Guppedantha Manasu: తెలివిగా ప్రమాదం నుంచి బయటపడ్డ ధరణి.. జగతికి సలహా ఇస్తున్న మినిస్టర్!

Published : Jun 19, 2023, 10:23 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి రేటింగ్ సంపాదించుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంటుంది. అయినవాళ్ల నమ్మకద్రోహానికి భలే ఒంటరిగా మిగిలిపోయిన ఒక లెక్చరర్ కథ  ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Guppedantha Manasu: తెలివిగా ప్రమాదం నుంచి బయటపడ్డ ధరణి.. జగతికి సలహా ఇస్తున్న మినిస్టర్!

 ఎపిసోడ్ ప్రారంభంలో రిషి ఇంట్లోంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి చిన్న అత్తయ్య ఎన్నో అవమానాలని ఎదుర్కొంటున్నారు. ఆవిడ బాధని చూడలేకపోతున్నాను. నిజం చెప్పమని చిన్న మామయ్య ఎంత బ్రతిమాలిన నిజం చెప్పలేకపోతున్నారు. కానీ ఎలా అయినా చిన మామయ్యకి నేను నిజం చెప్తాను అనుకొని మహేంద్ర దగ్గరికి వెళ్తుంది ధరణి.
 

29

చిన్న మామయ్య మీరు చిన్న అత్తయ్య ఎప్పుడు కలిసి కాలేజీకి వెళ్లేవారు ఏ నిర్ణయమైనా కలిసే తీసుకునేవారు కానీ వీరిద్దరూ ఇలా ఉండడం నేను భరించలేకపోతున్నాను. అత్తయ్యకి కూడా రిషి అంటే చాలా ఇష్టం కానీ అలా చేశారు అంటే ఏదైనా బలమైన కారణం ఉంటుందని మీరు ఎందుకు అనుకోలేకపోతున్నారు అంటుంది. నేను కాదనట్లేదు కదా ఆ కారణం ఏంటో చెప్పమంటున్నాను కానీ తను చెప్పడం లేదు.
 

39

 తనని బాధపెడుతున్నాను అంటున్నావు కానీ నేను ఎంత బాధ పడుతున్నానో నీకు అర్థం కావడం లేదు నేను పోగొట్టుకున్నది వస్తువుని కాదు నా కొడుకుని అంటాడు మహేంద్ర. నాకు రిషి గురించి తెలిసిన విషయాలు చెప్తాను మీకు రిషి గురించి విషయాలు మీరు చెప్పండి అంటుంది ధరణి. మహేంద్ర సరే అనటంతో రిషి గురించి మీకేమీ చెప్పలేదా అని అడుగుతుంది.
 

49

 లేదు అంటాడు మహేంద్ర. అప్పుడు రిషి గురించి చెబుదాము అనుకుంటుంది ధరణి కానీ అంతలోనే శైలేంద్ర అడుగుల చప్పుడు విని వాటర్ బాటిల్ ని తన కాళ్ళ మీద పడేసుకుని నొప్పి అంటూ ఆక్ట్ చేస్తుంది.శైలేంద్ర పరుగున వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. వాటర్ బాటిల్ కాళ్ళ మీద పడిపోయింది అని మహేంద్ర చెప్పి తనకి నొప్పిగా ఉన్నట్లుంది చెయ్యి పట్టుకుని గదికి తీసుకువెళ్ళు అని శైలేంద్ర కి చెప్తాడు.

59

సరే అంటూ ధరణి చేయి పట్టుకొని బయటికి తీసుకు వచ్చిన శైలేంద్ర  కావాలనే బాటిల్ పడేసుకున్నావా.. నువ్వు చెప్పిన సమాధానాన్ని బట్టి ట్రీట్మెంట్  ఉంటుంది అంటాడు. ఈ దెబ్బకి ట్రీట్మెంట్ అక్కర్లేదు అని తెలివిగా సమాధానం ఇస్తుంది ధరణి. మరోవైపు కాలేజీ లోపలికి వెళ్లకుండా గ్రౌండ్ లోనే కూర్చున్న కేడి బ్యాచ్ కి రిషి రూపం కొత్తగా కనిపిస్తుంది. ఏంటి సార్ ఈ కొత్త గెటప్ అని అడగడంతో పర్సనల్ విషయాలు ఇక్కడ మాట్లాడొద్దు అయినా క్లాస్ కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు అంటాడు రిషి.

69

 ఎన్విరాన్మెంట్ క్లాస్ కదా నాలుగు గోడల మధ్య ఏం చెప్తారు ఎక్కడైతే బాగుంటుంది కదా అని వెటకారంగా అంటారు కేడి బ్యాచ్. అవునా ఎన్విరాన్మెంట్ ప్రేమికులైతే ఎన్విరాన్మెంట్ ఎప్పుడూ శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి గ్రౌండ్ అంతా చాలా చండాలంగా ఉంది ముందు ఈ గ్రౌండ్ ని క్లీన్ చేయండి అని ఆర్డర్ వేయడంతో మళ్లీ పదిమంది ముందు ఎక్కడ పరువు పోతుందో అని గ్రౌండ్ మొత్తం క్లీన్ చేస్తారు కేడి బ్యాచ్.
 

79

రిషి వాళ్లకి హెల్ప్ చేస్తాడు. మరోవైపు తన దగ్గరికి వచ్చిన ధరణితో నువ్వు రిషికి ఏదో ప్రమాదం ఉండబట్టే అతనిని అక్కడి నుంచి పంపించేసావు అని అర్థమైంది. ఆ విషయాలన్నీ పక్కన పెట్టు రిషి వెళ్ళిపోయిన దగ్గర నుంచి కాలేజీ అనే విషయంలోనే వెనక పడుతుంది ముందు దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పాడు మినిస్టర్. అలాగే సార్ మన పర్సనల్ విషయాలు మన ఆశయానికి అడ్డు రాకూడదు ఆ పని మీదే ఉండి కాలేజీని ముందుకి తీసుకువెళ్తాను అంటుంది జగతి.

89

 మరోవైపు తననే ఫాలో అవుతున్న వసుని చూసి ఆమెతో మాట్లాడకుండా గతము గుర్తు చేయద్దు అని చెప్పి చీటీ రాసి చెట్టుకి పెడతాడు రిషి. అది చూసిన వసు నన్ను గతాన్ని గుర్తు చేయద్దు అని చెప్పి మీరే నన్ను గుర్తు చేసుకుంటున్నారు. మన బంధం విడిపోనిది కాదు సార్ అని మనసులోనే అనుకుంటుంది. మరోవైపు జగన్నాథం గారితో కూర్చొని చెస్ ఆడుతూ ఉంటాడు రిషి. ఏంజెల్ జగన్నాధాన్ని డిస్క్రైజ్ చేస్తూ ఉంటుంది.
 

99

 ఆయనని నువ్వు ఎంకరేజ్ చేయాలి కానీ డిస్క్రైబ్ చేయకూడదు అంటాడు రిషి. నువ్వు కూడా మీ తాత చెప్పినట్లే నడుచుకునే వాడివా ఎప్పుడూ ఆయనని డిస్క్రైజ్ చేయలేదా అని అడుగుతుంది ఏంజెల్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories