సమంత ఇక నటిగా కంటే బిజినెస్ ఉమెన్ గా ఎక్కువ యాక్టివ్ అవుతోంది. హీరోయిన్ నుంచి నిర్మాతగా మారిన ఆమె.. అటు వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది. కొత్తగా మరో బిజినెస్ ను ఓపెన్ చేసింది సామ్... సినిమాలకు గుడ్ బై చెపుతుందా?
దాదాపు ఒక దశాబ్ధం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది సమంత. వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోయింది. టాలీవుడ్ లో ప్రభాస్ తప్పించి.. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది సమంత. ఇక నాని, నాగచైతన్య, నితిన్ లాంటి 2 టైర్ హీరోల సరసన కూడా సందడి చేసింది సామ్. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న టైమ్ లో.. బిజినెస్ పై ఎక్కువ దృష్టి పెట్టింది. పలు బ్రాండ్స్ కు పబ్లిసిటీ చేస్తూ.. కొత్తగా క్లాతింగ్, జ్యూవెల్లరీ బ్రాండ్ ను కూడా ఆమె స్టార్ట్ చేసింది.
25
నిర్మాతగా సమంత..
నాగచైతన్యతో విడాకులు, మయోసైటిస్ వ్యాధితో ఇండస్ట్రీ నుంచి గ్యాప్ వచ్చింది సమంతకు. దాంతో ఓ ఏడాదికిపైగా రెస్ట్ తీసుకుని తన వ్యాధికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. ఆతరువాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చినా కూడా.. నటిగా మాత్రం పూర్తి స్థాయిలో యాక్టీవ్ అవ్వలేదు సామ్. నిర్మాతగా మారి సినిమాలు తీయ్యడం స్టార్ట్ చేసింది. ఆమె ప్రొడ్యూసర్ గా చేసిన శుభం సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో చిన్న బడ్జెట్ సినిమాలునిర్మిస్తూ.. తన బిజినెస్ లను పెంచుకుంటూ వెళ్తోంది సమంత.
35
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన హీరోయిన్
ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరో కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. నటిగా అద్భుతమైన విజయాలను అందుకున్న సమంత.. వ్యాపార రంగంలోనూ తన ప్రతిభను చాటుకుంటుంది. తాజాగా సమంత కొత్త ఫ్యాషన్ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. సమంత ‘ట్రూలీ స్మా’ పేరుతో తన తాజా క్లాతింగ్ బ్రాండ్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. “ఒక కొత్త అధ్యాయం మొదలైంది” అనే క్యాప్షన్‌తో ఓ ప్రమోషనల్ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇప్పటికే సమంత ‘సాకీ’ (Saaki) పేరుతో ఫ్యాషన్ బ్రాండ్‌ను విజయవంతంగా నడుపుతుంది. అలాగే ఇటీవలే ఆమె పెర్ఫ్యూమ్ బిజినెస్‌లో కూడా అడుగు పెట్టిన సమంత...తాజాగా ‘ట్రూలీ స్మా’ ద్వారా ఫ్యాషన్ రంగంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించబోతోంది. ఇక సోషల్ మీడియా ద్వారా అభిమానులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. “నటిగా మాత్రమే కాదు, వ్యాపారవేత్తగా కూడా సమంత సక్సెస్ కావాలి” అంటూ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు.
55
సినిమాలకు గుడ్ బై చెపుతుందా?
మరోవైపు, సమంత సినిమాల పరంగా కూడా బిజీగా ఉన్నారు. ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ స్థాపించి, నిర్మాతగానూ మారింది. ప్రస్తుతం ఈ సంస్థ ద్వారా ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తుండగా, దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా, బాలీవుడ్‌లో రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్‌లోనూ సమంత నటిస్తుంది. అయితే సమంత వరుసగా మూడు బిజినెస్ లతో బిజీగా ఉండటంతో.. త్వరలో ఆమె సినిమాలకు గుడ్ బై చెపుతుందని టాక్ వినిపిస్తోంది. నటిగా ఇప్పటికే సినిమాలు తగ్గించిన సమంత.. నిర్మాతగా కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయంలో సమంత నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం రకరకాల రూమన్స్ వినిపిస్తున్నాయి.