తేజ సజ్జా తాను సంపాదించిన ప్రతి రూపాయి ఏం చేస్తాడో తెలుసా.. రెమ్యునరేషన్ 2 కోట్ల నుంచి 15 కోట్లకి జంప్ ?

Published : Sep 15, 2025, 10:46 AM IST

తేజ సజ్జా తాను సంపాదించిన ప్రతి రూపాయిని ఏం చేస్తాడో అనేది రివీల్ చేశారు. జాంబీ రెడ్డి చిత్రానికి 25 లక్షల రెమ్యునరేషన్ అందుకున్న తేజ సజ్జా ఇప్పుడు ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా.. ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
రెండేళ్లలో 2 పాన్ ఇండియా హిట్స్ 

 యువ హీరో తేజ సజ్జా బాక్సాఫీస్ వద్ద చిచ్చర పిడుగులా చెలరేగిపోతున్నాడు. రెండేళ్లలో రెండు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్స్ ని తేజ సజ్జా సొంతం చేసుకున్నాడు. 2024లో తేజ సజ్జా నటించిన హనుమాన్ చిత్రం ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టింది. ఆ చిత్రం అంతటి విధ్వంసం సృష్టిస్తుంది అని ఎవరూ ఊహించలేదు. తేజ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

25
50 కోట్ల బడ్జెట్ లో మైండ్ బ్లోయింగ్ విజువల్స్ 

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వలో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం కూడా సూపర్ హీరో కథతోనే రూపొందింది. మంచు మనోజ్ విలన్ గా నటించారు. మిరాయ్ చిత్రాన్ని కేవలం 50 కోట్ల బడ్జెట్ లో నిర్మించి అద్భుతమైన విజవల్స్ రాబట్టారు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులో తేజ సజ్జా సహకారం కూడా ఉంది. 

35
మిరాయ్ చిత్రానికి రెమ్యునరేషన్ ఎంతంటే 

హనుమాన్ చిత్రానికి తేజ సజ్జా 2 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. ఆ మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ తేజ సజ్జా రెమ్యునరేషన్ పెంచలేదు. మిరాయ్ చిత్రానికి విజువల్స్ చాలా కీలకం. అందుకు తన రెమ్యునరేషన్ పెంచకుండా తేజ సజ్జా నిర్మాతకు సహకరించారు. తద్వారా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇంకొంత ఎక్కువ మొత్తం ఖర్చు చేసే వీలు నిర్మాతకి దర్శకుడికి కలిగింది. మిరాయ్ కి కూడా తేజ సజ్జా 2 కోట్లు మాత్రమే తీసుకున్నారు. 

45
2 కోట్ల నుంచి 15 కోట్లకి జంప్ 

మిరాయ్ కూడా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం 70 కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. తేజ సజ్జా ఇకపై నటించే చిత్రాలకు తన రెమ్యునరేషన్ భారీ స్థాయిలో పెంచేస్తునట్లు వార్తలు వస్తున్నాయి. హను మాన్, మిరాయ్ రెండు చిత్రాలకు 2 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్న తేజ సజ్జా.. ఇకపై 15 కోట్లు ఛార్జ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

55
సంపాదించిన ప్రతి రూపాయి ఏం చేస్తాడంటే 

తేజ సజ్జా లీడ్ రోల్ లో నటించిన తొలి చిత్రం జాంబీ రెడ్డి. ఈ చిత్రానికి తేజ సజ్జాకి రెమ్యునరేషన్ 25 లక్షలు ఇచ్చారట. ఆ డబ్బు మొత్తాన్ని తేజ సజ్జా ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపారు. తాను సంపాదించే ప్రతి రూపాయి విషయంలో జాగ్రత్తగా ఉంటానని తేజ సజ్జా పేర్కొన్నారు. రెమ్యునరేషన్ గా వచ్చే ప్రతి రూపాయిని ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తేజ పేర్కొన్నారు. అగ్ర హీరోలు కాకుండా.. టాలీవుడ్ లో వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న ఏకైక హీరో తేజ సజ్జా మాత్రమే. 

Read more Photos on
click me!

Recommended Stories