జూనియర్ ఎన్టీఆర్ , రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా? కారణం ఏంటి?

Published : Nov 12, 2025, 03:03 PM IST

Jr NTR and Ram Gopal Varma Missed Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది? ఊహకు కూడా అందడంలేదు కదా..?  వీరి కలయికలో ఓ సినిమా రావాల్సి ఉంది.. కానీ అది ఎలా మిస్ అయ్యిందో  తెలుసా?

PREV
15
నందమూరి నటవారసత్వం నిలబెట్టిన హీరో

నందమూరి కుటుంబానికి చెందిన మూడవ తరం హీరోగా తెరపైకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కెరీర్ ప్రారంభ దశలోనే వరుస విజయాలతో దూసుకుపోయాడు. వరుసగా సక్సెస్ లుతగులుతున్నా.. తారక్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘సింహాద్రి’ సినిమానే. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి, ఎన్టీఆర్‌కు టాలీవుడ్‌లో సుస్థిర స్థానం ఇచ్చింది. ఈ సినిమా విజయం తర్వాత సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్‌తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాడట.

25
అమితాబచ్చన్ వల్ల ఆగిపోయిన సినిమా..?

రామ్ గోపాల్ వర్మ చెప్పిన కథ ఎన్టీఆర్ కు నచ్చిందట. సినిమా చేయాలని కూడా అనుకున్నట్టు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ దగ్గరే ఆగిపోయిందట. దానికి కారణం ఎవరో కాదు.. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబచ్చన్. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఎన్టీఆర్‌తో చేయాల్సిన ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడు, రామ్ గోపాల్ వర్మకు అమితాబ్ బచ్చన్ నుంచి ఆఫర్ వచ్చింది. దాంతో ఎన్టీఆర్ సినిమా అటకెక్కింది.

35
బాలీవుడ్ కి వెళ్లిపోయిన్ వర్మ..

అమితాబ్‌ బచ్చన్ డేట్స్ దొరకడంతో ఆ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడట రామ్ గోపాల్ వర్మ. ఇక ఎన్టీఆర్ సినిమాన కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు. ఎన్టీఆర్ కూడా అంగీకరించినప్పటికీ, ఆ తర్వాత వర్మ పూర్తిగా బాలీవుడ్ వైపు వెళ్ళిపోవడం, అక్కడ వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో.. ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి చర్చ జరగలేదు. దీంతో ఆర్జీవీ-ఎన్టీఆర్ కలయికలో రావాల్సిన సినిమా అలా మిస్ అయ్యింది. ఆ సినిమా వచ్చి ఉంటే ఎలా ఉండేదో అని.. ఫ్యాన్స్ సరదాగా ఊహించుకుంటున్నారు.

45
అభిమానులు ఏమంటున్నారంటే?

కొంత మంది ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్, వర్మ కాంబోలో సినిమా వచ్చి ఉంటే తప్పకుండా భారీ విజయాన్ని సాధించేదని అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ ఎనర్జీ, వర్మ టేకింగ్ కాంబోతో సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచే అవకాశం ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పడంటే రామ్ గోపాల్ వర్మ సినిమాల తీరు మారింది.. కానీ ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలకు వరుసగా హిట్లు ఇచ్చాడు ఆర్జీవీ. శివ సినిమాతో నాగార్జున కెరీర్ ను కంప్లీట్ గా టర్న్ చేసింది వర్మనేగా.

55
ప్రశాంత్ నీల్ సినిమాతో తారక్ బిజీ

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీ చేస్తున్నాడు. ఈసినిమా తరువాత దేవర పార్ట్ 2 సెట్ లో జాయిన్ కాబోతున్నాడు. ఆతరువాత ఆయన మరికొన్ని పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టినట్టు సమాచారం. బాలీవుడ్ నుంచి కూడా తారక్ తో సినిమాలు చేయడానికి దర్శకులు క్యూలో ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories