Allu Arjun, #Pushpa2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప 2`తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. నేటితో(నవంబర్ 17) ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పాట్నాల ట్రైలర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అందుకోసం భారీ ఈవెంట్‌ని ప్లాన్ చేశారు. దీనితో సినిమాపై హైప్‌ని అమాంతం పెంచబోతున్నారు. ఈ రోజు నుంచి సినిమా రిలీజ్ వరకు గ్యాప్ లేకుండా ఇండియాలో ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్లు ప్లాన్ చేసింది టీమ్. దీంతో ఈ ప్రమోషన్స్ లో బన్నీ బిజీగా ఉండబోతున్నారు.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Allu Arjun
అనంతరం అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సి ఉంది. అలాగే సందీప్ రెడ్డి వంగాతోనూ ఓ మూవీ చేయాల్సి ఉంది. వీటితోపాటు `పుష్ప3` కూడా ఉంటుందని ఇటీవలే హింట్ ఇచ్చారు బన్నీ.
త్రివిక్రమ్, సందీప్ సినిమాల తర్వాత పార్ట్ 3 ఉండే అవకాశం ఉంది. ఈ లోపు కొత్త ప్రాజెక్ట్ లు సెట్ అయితే అప్పుడు లెక్కలు మారిపోతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇమ్మీడియెట్‌గా బన్నీ .. త్రివిక్రమ్‌తో సినిమాని ప్రారంభించబోతున్నారని సమాచారం.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఇప్పటికే `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `అల వైకుంఠపురములో` చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు మరో హిట్‌కి రెడీ అవుతున్నారు. నెక్ట్స్ బన్నీ సినిమా త్రివిక్రమ్‌తో ఉంటుందని ఇటు నిర్మాత నాగవంశీ, అటు మరో నిర్మాత బన్నీవాసులు తెలిపారు.
హారికా అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ కాంబినేషన్‌లో ఈ మూవీ ఉండబోతుంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కాబోతుందట. సమ్మర్‌లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో త్రివిక్రమ్ బిజీగా ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన కథ లీక్ అయినట్టు సమాచారం. మైథలాజికల్ టచ్‌తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
సుమారు ఏడెనిమిది వందల కోట్లు దీనిపై ఇన్వెస్ట్ చేయబోతున్నారని సమాచారం. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు చేయలేదు త్రివిక్రమ్. బన్నీ సినిమాతో పాన్ ఇండియా గేమ్‌లోకి ఆయన అడుగుపెట్టబోతున్నారని సమాచారం.
Allu Arjun
అంతేకాదు దీనికి సంబంధించిన మరో రూమర్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. హిస్టారికల్ అంశాలతో సినిమా ఉంటుందని తెలుస్తుంది. మంగోల్ సామ్రాజ్యానికి మొదటి రాజు అయిన చెంఘీజ్(జెంఘీస్) ఖాన్ చరిత్రని ఆధారంగా చేసుకుని ఈ మూవీని తెరకెక్కించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
చెంఘీస్ ఖాన్ మంగోలియన్‌లను ఏకంగా చేసి మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. దీనికి ఆయనే ఆధ్యుడు. ఆయన జీవితంలోని ప్రధాన ఘట్టాలను తీసుకుని ఈ కథని రెడీ చేస్తున్నారనే రూమర్ కూడా వినిపిస్తుంది. మరి ఇందులో ఏది నిజమనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే ఇది `బాహుబలి`ని మించిన స్టోరీ కాబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ మూవీ రేంజ్‌ని కూడా ఊహించడం కష్టమే.