Miss World 2025: టాప్ మోడల్ ఛాలెంజ్ విజేతలు వీళ్ళే..గ్రాండ్ ఫినాలేకి దూసుకుపోయిన నందిని గుప్తా

Published : May 25, 2025, 08:53 AM ISTUpdated : May 25, 2025, 02:18 PM IST

శనివారం సాయంత్రం నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 టాప్ మోడల్ ఛాలెంజ్ లో మిస్ ఇండియా నందిని గుప్తా ఆసియా-ఓషియానా విజేతగా ఎంపికయ్యారు.

PREV
17
టాప్ మోడల్ ఛాలెంజ్

హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు క్రమంగా తుది దశకి చేరుకుంటున్నాయి. తాజాగా ఈ పోటీల్లో అత్యంత కీలకమైన టాప్ మోడల్ ఛాలెంజ్ ముగిసింది. ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరిని నిర్వాహకులు విజేతలుగా ప్రకటించారు.

27
అదరగొట్టిన నందిని గుప్తా 

హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 టాప్ మోడల్ చాలెంజ్‌లో మిస్ ఇండియా నందిని గుప్తా ఆసియా-ఓషియానా విజేతగా ఎంపికయ్యారు. టాప్ మోడల్ ఛాలెంజ్ రెండు రౌండ్లుగా జరిగింది.

37
టాప్ మోడల్ విజేతలు వీరే

ఈ టాప్ మోడల్ చాలెంజ్‌లో ఖండాల వారీగా విజేతలను వారి అభిరుచి, ఆత్మవిశ్వాసం, ర్యాంప్‌ వాక్ నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేశారు. ఆసియా-ఓషియానా టాప్ మోడల్ విజేతగా భారత్ నిలిచింది. ఇండియాకి చెందిన నందిని గుప్తా టాప్ మోడల్ విజేతగా నిలిచారు. మిస్ నమీబియా సెల్మా కమాన్యా (ఆఫ్రికా), మిస్ మార్టినిక్ ఆరెలీ జోచిమ్ (అమెరికా), మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గెర్హార్డ్ (యూరప్) ఇతర ఖండాల విజేతలుగా నిలిచారు.

47
చేనేత వస్త్రాలతో మెరుపులు 

ఈ ఈవెంట్ కేవలం అందాల పోటీ మాత్రమే కాకుండా, సాంస్కృతిక వైభవాన్ని, ఫ్యాషన్‌ను, తెలంగాణ చేనేత వస్త్రాల సంపదను ప్రదర్శించే వేదికగా నిలిచింది. పోటీదారులు పోచంపల్లి, గద్వాల్, గొల్లభామ వంటి వృత్తిపరంగా నైపుణ్యం కలిగిన హ్యాండ్లూమ్ బట్టలు ధరించి ర్యాంప్‌పై మెరిశారు. ముత్యాల నగరమైన హైదరాబాద్‌కు గౌరవంగా, ముత్యాల స్ఫూర్తితో రూపొందించిన వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రత్యేక దుస్తులను ప్రఖ్యాత డిజైనర్ అర్చనా కొచ్చర్ రూపొందించారు.

57
నందిని గుప్తాకి పోటీగా న్యూజిలాండ్ సుందరి 

మొదట ప్రతీ ఖండం నుంచి ఇద్దరు ఫైనలిస్టులను ఎంపిక చేశారు. ఆఫ్రికా నుంచి మిస్ కోట్ డి ఐవోయిర్ ఫటౌమాటా కూలిబాలీ, మిస్ నమీబియా సెల్మా కమాన్యా ఎంపిక కాగా, అమెరికా నుంచి మిస్ మార్టినిక్ ఆరెలీ జోచిమ్, మిస్ వెనెజులా వాలేరియా కన్నవో ఎంపికయ్యారు. ఆసియా-ఓషియానా నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా, మిస్ న్యూజిలాండ్ సామంతా పూల్, యూరప్ నుంచి మిస్ బెల్జియం కారెన్ జాన్సెన్, మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గెర్హార్డ్ ఫైనలిస్టులుగా నిలిచారు.

67
ఇతర అవార్డులు 

ఇతర ప్రత్యేక అవార్డుల్లో, ఉత్తమ డిజైనర్ డ్రెస్ కేటగిరీలో మిస్ సౌత్ ఆఫ్రికా జొలైస్ జాన్సెన్ వాన్ రెన్స్‌బర్గ్, మిస్ ప్యూర్టోరికో వాలేరియా పెరెజ్, మిస్ న్యూజిలాండ్ సామంతా పూల్, మిస్ ఉక్రెయిన్ మారియా మెల్నిచెంకో విజేతలుగా గుర్తింపు పొందారు. వారు ధరించిన ప్రత్యేక డిజైనర్ దుస్తులకు సముచిత న్యాయం చేస్తూ నైపుణ్యం కనబరిచారని నిర్వాహకులు ప్రశంసించారు.

77
మే 31న గ్రాండ్ ఫినాలే 

ఈ కార్యక్రమం భారతీయ సంప్రదాయాలను ఆధునికతతో మిళితం చేస్తూ, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా సాగింది. మిస్ ఇండియా నందిని గుప్తా ఆసియా- ఓషియానా ఖండం విజేతగా నిలిచిన ఈ ఘట్టం దేశానికి గర్వకారణంగా మారింది. మే 31న హైటెక్స్ లో మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఉంటుంది. టాప్ మోడల్ ఛాలెంజ్ లో విజేతలుగా నిలిచిన వాళ్ళు గ్రాండ్ ఫినాలేలో క్వాటర్ ఫైనలిస్ట్ లుగా అర్హత సాధించారు. దీనితో ఇండియా నుంచి నందిని గుప్తా గ్రాండ్ ఫినాలేకి దూసుకుపోయింది. 

Read more Photos on
click me!

Recommended Stories