేహం ఉన్నా...పోటీపడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాత్రం.. వార్ కంటీన్యూ అవుతూనే ఉంది. ఈమధ్య కాలంలో మా ఎలక్షన్స్ లో అది మరోసారి బయటపడింది.
55
చిరంజీవి దూకుడు
90వ దశకంలో మెగాస్టార్ దూకుడు మామూలుగా ఉండేది కాదు. ఆయన వరుస విజయాలతో దూసుకుపోయాడు. ఖైదీ సినిమా నుంచి చిరంజీవిని ఆపడం ఎవరి వల్ల కాలేదు. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి సినిమాలు ఇండస్ట్రీని దున్నేశాయి. అవే కాకుండా గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రీ లాంటి సినిమాలు చూసి ప్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు.
మెగాసినిమాలతో టాలీవుడ్ అల్లాడిపోయింది. ఆ టైమ్ లోనే మెహన్ బాబు కూడా స్టార్ హీరోగా ఉన్నారు. ఆయన కూడా హిట్ సినిమాలు చేశారు.. కానీ మెగా రేంజ్ ను మాత్రం అందుకోలేకపోయారు. మోహన్ బాబు, చిరంజీవి మధ్య ఈ రకమైన పోటీ అప్పటి నుంచే జరుగుతోంది. అది పెరుగుతూ వచ్చింది.