Intinti Gruhalakshmi: లాస్య ప్రవర్తనపై అనుమానపడుతున్న తులసి.. దివ్య విక్రమ్ ల పెళ్లి ఫిక్స్?

Published : Apr 03, 2023, 09:18 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఏప్రిల్ 3వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

PREV
17
Intinti Gruhalakshmi: లాస్య ప్రవర్తనపై అనుమానపడుతున్న తులసి.. దివ్య విక్రమ్ ల పెళ్లి ఫిక్స్?

ఈరోజు ఎపిసోడ్ లో తులసి అంతా సవ్యంగా జరుగుతోంది చాలామ్మ.నా కూతురు చాలా అదృష్టవంతురాలు అని అంటుంది. అప్పుడు లాస్య ఎంత అదృష్టవంతురాలు అనేది పెళ్లయ్యాక తెలుస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు తులసి లాస్యను గుడ్డిగా నమ్ముతూ తల్లి స్థానంలో నేను ఉండి చేయాల్సిన పని నువ్వు చేసావు థాంక్స్ అనడంతో అదే మాట నందు కూడా చెప్పు అంటుంది లాస్య. అప్పుడు ఇంకెందుకు ఆలస్యం రేపే పెళ్లిచూపులు ఏర్పాటు చేద్దాం అనడంతో తులసి సరే అని అంటుంది. అప్పుడు పరంధామయ్య దివ్యని ఆట పట్టిస్తూ ఉంటాడు.

27

ఆ తర్వాత రాజ్యలక్ష్మి కి లాస్య ఫోన్ చేయగా నిజాలు చెప్పి ఒప్పించవా అబద్ధాలు చెప్పి ఒప్పించావా నిజాలు చెప్పి ఒప్పించాను అనగా గుడ్ మరి తులసి ఫీలింగ్ ఏంటి అనడంతో ఎంత అయిన కూతురు ప్రేమించింది కదా అందుకే కాదనలేకపోయింది అని అంటుంది లాస్య. బలిచ్చే మేకలా తులసి తన కూతుర్నే తానే ముస్తాబు చేయబోతోంది అని అంటుంది లాస్య. మీ ఇంటికి కోడలు చేసి గుండెలు బాదుకునే ఏడుస్తుంది అనడంతో జీవితాంతం మా తల్లి కూతుర్లు ఏడుస్తూనే ఉండాలి అని అంటుంది రాజ్యలక్ష్మి. పెళ్లి చూపుల వరకు వచ్చింది అంటే ఆల్మోస్ట్ పెళ్లయిపోయినట్టే అనడంతో అలా కాదు మనం అనుకున్న డీలు ప్రకారం పెళ్లి కూడా నీ బాధ్యత అని అంటుంది రాజ్యలక్ష్మి.
 

37

ఎలాంటి అడ్డంకులు వచ్చినా నువ్వే చూసుకోవాలి అప్పుడే నీకు కావాల్సిన అమౌంట్ ని నేను ఇస్తాను అని అంటుంది రాజ్యలక్ష్మి. తర్వాత విక్రమ్ వచ్చి తన ప్రేమ విషయం గురించి రాజ్యలక్ష్మి తో చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు నాకు అంతా తెలుసు నాన్న నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు దివ్య కదా అనడంతో విక్రమ్ షాక్ అవుతాడు. అప్పుడు విక్రం రాజ్యలక్ష్మి మాటలకు సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు దివ్య వల్ల నీకు గాని మన ఇంట్లో గాని ఎటువంటి సమస్య రాదు అందుకు బాధ్యత నాది అని అంటాడు. రేపే పెళ్లిచూపులు అనడంతో విక్రమ్ సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు నందు ఆలోచిస్తుండగా దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారు రేపటి పెళ్లి చూపుల గురించి అని అనగా తొందరపడి పెళ్లి చూపులకు ఒప్పుకున్నామేమో అనడంతో దేని గురించి మీ అనుమానం అని అంటుంది తులసి. 
 

47

మొదటి విషయం లాస్య ఇన్వాల్వ్మెంట్ తన మీద నాకు నమ్మకం ఎప్పుడో పోయింది అని అంటాడు నందు. ఇది లాస్య తెచ్చిన సంబంధం కాదు దివ్య కోరుకున్న సంబంధం అని అంటుంది తులసి. అలాంటప్పుడు ఇందులో లాస్య ఎందుకు అంత ఇన్వాల్వ్ అవుతుంది. ఇందులో ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తోంది అనడంతో తులసి ఆలోచనలో పడుతుంది. లాస్య ఎప్పుడు ఒకరీ తల పై చేతులు పెట్టి పైకి ఎదగాలని చూస్తుంది అని అంటాడు నందు. నేను ఇప్పటికీ ఎప్పటికీ లాస్య మాటలు వినను, నమ్మను కానీ నిన్ను దివ్యని నమ్ముతున్నాను తను చానా పరిమితి చెందింది అని అంటుంది తులసి. దేని గురించి అయినా కానీ పూర్తిగా తెలుసుకొని గాని ఇటువంటి నిర్ణయం తీసుకోదు అని అంటుంది తులసి.
 

57

దివ్య పెళ్లి సమయంలో లాస్యని దూరం పెడదామా అనగా అది నాకు సంబంధం లేదు వ్యవహారం నేను చెప్పిన వినదు మీరే ఏదో ఒకటి చేయండి అని అంటుంది తులసి. కిందటిసారి పెళ్లి అప్పుడే చెప్పాను అయినా సిగ్గులేకుండా ఇన్వాల్వ్ అవుతోంది అనగా సరే మన జాగ్రత్తలో మనం ఉందాం అని అంటుంది తులసి. ఇక మరుసటి రోజు ఉదయం విక్రమ్ వాళ్ళు పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తారు. అప్పుడు లాస్య తనదే పెత్తనం అన్నట్టుగా హడావిడి చేస్తూ ఉంటుంది. రాజ్యలక్ష్మి కూడా దొంగ నాటకాలు ఆడుతూ తులసి మీద లేనిపోని ప్రేమను వలకబోస్తూ ఉంటుంది. అప్పుడు తులసి మీ అబ్బాయి సంజయ్ విషయంలో మా దివ్య చేసిన పనికి అనగా మాకు చాలా సంతోష పడింది ఒక అమ్మాయి జీవితాన్ని నిలబెట్టింది అని అంటాడు బసవయ్య.
 

67

అప్పుడు విక్రమ్ దివ్యని ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఆరాటంగా ఉంది అని అంటాడు. కాసేపు వెయిట్ చేయండి చిన్నబాబు అని అంటాడు దేవుడు. మరోవైపు దివ్య కూడా హాల్లోకి రావడానికి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత దివ్య రావడంతో విక్రమ్ దివ్య వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు దివ్య రాజ్యలక్ష్మి ఆశీర్వాదం తీసుకుంటుంది. అప్పుడు దివ్య, విక్రమ్ ఇద్దరు ఒకరివైపు ఒకరుచూసి సిగ్గుపడుతూ ఉంటారు. ఇది పేరుకి పెద్దలు కుదిరిసిన సంబంధమైన పిల్లలు ప్రేమించుకున్న సంబంధం అనడంతో అయినా సరే మనం సంప్రదాయంగా అడగాలి అని లాస్య అంటుంది. మా అమ్మాయిని చేసుకోవడం మీకు ఇష్టమేనా అని లాస్య అడగడంతో విక్రమ్ సిగ్గుపడుతున్నడంతో తొందరగా చెప్పండి బాబు అందరూ ఎదురు చూస్తున్నారు అని దేవుడు అనడంతో నాకు ఇష్టం కాదు అనగా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
 

77

నాదృష్టం అనడంతో అందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడు దివ్య కూడా నాక్కూడా ఇష్టమే అనడంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు రాజ్యలక్ష్మి బాగా నవ్వుకో దివ్య పెళ్ళైయాక నీకు ఆ క్షణం నవ్వు ఎప్పటికీ ఉండదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అందరికీ తెలిసిన విషయమైనా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను నందగోపాల్ గారు విడాకులు తీసుకున్నాను కూతురి పెళ్లి అని ఇతరులకు చేస్తున్నాము అనడంతో అన్ని తెలుసుకుని పెళ్లి సంబంధానికి ఒప్పుకున్నాను అని అంటుంది రాజ్యలక్ష్మి. వచ్చేటప్పుడు పెళ్లి సంబంధం కూడా ఖాయం చేసుకొని వచ్చాను వచ్చే నెల 17, 16 పెళ్లి అనడంతో మీ ఇష్టమే మా ఇష్టం అని అంటారు నందు తులసి. ఆ తర్వాత ఇంటికి వెళ్లి రాజ్యలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు బసవయ్య రాజ్యలక్ష్మిని మరింత రెచ్చగొడుతూ ఉంటాడు.

click me!

Recommended Stories